జనపదం జానపదం- 27 -నారికొరవ తెగ జీవన విధానం – భోజన్న

ISSN – 2278 – 478

భోజన్న

ఆకలి మనిషి చేత ఎన్నో కార్యాలు చేయిస్తుంది. మానవ జీవన విధానంలో ఒక్కొక్కరు ఒక్కో పనిని నమ్ముకొని జీవిస్తుంటారు. వ్యవసాయం చేయడం కొందరిది, కాపలా కాయడం ఇంకొందరిది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వృత్తులు, వృత్తులపై ఆధారపడే కులాలు గ్రామాలలో నేటికి కనిపిస్తాయి. సమాజంలో జీవించే వారు ఎన్నో వృత్తులను చేస్తుంటే, సమాజానికి దూరంగా కొండల్లో, గుట్టల్లో, జీవించే గిరిజనులు తమ అవసరాలకై తామే కొన్ని వర్గాలుగా విడిపోయి కుల వృత్తులను చేసుకుంటారు. ఉదాహరణకు లంబాడి తెగను గమనిస్తే సనార్ (బంగారు పని చేసేవారు), భాట్ (కల్లు గీత పనివారు) మొదలైన రకాలుగా అన్ని తెగలలో ఇలాంటి పని వారు ఉన్నారు.

ప్రస్తుతం అడవులు అంతరించి పోతున్నాయి. అడవితో కలిసి జీవించే గిరిజనులకు నివాసం, జీవనం కరువైపోతుంది. కాబట్టి వారు పొట్ట గడవడం కోసం గూడాలను, పెంటలను వదిలి పెట్టి గ్రామాలు, నగరాల బాట పడుతున్నారు. ఇలాంటి వారిలో నారికొరువ తెగ ఒకటి. వీరు వీధుల వెంట రక రకాల వస్తువులను అమ్ముతూ కనిపిస్తారు. ఈ తెగ బ్రతుకు తెరువు కోసం అద్దాలు, దువ్వెనలు, గాజులు ఇతర వస్తువులను అమ్ముతూ జీవిస్తున్నారు. వీరితో కలిసి జీవించే ఎవరికి కూడా వీరిది ఒక తెగ అనే విషయం తెలియదు. కులాల మధ్యన కులంగా వీరు జీవిస్తున్నారు కాని వీరిలో కొందరికి మాత్రమే తాము కులం కాదు తెగని తెలుసు. వీరికి గుర్తింపులో సైతం ట్రైబ్ అని కాకుండా షెడ్యూల్డ్ క్యాస్ట్ గా కొన్ని చోట్ల ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు , ఓటర్ ఐడి కార్డులు మొదలైనవి ప్రభుత్వం మంజూరు చేసింది. తమకు Tribes కి చెందిన అభివృద్ధి ఫలాలు కావాలని అడుగలేని అమాయకులు నారికొరవన్ తెగ వారు.

ఈ నారికొరువ నక్కల తెగలో ఉపజాతి. నక్కలను లేదా జంతువులను చంపి తింటారు కాబట్టే వీరిని నక్కల వారు, fox hunters అని అంటారు. నారికొరువ తెగకి చెందిన వారు నక్కలను, జంతువులను కాకుండా పిట్టలను ఆహారంగా తీసుకుంటారు. కాబట్టి వీరిని Birds Hunters అంటారు. పక్షులకి, పక్షులను పట్టుకోవడం నేర్పించే నైపుణ్యం వీరి దగ్గర ఉంటుంది. పక్షులను పట్టుకోవడంలో వీరి పెంపుడు పక్షులు డికోమోలుగా పని చేసి, అవి సేకరించిన పక్షులను యజమానికి అప్పగిస్తాయి. పట్టణాలలోని వారికి ఈ నైపుణ్యం కలిగిన పక్షులను అమ్మడం వలన అక్కడ వారు వాటి ద్వారా జీవనోపాధిని పొందుతున్నారు..

నారి, కురవ అనేవి తమిళ పదాలు కలయికగా చెప్పవచ్చు. తమిళ్ లో కురవి అంటే పిచ్చుక అని అర్థం. పిచ్చుకలను బంధించే వారు, తినేవారని తెలుస్తోంది. తమిళనాడులో నారికురవ 8280 కుటుంబాలు, 40,000 జనాభా ఉన్నట్లు తెలుస్తోందని రామసుబ్బయ్య 2009లో ఒక సర్వే ద్వారా తెలిపారు. వీరిని నారికొరవన్, నారికురవన్, నారికొరవర్, కురివిక్కరన్ అనే పేర్లతో పిలుస్తారు. నారికొరువన్లని కర్ణాటకలో అక్కి, పిక్కి అని, వీరంతా ఒకే మాండలికం మాట్లాడడం వలన వాగిరి వాలా అని, తెలంగాణలో పూసెర్ల, పూసవేర్ల వారని, పూసలు అమ్ముకునే వారని పిలుస్తారు. వీరు చాలా ప్రాంతాలలో బిసి జాబితాలో ఉన్నారు

నారికొరవ స్త్రీలు రంగు రంగుల స్కర్టులను, చీరలను, మెడలో పూసలు, గుండ్లు ధరిస్తారు. వీరిని కురాతీలు అని పిలుస్తారు. పురుషులు నడుముకు బట్టలు, తలపాగ ధరిస్తారు. నేడు వీరి వస్త్రధారణలో ఎన్నో మార్పులు వచ్చాయి. జంతువులను, పక్షులను, తమ  చాకచక్యంతో పట్టుకుంటారు. జంతువులలో నక్కను జిత్తులమారిగా, అత్యంత తెలివైనదిగా పరిగణిస్తారు కాని అలాంటి నక్కను పట్టుకోవడంలో నేర్పరులు. జంతువులను పట్టుకోవడానికి బోను తయారు చేసి, దాని పక్కన కూర్చొని ఒకరు నక్కను అనుకరిస్తూ శబ్దం చేస్తూ నక్కలను  పట్టుకుంటారు.

అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న వారి జీవితంలో వెలుగులు ప్రసరించడం చాలా కష్టం. ఎందుకంటే వీరు ఏ కులమో ? ఏ తెగనో ? వీరికే తెలియదు. కాబట్టి అభివృద్ధి పథకాల ప్రస్తావన ఉండదు. లోకజ్ఞానం అంతంత మాత్రమే ఉంటుంది కాబట్టి ఏ విషయంలోనూ శ్రద్ధ చూపరు. జాతరలలో, ఉత్సవాలలో, పండుగలలో బెలూన్స్, పూసలు, దండలు మొదలైనవి అమ్మి ఏ రోజుకు ఆ రోజు పొట్ట పోసుకుంటారు.

వీరు జీవిస్తున్న రాష్ట్రాలు వీరిని ST జాబితాలో చేర్చాలని భారత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం 1965లో లోకూర్ కమిటీ ఎస్.టి జాబితాలలో సమీక్షించేందుకు నారికొరవన్/కుర్వికరన్ ను చేర్చాలని సిఫారసు చేసింది. 1981లో రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా నిపుణుల సంఘం సిఫారసు మేరకు ఈ తెగను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అంగీకారం తెలిపారు.

నారికొరవ జీవన విధానంలో నిరంతరం తమ నివాసాలను మార్చుకుంటారు. కొందరు ఒక చోట స్థిర నివాసం ఏర్పరచుకుంటే, మరికొందరు జాతరలు, ఉత్సవాలు అంటూ గ్రామాలు, నగరాలు పట్టుకొని అక్కడ ‘‘డేరా’’ వేసుకుని నిరంతరం వివిధ ప్రాంతాలు తిరుగుతూనే ఉంటారు. స్థిర నివాసంలో ఉన్న వారు కూడా నిరంతరం పొట్ట కూటి కోసం వస్తువులు అమ్ముకోవడానికి వివిధ ప్రాంతాల్లో నివాసం ఏర్పరచుకుని కొన్ని రోజులకు మరొక కొత్త ప్రాంతం తరలి వెళతారు

వీరు కొత్త ప్రాంతాలకు కలిసికట్టుగా వెళ్ళి, అన్ని పనుల్లోనూ ఒకరికొకరు సహకరించుకుంటారు. ఆహారం, ఇంటి వాతావరణం చాలా సాదాసీదాగా ఉంటుంది. ఇతరుల సొమ్ముకి, వస్తువులకి ఆశపడరు. అంతేకాదు దైవ భక్తి ఎక్కువ, కష్టాన్ని నమ్ముకునే జీవిస్తుంటారు. వన్య ప్రాణి రక్షణ చట్టాల వలన వేట కూడా అంతరించి నేడు రకరకాల పనులతో జీవనం గడుపుతున్నారు.

-తాటికాయల భోజన్న

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

కాలమ్స్, వ్యాసాలు, , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో