ఖరీదైన సమయం(కవిత)-చందలూరి నారాయణరావు

ఎప్పటి గుర్తులో ఇవి
మనసును తాకే శుభతరుణం

ఏమి తెలియని నాటి బాల్యం
నేడు అన్ని తెలిసి మెలిగే గొప్పదినం..

ఒకనాటి మిట్టాయి పొట్లం లాంటి

కబుర్లను అందరం కలసి పంచుకుంటూ

ఒకే రుచి గల
ఇష్టమైన సంగతులతో
ముస్తాబయ్యే మురిపం ఇదే

ఎవరి జీవితం ఎన్ని రంగులద్దుకున్నా
ఎవరి బతుకులో ఎన్ని హంగులున్నా
బాల్యం ముంగిట ప్రేమగా
బడి వాకిట చిన్నవేగా

ఒరేయ్…అనే పిలుపుతో
మనసులు విచ్చుకునే పండుగలా
మనుషులు కలిపే మహిమగా
ఒక్క బడిదేగా మరి.

ఎదురుపడితే చాలు
ఒకరి ఎదను మరొకరు
తడిమి తడిమి
తడిసి మురిసే సంబరం ఇదేగా…

అందరి జేబులు ప్రేమతో నింపే
పెట్టుబడికి కట్టుబడే
కలిసొచ్చే కమ్మని వెల కట్టలేని
ఖరీదైన సమయం ఇదేగా…

బాగా తెలిసిన మనసులకు
ముఖాలను గుర్తుపట్టే సందర్భంలో
పక్కవారు అందించే గుర్తులతో
హత్తుకునే ఆనందంతో

మరోసారి పిల్లలమై
కేరింతలు కాలువలై
బడి అంతా ప్రవహించే
చల్లని రోజు ఇదేగా…

జీవితంలో అమ్మా,నాన్న లా
బతుకులో బడి ఒక్కటే
భోదించే గురువు ఒక్కటే

బాల్యమనే భాగ్యం ఒక్కటే….
తలచుకునే స్నేహమొక్కటే….
తృప్తిపడే గుర్తులోకటే….
తలచుకునే తీపిఒక్కటే
……………
మనం కలిసిన ఈ ఘనం
మనల్ని కలిపిన ఈ ఘనత
ఈ బడిదే….ఈ గుడిదే
మనల్ని మలచిన ఈ గురువులదే…

అందుకే…..
బడికి…గురువులకు
పాదాభివందనం…..

-చందలూరి నారాయణరావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో