19వ శతాబ్ది ఇంగ్లాండ్ సాంఘిక సంస్కర్త ,రచయిత్రి –కరోలిన్ నార్టన్( వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్

ప్రఖ్యాత నవలాకారుడు ధామస్ షెరిడాన్,కరోలిన్ హెన్నెట్టా కాల్లేండర్ లకు లండన్ లో మార్చి 1808 న కరోలిన్ జన్మించింది .తండ్రి గొప్పనటుడు ,సైనికుడు ,కాలని అడ్మి స్ట్రెటర్.ఈయన ,ఐరిష్ రాజకీయవేత్త ,నాటకకర్త రిచార్డ్ బ్రిన్స్క్లి షెరిడాన్ .తల్లి ఎలిజబెత్ ఆన్ లిన్లి నవలారచయిత్రి .1817లో కరోనిన్ తండ్రి దక్షిణాఫ్రికలో కేప్ ఆఫ్ గుడ్ హాప్ లో కాలనీ సెక్రటరిగా ఉంటూ చనిపోయాడు .కుటుంబానికి పెన్నీ కూడా లేకుండా పోయింది .డ్యూక్ ఆఫ్ యార్క అండ్ అల్బని ప్రిన్స్ ఫ్రెడరిక్ కారుణ్యమ తో ఆయన సేవకు వీరికుటు౦బ పోషణకు హామ్టన్ కోర్ట్ పాలస్ లో ఉండేట్లు ఏర్పాటు చేశాడు ‘.షెరిడన్ సిస్టర్స్ లో పెద్దమ్మాయి హెలెన్ గీతరచయిత ,ప్రిన్స్ బ్లాక్ ఉడ్ ను పెళ్ళాడింది .దీనివలన నార్టన్ మొదటి మార్క్వేస్ ఆఫ్ డఫరిన్ అండ్ ఆవా ఫ్రెడరిక్ హామిల్టన్ టెంపుల్ బ్లాక్ వుడ్ కు పిన్ని అయింది .ఈమె తర్వాత కెనడా గవర్నర్ జనరల్ ,ఇండియాకు ఎనిమిదవ వైస్ రాయ్ అయింది .ఈమె చెల్లెలు జార్జియానా డ్యూక్ ఆఫ్ సోమర్సెట్ ను పెళ్లి చేసుకోన్నది ఈ సోదరీ మణి త్రయాన్నివారి అందచందాలకు ‘’త్రీ గ్రేసేస్ ‘’’’సౌందర్య త్రయం ‘అని పిలిచేవారు .

1827లో కరోలిన్ గిల్ఫాడ్ కు చెందిన బారిస్టర్ జార్జి చాపెల్ నార్టన్ ను పెళ్లి చేసుకొన్నది .ఇతడు అసూయాపరుడు, తాగుబోతు .ఆమెను శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బంది పెట్టేవాడు .దీనికి తోడు అతడు బారిస్టర్ గా రాణించలేక డబ్బుకు ఇబ్బంది పడేవాడు .డబ్బు విషయంలో ఇద్దరికీ తరచుగా పోట్లాటలు జరిగి దాంపత్యం కలిసి రాలేదు .పెళ్ళైన కొత్తలో ఆమె తన అంద చందాలతో ,రాజకీయంతో విట్ అండ్ హ్యూమర్ తో సంఘంలో ప్రముఖ ‘’హోస్టెస్ ‘’అంటే ఆతిధేయురాలిగా ఉండేది .ఆమె అనాచార జీవితం ,దాపరికం లేని సంభాషణలు 19వ శతాబ్ది ఇంగ్లీష్ ఉన్నతకుటుంబాలకు నచ్చలేదు .ఆమెకు అభిమానులు ,వ్యతిరేకులు సరిసమానంగా ఉండేవారు .ఆమె స్నేహితులలో ప్రముఖ రాజకీయవేత్తలు రచయితలూ ఉండేవారు వారిలో శామ్యూల్ రోజేర్స్ ,ఎడ్వర్డ్ బుల్వేర్ లిట్టేన్, ఎడ్వర్డ్ ట్రేలాని,అబ్రహామ్ హావర్డ్ ,మేరీ షెల్లీ ,ఫాన్ని కెం బుల్ బె౦జమిన్ ,భవిషత్తులో బెల్జియం కింగ్ 1వ లియోపార్డ్ అయిన డిజ్రేలి,ఆరవ డ్యూక్ ఆఫ్ డెవాన్ షైర్ విలియం కేవండిష్ ముఖ్యులు .తర్వాత ఆమె టోల్ పుడిల్ మేరీస్ ప్రొటెస్ట్ మార్చ్ లో 1834లో పాల్గొన్నదికూడా .

అసూయాపరుడైనా, ఆమె భర్తను తన ప్రతిభా చాకచక్యాలతో 1831లో మెట్రోపాలిటన్ పోలీస్ మేజిష్ట్రేట్ అవటానికి సాయం చేసింది .ఆకాలంలో తనలోని భావోద్రేకాలను అదుపు చేసుకోవటానికి జీవితం గడవటానికి కవిత్వం రాసింది ,వచన రచనలు చేసింది .1829లో ‘’దిసారోస్ ఆఫ్ రోసాలే ‘’రాసి ప్రచురించి ప్రఖ్యాతి పొందింది .1830లో ‘’ది అన్ డయింగ్ వన్’’అనే రోమాన్స్ విషయంరాసింది .1832నుంచి 37 వరకు ‘’ది కోర్ట్ మేగజైన్ అండ్ బెల్లీ అసెంబ్లీ ‘’,కు సంపాదకురాలు గా ఉంది .రాబర్ట్ సూదీ తర్వాత ఆస్థానకవిగా సర్ రాబర్ట్ పీల్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ వేసింది, కాని ఫలించలేదు .

1836 లో భర్తనుండి వేరుపడి ,తన రచనలతో వచ్చినడబ్బుతో గడిపింది .ఆడబ్బుపైనా తనకే హక్కు ఉందని భర్త కోర్టులో వేసి గెలిచాడు .భర్తనుంచి భరణం రాకపోగా ,ఆమె సంపాదన అతని హక్కుభుక్తమైంది . చట్టాన్ని నార్టన్ బాగా ఉపయోగించి అప్పులవాళ్ళను వసూళ్ల కోసం భర్తపై కేసులు వేసేట్లు చేసింది .భర్తనుంచి విడిపోయిన కొద్దికాలానికే భర్త వాళ్ళ ముగ్గురు కొడుకుల్ని స్కాట్ లాండ్ లో తర్వాత యార్క్ షైర్ లో ఆమెకు తెలీకుండా చెప్పకుండా దాచేసి ఆమె పైనే కేసుపెట్టాడు .అంతేకాక ఆమెకు తన ముఖ్య స్నేహితుడు విగ్ ప్రైం మినిస్టర్ అయిన లార్డ్ మెల్ బోర్న్ తో అక్రమ సంబంధం ఉందని ,మొదట్లో అతడి నుంచి 10వేలపౌండ్లు ఇమ్మని బెదిరించాడు . .అతడు తిరస్కరించగా ప్రధానిఅయిన మెల్ బోర్న్ ను కోర్టు కీడ్చాడు .తొమ్మిది రోజుల విచారణ తర్వాత జడ్జి మెల్ బోర్న్ ను సమర్ధించి జార్జి పిటీషన్ తిరస్కరించి౦ది కాని,ప్రభుత్వం పరువు ధేమ్స్ నదిలో కలిసింది .ఆమెకు విడాకులివ్వనూలేదు ,పిల్లల్ని చూపించనూలేదు భర్త .1836చట్టం ప్రకారం సంతానంతండ్రికే చెందుతుంది .

1842లో ఆమె చిన్నకొడుకు గుర్రం స్వారీ చేస్తూ కిందపడి గాయాలై సరైన వైద్యం అందక చనిపోవటంతో గోరు చుట్టుపై రోకలి పోటు ఆయనది కరోలిన్ జీవితం .కుర్రాడిచావుకు కారణం తండ్రి అని ఆమె అతడిని నిలదీసింది .అప్పటినుంచి మిగిలిన ఇద్దరు పిల్లల్ని చూసి వెళ్ళటానికి అతడు అనుమతించాడు .కాని నిఘా పెట్టేవాడు .కుటుంబ జీవితం లో శాంతి సుఖాలు లేకపోవటంతో ఆమె ,తనలాగా స్త్రీ సమాజం మగాడిక్రూరత్వాలకు బలికారాదని స్త్రీ హక్కులకోసం దృష్టి సారించింది .ముఖ్యంగా వివాహమైన , విడాకులు పొందిన మహిళల హక్కులకోసం పోరాడింది .1836లో ఆమె రాసిన ‘’ఎ వాయిస్ ఫ్రం ది ఫాక్టరీస్’’ ,1845లో రాసిన ’దిచైల్డ్ ఆఫ్ ది ఐలాండ్స్ ‘’కవితా సంపుటులలో ఆమెకున్న రాజకీయ ప్రజ్ఞా,సాంఘిక సేవా తత్పరత మహిళలకు హక్కులకోసం తపన కనిపిస్తుంది .1855లో పార్లమెంట్ లో ‘’విడాకుల సంస్కరణ ‘’పై చర్చ జరుగుతున్నప్పుడు నార్టన్ సభ్యులకు తన జీవిత గాధను ,అనుభవించిన అవమానాలు కష్టాలను వారికి వ్రాతపూర్వకంగాతెలిపి ,మహిళలకు న్యాయం చేయమని కోరింది .ఆమె వారికి అందించిన సమాచారంలో ‘’ఇంగ్లీష్ భార్య భర్త ఇల్లు వదిలి పెట్టలేదు.ఆమెబందువుల దగ్గరకాని స్నేహితుల ఇంట్లో కానిఉంటే భర్తవచ్చిబలవంతంగా తీసుకుపోతాడు .భర్త విడాకులు కోరితే మొదటగా భార్య అభీష్టం తెలుసుకోవటం లేదు .ఆమెకు ప్లీడర్ ను పెట్టుకొని వాదించేహక్కు కాని ఆమెను పార్టీ గా చేర్చటం లేదు .భార్య తప్పు చేస్తే భర్త ఆమెకు విడాకులిచ్చి మళ్ళీ పెళ్లి చేసుకొంటాడు ,కానీ భార్యకు అలాంటి హక్కులేదు. వాడు ఎంతటి క్రూరుడు దుర్మార్గుడు తాగుబోతు వ్యభిచారి అయినా .కని పెంచి తమ ఆశలన్నీ వాళ్ళపైనే పెట్టుకొని బతికే తల్లికి పిల్లలను చూసుకొనే హక్కు ఉండటం లేదు దీనికి నాజీవితమే ఒక పెద్ద ఉదాహరణ .ఆతల్లి మనోవేదన ఎవరికీ పట్టటం లేదు ‘’అని వివరంగా రాసి పార్లమెంట్ సభ్యుల దృష్టికి తెచ్చి మహిళలకు మహోపకారం చేసింది .‘’.

స్త్రీ హక్కులకోసం నార్టన్ ఉద్యమించింది .విక్టోరియామహారాణి కి ఈ పరిస్థితులు తెలియజేస్తూ ఉత్తరం రాసింది .ఆమె కృషి ఫలితంగా ‘’ దికస్టడిఆఫ్ ఇంఫన్ట్స్ యాక్ట్ ,మాట్రిమోనియల్ కాజెస్ యాక్ట్ ,మారీడ్ వుమెన్స్ ప్రాపర్టి యాక్ట్ లను పార్లమెంట్ ఆమోదించి పాస్ చేసి అమలు పరచింది . ఓటు హక్కు ఉద్యమకారిణి బార్బరా బ్రాడికాన్ తో కలిసి ఆమె పనిచేసింది.వీటివలన పెళ్లి అయిన స్త్రీలకూ పిల్లలపై హక్కు ,విడాకుల సరళీకరణ ,ఆస్తిహక్కు సమకూడాయి .

1849చిత్రకారుడు డేనియల్ మక్లైస్ ఆమె చిత్రాన్ని అత్యద్భుతంగా చిత్రించి ‘’జస్టిస్ ‘’అని పేరుపెట్టాడు హౌస్ ఆఫ్ లార్డ్స్ లో .ఆమెను అనేక హింసలకు ,అన్యాయాలకు గురైన బాధితురాలు అన్నాడు .లార్డ్ మెల్బోర్న్ మాత్రం ఆమె సాధించిన సంస్కరణలను వ్యతిరేకిస్తే క్వీన్ విక్టోరియా అతడిని దూషించింది .నార్టన్ 19వ శతాబ్దిలో స్త్రీవోటుహక్కు విషయమై పెద్దగ ఆసక్తి చూపలేదు .1838లో’’ దిటైమ్స్’’పత్రిక ఆమెను రాడికల్ అంది .దీనికి ఆమె ‘’ “The natural position of woman is inferiority to man. Amen! That is a thing of God’s appointing, not of man’s devising. I believe it sincerely, as part of my religion. I never pretended to the wild and ridiculous doctrine of equality. అని సమాధానం చెప్పింది .

1875లో నార్టన్ చనిపోయాక ఆమె కస్టాలు గట్టెక్కాయి .పాత స్నేహితుడు ,రాజకీయవేత్త చారిత్రకరచయిత సర్ స్టెర్లింగ్ మాక్స్ వెల్ ను పెళ్లిచేసుకొన్నది .ఆమె పెద్దకొడుకు టిబి తో చనిపోయాడు .రెండవవాడు తరచూ అనారోగ్యంతో ఆమె దగ్గరే ఉండేవాడు .అతనికొడుకు జాన్ ఎస్టేట్ కు వారసుడయ్యాడు .17-6-1877న కరోలిన్ నార్టన్ 69వ ఏట లండన్ లో చనిపోయింది .ఏప్రిల్ 2021లో ‘’ఇంగ్లీష్ హెరిటేజ్ ‘’ నార్టన్ ను’’ బ్లూ ప్లేక్ ‘’ గౌరవంతో ఆరుగురితోపాటు గౌరవించింది .30ఏళ్ళు సెంట్రల్ లండన్ లో ఆమె ఉన్న ఇంటిని స్మృతి చిహ్నం చేశారు .

కరోలిన్ నార్టన్-దిసారోస్ ఆఫ్ రోసేల్లా ,ఐ డునాట్ లవ్ దీ,దికోల్డ్ చేంజ్ ,దిఅన్డైయింగ్ వన్ అండ్ అదర్ పోయెమ్స్ ,దిఫైత్త్ లెస్ నైట్(knight ) ,దిడ్రీం అండ్ అదర్ పోయెమ్స్ ,దిచైల్డ్ ఆఫ్ దిఐలాండ్స్ ,మొదలైన 11కవితా సంపుటులు ,దిడాన్డిల్స్ రూట్ ,దివైఫ్ అండ్ వుమెన్స్ రివార్డ్ ,లాస్ట్ అండ్ సేవ్డ్ మొదలైన 5నవలలు ,’’దిజిప్సీ ఫాదర్ ,వాతేక్ అనే నాటకాలు,ఎవాయిస్ ఫ్రం దిఫాక్టరీస్ ,సేపరేషన్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ ,ఎ ప్లేన్ లెటర్ టు దిలార్డ్ చాన్సెలర్ ,లెటర్స్ టుదిమాబ్ ,ఇంగ్లిష్ లాస్ ఫర్ దినైన్ టీంత్ సెంచరి ,లెటర్ టు దిక్వీన్ ,ఎ రివ్యు ఆఫ్ దిడైవోర్స్ బిల్ ఆఫ్ 1856 అనే రాజకీయ కరపత్రాలు అంటే పా౦ఫ్లేట్స్’’రాసింది .

-గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో