గాలి తెమ్మెరకు
అన్నీ ఒక్కటే…
సెలయేరైనా
తుమ్మ ముళ్ళైనా …
****
కరాలు ….పరికరాలు
రక్తాన్ని చిందిస్తే
బంగారం పంచుతూ
సింగరేణి
****
దేశం లాక్ డౌన్
తెగింది మాత్రం
సామన్యుని
బతుకు సూత్రం
****
ఆదమరిస్తే
అంతా శూన్యమే !
అవకాశాన్నంది పుచ్చుకుంటే
అంతా నీ వశమే !
****
కుటుంబం , బాధ్యత
ఆభరణాలు…
అమ్మాయి
ఇప్పుడు ఇల్లాలైంది
****
ఎన్ని ప్రభుత్వాలు
మారాయో…
రైతు బతుకు
మాత్రం అక్కడే
– వడ్డేపల్లి సంధ్య
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~