వీలునామా (కవిత )- గిరి ప్రసాద్ చెలమల్లు

ఒక  వూరి కి

నేనొక అధిపతిని

బ్యాలెట్ అయినా

ఇవిఎం అయినా

నా తరహా నాదే

దేనికి తగ్గట్టు దానికి ధ్వంస రచన

ఉత్తరాన ఓ చారిత్రక కట్టడం కూల్చా

దక్షిణాన చిచ్చు రాజేస్తున్నా….

నా వూరి చుట్టూ ఇనుప కంచె పాతి

అబద్దాలని నిజం చేసే యత్నంలో సఫలం కథలల్లి

ప్రశ్న నీ సమాధి చేస్తూ

గొంతులనులుముతున్నా

చెరసాలలో హేతువు

బజార్లలో లింగ ప్రదర్శనలు తల దించుకునేలా

అభంశుభం తెలీని

ఊరి చివరి

ఆడపిల్లల బతుకులను

చెరచి

అర్థరాత్రి చితులు పేరుస్తూ

కన్న వాళ్ళను దరి దాపుల్లోకి రానీయకుండా

బూడిద చేస్తున్నా

రైతుల చెమట పంట గా

కల్లాల్లో

ఆలూ చూలూ తెలియని దళారీ ల చేతుల్లో పెడుతున్నా పంటని

తిరగబడితే తొక్కించి చంపుతున్నా

దేవాలయం మీద బూతుబొమ్మల సాక్ష్యంగా

గర్భగుడి లో రాతి ముందు

పసిపిల్లల తో కామకేళి

యోని ఛిద్ర నెత్తురు తో రాతికి అభిషేకం

కాటికి పంపుతున్నా అటుపిమ్మట

సూర్యాస్తమయాల నడుమ

వీధి వీధికో శిలాన్యాసం

వీధుల్లో రభస

ఆహారం నుండి ఆహార్యం దాకా

మీనమేషాలెక్కిస్తూ

ఏమీ ఎరుగనట్టు

గుట్టుగా ఏమైనా నా మదిలో

బైటికి మరో మనిషి

గంటలు కొట్టిస్తా

గుంతలు తవ్వి పూడుస్తా

కొవ్వొత్తులు వెలిగించి విచారిస్తా

ఎవరెన్ని కూసినా హేతువుతో

నమ్మనీయని తంత్రం నేనెరుగు

నా వెంట నడిసే నా మతమే అండ

దాన్ని వాడే సిరంజి నా సొంతం

వైద్యం లేని మత్తు మందు దిగనంత కాలం

నాదే గెలుపు

నాదే కాలం

నేను కాలం చేసినా నా వారసుడికి అదే ఉగ్గుపాలతో రంగరించి పోస్తా

రాసిస్తా వీలునామా!!

– గిరి ప్రసాద్ చెలమల్లు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`~~

కవితలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో