“వనదేవతలు” “సమ్మక్క – సారలమ్మ” (పరిశోధక వ్యాసం )-పెరుమాండ్ల శివ కళ్యాణి

ISSN – 2278 – 478 

కోరిన వారికి కొంగు బంగారంలా వరములను ఇస్తూ తన భక్తులకు ఎలాంటి ఆపదలు రాకుండా చూచే చల్లని తల్లులు మన సమ్మక్క- సారలమ్మ దేవతలు. చరిత్రకు నిలయమై, కోరిన వారికి కొంగు బంగారంగా అడిగిన వారికి లేదు అనకుండా తన వరాల కుంచముతో భక్త జనకోటికి ఇంటి ఇలవేల్పులై విరాజిల్లుతున్నారు.

సమ్మక్క, సారక్క మేడారం జాతర యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఇసుక వేస్తే రాలనంత జనాలు ఆ తల్లుల చల్లని చూపుకై తమ యొక్క దరిద్రములను తొలంగించుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకునే భక్తులు ఆ దేవత మూర్తుల జాతరలో అనేకమంది కలరు. ప్రతి 2 ఏండ్లకు ఒకసారి జరిగే తెలంగాణలోనే అతిపెద్ద జాతర. పిన్న, పెద్ద, పల్లె, పడుచు, ముసలి, ఇలా అన్ని వయస్సుల వారు ఏ మాత్రము తారతమ్యము లేకుండా కాలి నడకతో కొందరు, ఎడ్లబండి పైన కొందరు , మోటారు బండ్లపై కొందరు, గాలి మోటర్లలో కొందరు ఇలా అమ్మవారి జాతరకు బయలుదేరుతారు. ప్రతి 2 ఏండ్లకు ఒకసారి జరిగే తెలంగాణలోనే అతిపెద్ద జాతర. భక్తులు అందరు కూడా తండోపతండాలుగా వచ్చే మహా జాతర మన మేడారం జాతర.

మన భారతదేశంలోనే కుంభమేళ తరువాత అంతటి జన సందోహం హాజరయ్యే అతిపెద్ద జాతర. సమ్మక్క, సారక్క జాతర అనేది ఒకప్పటి వరంగల్ జిల్లా ప్రస్తుతం ములుగు జిల్లా తాడ్వాయిలో మేడారం అనే గ్రామములో జరిగే జాతర.ఒకప్పటి వరంగల్ కేంద్రము నుండి110 కిలోమీటర్ల దూరములో అటవీ ప్రాంతంలో, కొండకోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ మహాజాతర జరుగుతుంది. మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. కేవలం తెలంగాణ రాష్ట్రము నుండే కాక ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, ఒరిస్సా, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షలాదిమంది భక్తులు హాజరవుతారు. తెలంగాణ కుంభమేళాగా భావించే సమ్మక్క, సారక్క జాతరను మనము జరుపుకోవడము అదృష్టముగా భావింప వచ్చును. ఈ జాతరను మనము 4 రోజులు జరుపుకోవడము జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమ్మక్క- సారక్క జాతరను 1996 ఫిబ్రవరి 2 న రాష్ట్ర పండుగగా ప్రకటించుట జరిగినది. సమ్మక్క, సారక్క జాతరను ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా యునెస్కో  అనే సంస్థ గుర్తింపునిచ్చింది. 2012లో జరిగిన సమ్మక్క, సారక్క జాతరకు సుమారుగా కోటిమంది హాజరు అయ్యారని అంచనా.

మిగిలిన రోజులు నిశ్శబ్దంగా ఇన్న మాఘమాసం వచ్చిందంటే మేడారంలో పెద్ద జాతర మొదలు అయినట్టే. నాలుగు రోజులపాటు జరిగే ఈ పండుగలో ఆరోజులలో మేడారంలో ఎటుచూసినా జనసంద్రమే. మన కళ్ళను మనమే నమ్మలేనంత ఆశ్చర్యం అక్కడ కనబడుతుంది.

మేడారం ప్రజలు కాకతీయ రాజులతో తలపడి తమ ప్రాణాలను సైతము లెక్క చేయకుండా తలపడి పోరుసల్పినారు. విజయం వరించినప్పుడు పొంగిపోలేదు. అపజయం కలిగినప్పుడు కృంగిపోలేదు. చావో రేవో తేల్చుకుందామని కదనరంగములో కాలిడినారు.

ఇక మేడారం చారిత్రక విషయానికి వస్తే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్క. ఈమె భర్త పగిడిద్దరాజు. వీరికి సారలమ్మ, నాగులమ్మ అనే ఇద్దరు కుమార్తెలు, జంపన్న అనే కుమారుడు కలడు. రాజ్యాన్ని విస్తరింపచేయాలనే కాంక్ష కలిగిన రుద్రదేవుడు పొలవాసపై దండెత్తగా ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసంలో ఉంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు “పగిడిద్దరాజు” కాకతీయుల వద్ద సామంతునిగా ఉంటాడు. కరువు కాటకముల దృష్ట్యా అతడు వారికి కప్పము కట్టలేకపోతాడు. ఈ కప్పము కట్టలేదని మరిను ఇంక కొన్నికారణములచే మరియు చెప్పుడు మాటలను విన్న ప్రతాపరుద్రుడు (రుద్రదేవుడు) అతడిని అణచి వేయాలని నిశ్చయించుకొని మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు. అతన్ని ఎదుర్కొనేందుకు సమ్మక్క, సారక్క, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజులు వేరు వేరు ప్రాంతములనుండి వచ్చి భీకరమైన పోరును సల్పుతారు. ఆ పోరులో అనేకమంది తమ ప్రాణములను అసువులు బాస్తారు. కాకతీయుల దాటికి తట్టుకోలేక మేడరాజు పగిడిద్దరాజు, నాగులమ్మ, సారక్క, గోవిందరాజులు మరణిస్తారు. ఇక సమ్మక్క, యుద్ధభూమిలో వీరోచితంగా పోరాడుతుంది. ఆమె యుద్ధ నైపుణ్యానికి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు.

ఇక 4 రోజుల జాతరలో మొదటి రోజు సమ్మక్క కూతురైన సారలమ్మని కన్నెపల్లి నుండి తీసుకువస్తారు. తరువాత రోజు చిలుకలగుట్ట నుండి సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమ భరిణిని తీసుకువస్తారు.

ఒకప్పుడు మేడారం జాతర చిలుకల గుట్ట మీద జరిగేది కాని సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండడంతో జాతరను దిగువన జరుపుతున్నారు. దేవతలను గద్దెలపై ప్రతిష్టించే సమయంలో భక్తులు ఎందరో పూనకంతో ఊగిపోతుంటారు. 3వ రోజున తల్లులు ఇద్దరు కూడా భక్తులందరికి గద్దెలపై దర్శనము ఇస్తూ ఉంటారు. 4వ రోజు సామంత్రము ఆవాహన పలికి దేవతలు ఇద్దరిని కూడా తిరిగి వారియొక్క యుద్ధ  స్థానమునకు తరలిస్తారు. వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు ఈ మహా జాతరకు.

సమ్మక్క, సారక్కలు గిరిజనుల కోసం తమ ప్రాణాలను అర్పించిన ధీర వనితలు. భక్తులకు తమ దివ్య శక్తులతో ఆశీర్వచనములను ప్రసాదిస్తారు.తల్లుల చల్లని చూపు కోసము భక్తజన సంద్రము ఆరాట పడుతూ దీవెనలు పొందుతారు. తమ కోర్కెలను నెరవేర్చమని భక్తులు  ఆ తల్లులకు బంగారము (బెల్లము) నైవేద్యంగా సమర్పించుకుంటారు. భక్తులు ఈ తల్లుల దర్శనం వల్ల పెళ్ళికాని పడుచులకు వివాహం జరుగుతుందని, సంతానం లేని వాళ్ళకు సంతానం కలుగుతుందని, అలాగే సమస్త నర దృష్టి దోషాలు  పోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం.

భక్తులు తమ మొక్కు  చెల్లించే ముందు జంపన్న వాగులో స్నానం చేసి తల్లుల దర్శనానికి వెళతారు. జంపన్న వాగులో నీరు ఎర్రగా ఉంటుంది. జంపన్న సమ్మక్క కుమారుడు. తల్లితో పాటుగా యుధ్ధంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించిన వాడు. అతడు ఏమాత్రం యుద్ధం అంటే      భయపడని వాడు. యుద్ధంలో శత్రువులకు అపజయం కలిగించేవాడు. శత్రువులకు ముచ్చెమటలు పట్టించిన వాడు. కాని యుద్ధములో తాము పరాజయం చెందుతామని వార్త విని సంపెంగ వాగులో దూకి మరణించాడు.

ఈ విధముగా మనకు మేడారము యొక్కచరిత్ర మరియు ఆ తల్లుల సమ్మక్క- సారక్క దేవతల ఘనతను మనము తెలుసుకొనుటకు మనకు ఎన్నో ఆధారములు కలవు. ఆ వన దేవతల యొక్క కరుణా కటాక్ష వీక్షణములు మన అందరిపై ఉండాలని మన అందరము కూడా ఆ వనదేవతల కృపకు పాత్రులము కావాలని కోరుతూ సదా ఆ సమ్మక్క, సారక్క సేవలో కొలువై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…

  “ జై సమ్మక్క తల్లి – జై సారక్క తల్లి”

                          “సర్వేజనా సుఖినో భవంతు”

      -పెరుమాండ్ల శివ కళ్యాణి   

ఉపయుక్త గ్రంథములు:

  1. తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి

  2. మేడారం జాతర – ఆచార్య భట్టు రమేష్-2019

  3. ఆదిలాబాద్ జిల్లా లంబాడీ సాహిత్యం పరిశీలన – డా||మురహరి  రాథోడ్-2019

సాహిత్య వ్యాసాలు ​, , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో