జ్ఞాపకం- 71– అంగులూరి అంజనీదేవి

ఇప్పుడుండే రేట్లను బట్టి మా స్కూల్ వాళ్లు నాకు ఇచ్చిన డబ్బులు నా వైద్యానికి పూర్తిగా సరిపోలేదు సర్! మా తాతయ్య నానమ్మల సమాధులు కట్టించాలని మా నాన్నగారు దాచుకున్న డబ్బుల్ని నాకోసం వాడారు. ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా కోలుకుంటున్నాను. ఆసరా లేకుండానే కొంతదూరం నడవగలుగుతున్నాను. ఇంకొద్దిరోజులు గడిస్తే ఎప్పటిలాగే స్కూల్ కి కూడా వెళ్లగలుగుతాను. నాకా నమ్మకం వుందిఅన్నాడు.

రాజారాంలో కాన్ఫెడెన్స్ లెవెల్స్ ఎక్కువగా వున్నట్లు వాళ్లకి తెలుస్తోంది. అందుకే అతను త్వరగా కోలుకోగలిగాడు. మనిషికి ఏ సందర్భంలోనైనా కావలసింది ఆ కాన్ఫెడెన్సే! వాళ్లు రాజారాంనే చూస్తున్నారు.

అదీకాక నేను మీతో వస్తే నా తల్లిదండ్రులకి, నా కుటుంబానికి దూరం అవుతాను సర్! అది నాకు ఇష్టం లేదు. వాళ్లకి నేను చేయూతగా వుండాల్సిన వయసులో వాళ్లు నాకు ఊతగా మారారు. నేనిప్పుడు వాళ్లను విడిచి మీ వెంట రాలేను. మీరింత ప్రేమతో, దయతో ఇంతదూరం వచ్చి పరామర్శించినందుకు మీకు మరోసారి కృతజ్ఞతలుఅన్నాడు. చేతులు జోడించి నమస్కరించాడు.

వచ్చినవాళ్లు ఆర్ధతతో కదలిపోయారు.

వినీల ఆశించినట్లు వాళ్లు డబ్బులేమీ ఇవ్వకపోవటంతో ఆమె అక్కడి నుండి వెళ్లిపోయింది. గొణుక్కుంటూ తన గదిలో పడుకుంది.

రాజారాం ఆలోచనగా శూన్యంలోకి చూస్తూ జీవితంలో వైఫల్యాలు ఓ భాగమని గ్రహించటానికి నాకు కొంత టైం పట్టింది సర్! కానీ మనిషి ఏది ముఖ్యమని పరుగులు తీస్తున్నాడో తెలుసుకోటానికి మాత్రం పెద్దగా టైం పట్టలేదు. ఇప్పటికే బోలెడు గుణపాఠాలు నేర్చుకున్నానుఅన్నాడు.

అంతవరకు రాజారాం పట్ల వున్న జాలి కాస్త గౌరవంగా మారింది. చాలాసేపు రాజారాంతో మాట్లాడుతూ కూర్చున్నారు. వాళ్లు నడుపుతున్న సంస్థను ఏ ఉద్దేశ్యంతో నడుపుతున్నారో చెప్పారు. దాన్ని ఇంకా ఎలా డెవలప్ చెయ్యాలనుకుంటున్నారో చెప్పారు. సెలవు తీసుకునేముందు విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్లారు. ఏ టైంలో ఏ అవసరం వస్తుందో అని వాళ్లిచ్చిన విజిటింగ్ కార్డును తీసుకొని జాగ్రత్తగా దాచుకున్నాడు రాజారాం. ఎప్పుడైనా ఆపదలనేవి చెప్పి రావని, కర్మలు ఎలా చెబితే అలా విని నడుచుకోవటమే మనిషి ధర్మమని రాజారాంకి బాగా అనుభవమే!

                                                                                          *****

ఇంట్లో వ్రతం వుందని, మంచి పట్టుచీర కొనుక్కోమని డబ్బులిచ్చి కోడల్ని షాపింగ్ కి పంపింది శ్రీలతమ్మ.

సంలేఖతో కలిసి హస్విత కూడా షాపింగ్ కి వెళ్లింది.

శ్రీలతమ్మ వ్రతానికి రమ్మని హస్వితను పిలిచిందని తెలిసి నువ్వుకూడా సంలేఖతో కలిసివెళ్లి మంచి పట్టుచీర తెచ్చుకోఅని డబ్బులిచ్చి పంపాడు దిలీప్.

మీ అత్తగారు వ్రతాల దగ్గరే తన తన హోదాను చూపించుకోవాలను కుంటుందని బయట అందరూ అనుకుంటున్నారు. నువ్వేమో మీ అత్తగారిచ్చిన డబ్బుల్లో సగం డబ్బులకి పుస్తకాలు కొనుక్కున్నావ్. సగం డబ్బులకి మాత్రమే చీర కొనుక్కున్నావ్. గొడవ అవుతుందేమో లేఖా!అంది షాపింగ్ నుండి తిరిగి వస్తూ హస్విత.

ఏం కాదు. నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. జయంత్ ఈ మధ్యన నన్ను బాగా రాయమని ప్రోత్సహిస్తున్నాడు. బాగా రాయాలీ అంటే మంచి పుస్తకాలు చదవాలి. నేను సేకరించుకున్న బుక్సన్నీ మా వదిన పుణ్యమా అని కొన్ని చిరిగిపోయాయి. కొన్ని పాడయిపోయాయి. అవి ఒక్కటి కూడా ఇప్పుడు నాకు పనికిరావు. అందుకే ఇవి కొన్నానుఅంది.

హస్విత ఇంకే మాట్లాడలేదు. ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు.

ఆ తర్వాత మళ్లీ వ్రతం రోజు కలుసుకున్నారు.

వ్రతానికి శ్రీలతమ్మ పిలిచిన వాళ్ళందరు వచ్చారు. ఉప్పల్లో వుండే ఆమె పెద్దకోడలు, రామంతపూర్లో వుండే కూతురు ముందే వచ్చారు. వాళ్లంతా ఎవరి అలంకరణలో వాళ్లుంటే వ్రతానికి అవసరమైన పూజ సామాన్లన్నీ అయ్యగారు చెబుతుంటే సంలేఖనే అమర్చింది. సంలేఖకి తోడుగా హస్విత వుంది.

ఆడవాళ్లంతా ఖరీదైన పట్టుచీరలు కట్టుకొని వచ్చి హాల్లో ఏర్పాటుచేసిన వ్రతం ముందు కూర్చున్నారు.

వ్రతం పూర్తయ్యాక ముత్తయిదువులంతా అరటిపళ్లు, తాంబూలాలు పుచ్చుకొని ఎవరి ఇళ్లకి వాళ్లు వెళ్లిపోయారు.

అప్పటి వరకు ఆపుకొని వున్న శ్రీలతమ్మ కోడలి మీద కళ్లెర్రజేసింది.

నేను నిన్ను తెచ్చుకోమన్న చీరేంటి నువ్వు కట్టుకున్నచీరేంటి? వ్రతాలకి కట్టుకునే చీరేనా ఇది? వచ్చినవాళ్ల ముందు నాకు తల కొట్టేసినట్లైంది. అప్పటికి ఒకావిడ అడగనే అడిగింది శ్రీలతా! నీ కోడలు కట్టిన చీర రేటెంత?’ అని. ఎందుకలా చేశావ్? నేనిచ్చిన డబ్బులేమయ్యాయి. మీ అమ్మకి, నాన్నకి పంపావా? లేక కుంటి అన్నయ్యకి పంపావా?” అంది శ్రీలతమ్మ.

తల తిరిగిపోయింది సంలేఖకు.

తోడికోడలు, ఆడపడుచు మింగేసేవాళ్లలాగా చూస్తూ అక్కడే నిలబడి వున్నారు.

నువ్వింత లోక్లాస్ బుద్దిని చూపిస్తావనుకోలేదు. డబ్బు అవసరమైతే ఒకటికి రెండుసార్లు నన్నే అడిగి తీసుకోవలసింది. చీరకిచ్చిన డబ్బుల్ని నీవాళ్ల కోసం ఎందుకు వాడుకోవాలి? మాట్లాడవేం?” అంది శ్రీలతమ్మ.

ఆడపడుచు చెప్పు వదినా! ఏం చేశావా డబ్బుని?” అడిగింది.

తోడికోడలు చెబితే అత్తగారు ఏమీ అనరు. చెప్పకపోతేనే ఆమెకి కోపం వస్తుంది. చెప్పు లేఖా?” అంది.

అప్పుడే జయంత్ వచ్చాడు.

జయంత్ ని చూడగానే అంతవరకు తోడేళ్ల మధ్యన నిలబడివున్న లేడిపిల్లలా ఒక్క పరుగున వెళ్లి అతని పక్కన నిలబడింది సంలేఖ.

ఏం జరిగింది?” అంటూ అందరివైపు చూశాడు జయంత్.

 

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలు, , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో