“తెలుగు వెలుగు” కథల్లోని సంస్కృతి, సంప్రదాయాలు  (సాహిత్య వ్యాసం)- అన్నెం శ్రీనివాస రెడ్డి

ISSN – 2278 – 478 

సమంజంలో సంస్కృతి – సంప్రదాయాలు అంతర్భాగం.  సంస్కృతి అనగా చక్కగా చేయబడినది అని అర్థం. సంప్రదాయము అనగా పెద్దల నుండి పరంపరగా తరువాతి తరానికి సంక్రమించినది అని అర్థం. ఈ రెండు విషయాలను పాటించని , లేని సమాజము బహుశా లేదని చెప్పవచ్చు. ప్రాచీనులైనా, ఆధునికులైనా వీటికి అతీతం కాదు. సాహితీ ప్రక్రియల్లో అత్యంత సులభంగా, సుస్పష్టంగా పాఠకులకు మనోరంజకంగా విషయాలను . తెలిజేయడానికి కథకు మించిన ప్రక్రియ మరొకటి లేదేమో!. కథను చెప్పేవాళ్ళు , వినేవాళ్ళు , రాసే వాళ్ళు అలాగే చదివే పార్టీ రోజు రోజుకీ తగ్గిపోతున్నారు.  అయినప్పటికి కథకు వన్నె తగ్గకపోవడం విశేషం. కథ ద్వారా ఎన్నో  అంశాలు పాఠకులకు తెలుస్తాయి. వీటిలో సంస్కృతి సంప్రదాయాలు చెప్పుకోదగినవి.

“తెలుగు వెలుగు”  పత్రికల్లో వెలువడిన కథల్లో  కొన్ని మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా కనబడతాయి. వీటిలో ప్రముఖంగా ‘స్నేహ’ అనే కథ  భారతీయ సంస్కృతికి చెందిన కథ ‘ ఇందులో స్నేహ’ అనే అమ్మాయి బాల్యంలో బాగా చదువుకొని పెరిగి పెద్దయిన తర్వాత తండ్రి  వివాహం చేయాలనుకొంటాడు. ఒకరోజు అకస్మాత్తుగా స్నేహ’కు మాట మాత్రం కూడా చెప్పకుండా కిరణ్ అనే అబ్బాయితో ‘పెళ్లిచూపులు’ కు  రంగం సిద్ధం చేస్తాడు. స్నేహ అభిప్రాయంతో పనిలేకుండా జరిగి పోతుంది. కానీ స్నేహకు కేవలం ఒక గంట సేపు చూసి ఒక  అబ్బాయిని జీవిత భాగస్వామిగా ఎంచుగానే పద్ధతి అంతగా నచ్చలేదు. పెళ్ళిచూపులు కార్యక్రమం అయిపోయినా పెళ్ళి చేసుకోవాలో వద్దో  అనే సందిగ్దంలో ఉంది స్నేహ.

స్నేహ  ఆలోచిస్తూ ఉండగా తన చిన్ననాటి మిత్రుడు తేజ్  గురుకొస్తాడు. అతని వద్దకు వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా ? అని నిర్మొహమాటంగా అడిగింది. దానికి తేజ  సున్నితంగా తిరస్కరించాడు. కానీ స్నేహ మాత్రం ఇంకా కొంచెం  ఆలోచించి నిర్ణయం తీసుకోమని సమయం ఇచ్చింది. కొన్నాళకి తేజకి ఉత్తరం కూడా రాసింది. అలాగే రాముడి – కప్ప వృత్తాంతం చెప్పింది. దాంతో పాటు అహం, సర్దుబాటు సమస్యల కారణంగా  వాళ్ళ అక్కా బావలు విడాకులుకు దారితీసిన వైనాన్ని తెలియజేస్తుంది.  పెళ్ళి అనేది ఇద్దరి మధ్య జరిగే తంతు  కానీ విడాకులు రెండు కుటుంబాల మధ్య జరిగే తంతు అని చెప్తుంది. భర్తె స్నేహితుడవడం కంటే స్త్రీ  అదృష్టం మరొకటి ఉండదని చెబుతుంది. చివరకు ‘కిరణ్’ కూడా స్నేహకు  ఉత్తరం  రాసి నచ్చితనే వివాహం చేసుకుందాం లేకపోతే  మానుకుందాం ఏ  విషయం తెలియజేయమని కోరడం జరుగుతుంది.

పై  కథలో చాలా కుటుంబాల్లో జరిగే పెళ్లి చూపులు సంస్కృతి ప్రతిబింబిస్తుంది. నేటికీ ఈ సంస్కృతి కొనసాగుతూనే ఉంది. పూర్వకాలంలో  అయితే  అమ్మాయికి అబ్బాయిని  ఎంచుకునే  స్వేచ్చ అస్సలు ఉండేది కాదు. ఆధునికాలంలో చాలా వరకు మార్పు  వచ్చిందనే చెప్పాలి. ఇలా గంటలో జీవిత భాగస్వామిని ఎంచుకొనే సంస్కృతి మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఎక్కువ మంది అభిప్రాయంగా కన్పిస్తుంది.

తెలుగు వారికి పండగలు  అనేకం. అందులో ప్రత్యేకించి  దీపావళి గురించి చెప్పక్కర్లేదు. ఇంటిల్లిపాది చిన్నపిల్లలు మొదలుకొని పండు ముసలి వాళ్ల  వరకు సంతోషంగా జరుపుకొనే పండగ దీపావళి.  “బామ్మగారి దీపావళి” కథ  పండగ సంస్కృతిని, సంప్రదాయాలను తెలియచేసే కథ.

ఇందులో బామ్మకు పెళ్ళయిన కొత్తలో ఉమ్మడి  కుటుంబ బాధ్యత  ఉండేది. ఇంటి నిండా జనం ,అత్తమామలు , ఆడపడుచులు , మరిది , తనకు పుట్టిన నలుగురు పిల్లలు. వీరందరికి వండి వార్చే పనిలో   రాత్రి ఎప్పుడయేదో తెలిసేది కాదు. అది అలనాటి  ఉమ్మడి కుటుంబ  వ్యవస్థను తెలిపింది. కాలక్రమంలో పిల్లలు పెద్దయక  నలుగురు  పల్లెటూల్లు  వదిలి ఉద్యోగ రీత్యా  సుదూర ప్రాంతలకు వెళ్ళిపోయారు. ఆ  పల్లెటూర్లో లంకంత  కొంపలో ఒక్కత్తే

ఉండలేక విజయవాడలో ఒక చిన్న  ఇంట్లో ఉంటుంది బామ్మ.

 ఆధునిక కాలం వృద్దుమైన తల్లిదండ్రులు ఏ జీవితాన్ని గడుపుతున్నారో తెలుపుతుందీ కథ. పెద్దలను గౌరవించి  పెద్దలకు సేవ చేసే సంస్కృతి నానాటికి తగ్గిపోవడం గమనించవచ్చు. బామ్మ  దగ్గర కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవడం రాజీ అనే ఒక  పనిమనిషిని తోడుగా  ఏర్పాటు చేసుకుంది.  రాజీతో బంధం  రోజు రోజుకు పెరిగిపోయింది.  ఒకరోజు  అకస్మాత్తుగా బామ్మ దగ్గరకు వచ్చి దీపావళి  పండగకు పుట్టింటికి వెళ్తున్నానని  చెప్పింది. పాపం బామ్మ వద్దనలేకపోయింది. ఈ దీపావళికి  నేను ఒంటరి దాన్ని అని మనసులో అనుకుంటూ  రాజీకి రెండా వందలిచ్చి  అమ్మగారింటికి వెళ్తున్నావు  కాబట్టి ఇంట్లో ఉన్న పండ్ల కూడా  తీసుకెళ్లమని చేతికిస్తుంది  బామ్మ. పని వాళ్ల పట్ల  యజమానులు  ప్రవర్తించాల్సిన తీరు ఇది.

బామ్మ రాజీ వెళ్ళిపోయాక తలుపు వేసుకుని  ఒంటిరిగా సమయంలో ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. తలుపు తెరిస్తే బామ్మ మనవరాలు సునీత బామ్మ  ఆశ్చర్యపడింది. ఊహించలేదు తన మనవరాలు వస్తుందని. పండగ అనేది పిల్లలు పెద్దలతో జరుపుకొంటేనే ఆ పండగ  పండగలా ఉంటుంది. ఈ సంస్కృతి తెలుగు ప్రాంతంలో కొనసాగాలని ఆకాంక్ష కూడా. దీపావళి పండగ సంస్కృతిలో భాగంగా దీపాలను వెలిగించడం, రకరకాల పిండి వంటలు చేసుకోవడం జరుగుతుంది. పిల్లలు, పెద్దలు కలిసి జరుపునే పండగ రోజు గంటలు క్షణాల్లా గడిచిపోతాయి. పెద్దల కళ్ళల్లో కాంతుల్నీ , గుండెల్లో సంతోషాన్ని  నింపేది పిల్లలే. వారి సంతోషాలతో, సరదాలతో,  ఆటపాటలతో పెద్దల వయసును  వెనక్కి తీసుకెళతారు. ఒంటో కొత్త  శక్తిని నింపుతారు. వీటన్నిటికి మూలం మన పండగ సంస్కృతే.

ఈకథలో  దీపావళి పండుగ సంస్కృతితో పాటు బామ్మ తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని నెమరు వేసుకొంటూ  దానిని కొనసాగిస్తూనే  ఆధునితకు ఆహ్వనం పలకడం స్వాగతించదగ్గ విషయం. చాదస్తంతో  పిల్లల మనసులు గాయపర్చకుండా  వాళ్ల అభిరుచులను , అలవాట్లను గౌరవించే సంస్కృతి పెద్దల్లో రావాలని బామ్మ  పాత్ర ద్వారా తెలుస్తుంది. ఒకప్పుడు పండుగలకు పిల్లలు పెద్దవాళ్ల  పాదాలకు  నమస్కరించి  ఆశీర్వాదం  పొందే వారు. నేడు  పిల్లలను పెద్దలు దగ్గరకు తీసుకు ఆలింగనం చేసుకొంటున్నారు. ఈ సంస్కృతిని  కూడా బామ్మ  అంగీకరించడం అనేది మిగతా పెద్దలందరు తెలుసుకోవాల్సిన  అతి ముఖ్య అంశం. అలా అంగీకరించని వాళ్ళు పిల్లలతో మనస్పర్ధలు  తెచ్చుకొని వారికి దూరంగా బ్రతకాల్సి  వస్తుంది.

దీపావళి పండగ సంస్కృతి సంప్రదాయాలను కళ్ళకు కట్టినట్లు తెలియజేసే కథే “బామ్మ గారి దీపావళి “కథ.

ఇక “మొగలి పువ్వంటి” కథ సంప్రదాయానికి చెందినది. తెలుగుజాతి గొప్పదనాన్ని  చాటి చెబుతుంది. ఈ కథలో ఇందిర కూతురు శ్రావ్య.  బడికిపోయి ఆలస్యంగా వస్తుంది.  బడి నుంచి వచ్చిన శ్రావ్య సందె గొబ్బిళ్ళ ‘ అంటే ఏమిటి అని తల్లిని అడుగుతుంది. ఇందిర తను చిన్నప్పుడు  ‘సందె గొబ్బిళ్ళ పేరంటం ‘ ను గుర్తుచేసుకోని చెప్తుంది.  గొబ్బిళ్లంటే ఆవు పేడతో గుండ్రని ముద్ద చేసి పసుపు , కుంకుమ , పూలు మీద పెట్టడమని వివరిస్తుంది.

గొబ్బిళ్ళు పెట్టె సమయంలో   చామంతి పువ్వంటి  చెల్లని ,  బంతి పువ్వంటి  బావని, మందారం లాంటి మరదలిని , మొగలి పువ్వంటి  మొగున్నిమ్మని పాడే  సాంప్రదాయాన్ని తెలిపింది. మొగలి పువ్వుల్లో   ఉండే రేకులను తొలగిస్తే మంచి సుగండం వచ్చినట్లు అపార్టమనే రేకుల్ని  జీవితంలో తోలగించుకుంటే ఆడపిల్లలు అత్తవారింట్లో సుఖంగా ఉంటారని తెలియజేస్తుంది. ఈ విధంగా సంప్రదాయాలను పాఠకులకు కనువిందు  చేసిన కథ ఇది.

అలాగే ‘ఊరు పిలుస్తోంది’ అనే కథలో నందిని తన భరతో పాటు విదేశాల నుండి పల్లెటూరుకు వస్తుంది. అక్కడ వీరయ్య అనే రైతుతో సంభాషిస్తూ ” మేము ఇంత తింటున్నామంటే అది మీరు పండిస్తేనే కదా” అని అనడంలో వాస్తవం తొంగి చూసింది. ఈ ప్రపంచానికి తిండి పెట్టే సంప్రదాయం నాటి నుంచి నేటి వరకు రైతుదే.  తర్వాత చిన్నప్పుడ చదువు చెప్పిన మాస్టారును కలిసి క్షేమ సమాచారాలను తెలుసుకున్నారు. ఇది కూడా మంచి సంప్రదాయమే. యాంత్రిక జీవనంలో మనిషి తనకు తానే పరాయి అవుతున్న నేటి కాలంలో ఈ చిన్ననాటి గురువులను కలవడం భావి తరాలకు ఒక మంచి సంప్రదాయాన్ని అలవాటు చేసినట్లయింది. అసలు నేటి తరానికి పల్లెటూళ్ళ గురించి, అందులోని ప్రకృతి అందాలను గురించి, వాతావరణాన్ని గురించి సరైన అవగాహన లేకుండా పెరుగుతున్నారు. విదేశాల నుంచి వచ్చి అదే పనిగా పల్లెటూరిని వాతావరణాన్ని తెలుసుకోవడం భావి తరాలకు సూచనాత్మకంగా తెలిపే సంప్రదాయంగా భావించవచ్చు. ముఖ్యంగా పెద్దలను, గురువులను గౌరవించే సంస్కృతికి ఈ కధ అద్దం పడతుంది .

‘తెలుగు వెలుగు’ పత్రికలో పైన పేర్కొన్న కథల్లో సమాజానికి ఉపకరించే సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి. నేటి తరం రోజు రోజుకీ విజ్ఞానపరంగా అభివృద్ధి సాధిస్తున్న సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకొవడంలోను, వాటిని పాటించడంలోను వెనుకబడతున్న విషయం సర్వవిదితమే. ఈ తరంలో ఇలాంటివి మరిన్ని సమాజానికి అ చాలా అవసరమని నా భావన.

-అన్నెం శ్రీనివాస రెడ్డి

శ్రీ వెంకటేశ్వరరావు  విశ్వవిద్యాలయం , తిరుపతి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో