ప్రపంచం నిద్రిస్తోంది
ఒక పిల్లి జాగ్రత్తగా , మెత్తగా నడిచే నడక
భేరీలా గర్జిస్తుంది
అప్పుడు నాకు వినబడుతుంది
వేగంగా విడిచిన మెత్తటి నిట్టూర్పు
భయంతో నేను నిద్రించే ధైర్యం చేయను
నా చీర అంచులు దాన్ని నోక్కేస్తాయి
కొన్ని సార్లు పులిసిన కాగిన పాల పొంగు
పైకి లేస్తుంది
కొన్ని సార్లు గోరింటాకు , పరిమళం , నేల వాసన.
నా బిడ్డ నోటి నుంచి
నేను మొదటిసారి తొలగించినప్పుడు
పులిసిన పాల తీయటి వాసన
నా ప్రేమ వ్రేళ్ళను హత్తుకున్న
గోరింటాకు పరిమళం
తాజాగా త్రవ్విన సమాధి నుంచి
బయటకు వచ్చిన చేయి
నేను వాడి పంజా గురించి ఆలోచించలేదు
నేల పరిమళం నన్ను జయించింది.
– తెలుగు సేత : ఎ.కృష్ణా రావు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~