ఇదీ నా గత చరిత్ర -(కవిత ) -వెంకటేశ్వర రావు కట్టూరి


మసకబారిన కన్నులతో
కళ్ళద్దాలు తుడుచుకుంటూ
గతకాలపు వైభవాన్ని
తలుచుకొంటూ
ముత్యాల కోవాల్లాంటి
అక్షరాలను తడుముకుంటూ ఉండగా
రివ్వున ఎగురుకొంటూ వచ్చిందో గబ్బిలాయి
చంద్రోదయపు వెలుగులతో
నిత్యం పచ్చతోరణాలతో
కవితాగానాలతో అలరారుతూ
శిబిక మీద ఊరేగే నీవు
గ్రహణం పట్టిన సూర్యుడిలా
నాలాగా నల్లగా మారావేమని ప్రశ్నించిందో కుర్ర గబ్బిలాయి
‘కోటి గొంతుల కిన్నెర మీటుకొంటూ
కోటి గుండెల కంజెర కొట్టుకొంటూ’
వినిపింతునిక
నేటి నా తెలుగు సాహిత్యపు కన్నీటి పాట
ఆలకించవయా ఓ గబ్బిలపుటబ్బీ!
ఆది కవితగా అక్షరాకృతి దాల్చి
“ఆంధ్ర భాష యమృత మాంధ్రాక్షరంబులు-
మరువు లొలుకు గుండ్ర ముత్తియములు”లని
నన్నయతిక్కనాథులచే కీర్తి పొందినా
అలతి యలతి పదాలతో
తేట తెనియల పలుకులు
వెదజల్లినా
వెలయేండ్ల చరిత కలిగినా
విదేశీయులచే
“ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్” గా
పిలవబడినా
“దేశభాషలందు తెలుగు లెస్స”యని
రాయలోరిచే చెప్పబడి
“సుందర్ తెలుంగ”ని తమిళ కవులతో కొలవబడి
సంకీర్తనాచార్యునిచే కీర్తినొందా
పారిభాషిక పద బంధాలతో
సరస సంభాషణలతో
సంధులు సమాసాలతో
చంధస్సలంకారాల
వ్యాకరణాలతో అలరించినా
ఛలోక్తులు చమత్కారంగా విసిరినా
సామెతలతో సవరించినా
‘నండూరి’ ఎంకి పాటనై
పంట చేల గట్లపై తిరుగాడినా
‘పెన్నేటి పాట’నై ఎలుగెత్తి పాడినా
‘అదెవో తెలుగు తల్లి
అందాల నిండు జాబిల్లి’యని
శ్రీశ్రీ కలం నుండి జాలువారినా
‘ఆకులో ఆకునై పూవులో పూవు’నై
సినీ ప్రపంచాన్ని ఏలి
‘మా తెలుగు తల్లికి మల్లె పూదండా’అని
స్వర రాగమాలపించి
‘తేనెకన్నా మధురంగా తెలుగ’ని
ఆరుద్ర చే ఆత్రంగా చెప్పబడ్డా బిడ్డా !!
ఇదే నాచరిత
వినరా భారత వీరకుమారా విజయం మనదేరా అంటూ ‘నాజర్’ గొంతులో చిందులేసినా…
నేడు తెలుగునేలపై
‘గత చరిత్ర ఘన చరిత్ర
ఎంత ఖ్యాతి గర్వించదగ్గ- జాతి తెలుగు జాతి’
అంటూ నే గొప్పలు చెప్పినా
‘తెలుగే గొప్ప భాష’ యనిగొంతు చించుకున్నా
‘తెలుగు పరిమళాలు’ వెదజల్లుతున్నా
‘ఐ డోంట్ నో టెల్గ’నచూ
ఈసడించ బడుతున్నా
నేటి ఆధునిక తరానికి
ఆంగ్ల వ్యామోహంలో పడి
గంగిరెద్దులా తలాడిస్తున్నారు
నా తెలుగు బిడ్డలు
తమిళుల్ని చూసైనా బుద్ది తెచ్చుకోమని చెప్పయా
ఓ తైలపాయికా !
‘ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేల్ తపెట్టవోయ్’ యన్న పిలుపుతోనైనా
మేలుకొమ్మని తెలియజెప్పయా
‘తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి’మనదంటూ
స్వాభిమానంతో బతకమని
దండోరా చాటించవయా
ఓ నా తబిసిపిట్టా…
‘గబ్బిలమా! నా మనోబలమా!
ఇది నా గత చరిత్ర
ఇదీ నా ఘన చరిత్ర
ఇది నా సందేశం గబ్బిలమా!
ఇది నా ఉద్దేశం గబ్బిలమా!
తిరుగు ప్రయాణం
త్వరగా ముగించుకొని
రాజమహేంద్రవరానికి
రాజేంద్రుడిలా తరలిరా!
నిన్ను చూస్తే నన్ను చూసినట్టే’
నిన్ను చూస్తే తెలుగు జాతి
భవిష్యత్తును చూసినట్టే…

-వెంకటేశ్వర రావు కట్టూరి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో