బంధం తప్ప నిర్బంధం కాదది
హక్కులే తప్ప బాధ్యతలు లేనిది!
వద్దనుకుంటే తేలికగా వదిలించుకోవచ్చు…
కట్టుబాట్లు,నైతిక విలువలు, సంస్కృతీ సాంప్రదాయాలు…
అన్నీ జాన్తానై!
మోజు తీరాక దులపరించుకుని విడిచి వెళ్ళేది మగవాడే
దగాపడేది అలవాటుగా ఆడదే
ఏ రాయి అయితేనేమి…
నడుమ నలిగేది స్త్రీలు, పిల్లలే!
పాపము, నేరము కాదన్నది అత్యున్నత న్యాయస్థానం తీర్పు…
హ్యాపీ మేరేజెస్-ఈజీ డివోర్సెస్!
అవివాహితుల సహజీవనమంటే
అదోరకం మాట
వివాహితుల సహజీవనం…
ఇదెక్కడికి బాట…?!
ఇడుములెన్ని పడినా… వివాహబంధం
వీడని సీతారాముల జంటను ఆదర్శంగా చూపే పవిత్ర భారతదేశం
సహజీవనాలకు అవుతోంది ఆలవాలం!
శ్రీరస్తు…శుభమస్తు దీవెనలు
అందివ్వాలి పెద్దలు
ప్రపంచం మెచ్చిన భారతీయ
వివాహ వ్యవస్థకు!
-చంద్రకళ.దీకొండ,
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~