జనపదం జానపదం- 25-యానాది తెగ జీవన విధానం — భోజన్న

బక్క పలుచని దేహం, నలుపు వర్ణం, చిన్న గోసి గుడ్డ, శరీరమంతా మట్టితో యానాదులు కనిపిస్తారు. వీరు నిరంతరం పొలాలు, చెలుకలు, తోటల గట్ల వెంట పలుగు, పార (పికాసి) పొడవాటి కర్ర, కిరసనాయిలు (గ్యాస్), గడ్డి, గుడ్డలు, గాలి ఊదే పరికరాలతో తిరుగుతుంటారు. వీరి ప్రధాన ఆహారం మాంసం అందులోను ఎలుక మాంసాన్ని చాలా ఆనందంగా తింటారు. కుందేలు మాంసం, మేక మాంసం, గొర్రె మాంసం, చేపలను కూడా తింటారు. గొడ్డు మాంసాన్ని వీరు తినరు. ఎలుకల బెడద పొలంలో, ఇంటిలో ఎక్కవైనా భూస్వాములకు వెంటనే యానాదులు గుర్తుకు వస్తారు.

యానాదులు నల్లమల్ల అడవిలోను, నెల్లూరు సముద్ర తీరం వరకు, చిత్తూరు జిల్లాలోను ఉన్నారు. పూర్వం అడవి సంపదకై ఆధారపడిన వీరు అడవులకి దగ్గర గ్రామాలుగా ఏర్పడి రకరకాల పనులు చేసుకుంటున్నారు. వ్యవసాయ కూలీలుగా రోడ్డు, భవన కార్మికులుగా అవతారమెత్తారు. శ్రీహరి కోట ఐలాండ్ కి చెందిన స్థానికులుగా థర్ స్టన్ (Thurston) 1909లో వీరిని పేర్కొన్నారు. యానాదుల మాతృ భాష తెలుగు. 2011 లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,37,808 ఉన్నట్లు తెలుస్తోంది. వీరు ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో ఎక్కువగా విస్తరించి ఉన్నారు. నెల్లూరులో అత్యధికంగా ఉన్నారు.

సంస్కృత పదమైన అనాది అనే పదం నుండి యానాది అనే పేరు వచ్చిందని పండితులు భావిస్తున్నారు. యానాది అనగా పుట్టుక గురించి తెలియని వారు అని అర్థం. యానాదులు నాగరికులతో కూడా కలిసి జీవించగలరు, తెలంగాణలో సైతం అక్కడక్కడా వీరు కనిపిస్తారు.

వీరు ప్రథమంగా రైతులకు సహాయపడడం, పంట పొలాలకు సంరక్షకులుగా వ్యవహరిస్తారు. ద్వితీయ పనులుగా చేపలు పట్టడం, వంట చెరుకు సేకరణ, రిక్షాలు లాగడం, ఎలుకలు పట్టడం చేస్తుంటారు. వీరిలో కుల పంచాయతీలు నేటికీ ఉన్నాయి. నిందితులకు శిక్ష లేదా జరిమానా విధించిన తర్వాత వీరంతా సంబరాలు చేసుకుంటారు‌. ఈ పంచాయతీ ద్వారా దొంగతనాలు, భూవివాదాలు మొదలైనవి వారికి వారే పరిష్కరించుకుంటారు. వీరి నివాస ప్రాంతం సాంప్రదాయ కౌన్సిల్ ను కలిగి ఉంటుంది. దీన్ని ‘కుల పంచాయతీ’ అంటారు.

యానాదులు హిందూ దేవతలైన మహాలక్ష్మమ్మ, చెంచమ్మ, పోలేరమ్మ దేవతలను కొలుస్తారు, హిందూ పండుగలనే వారి పండగలుగా జరుపుకుంటారు. వీరిలో విడాకులు తీసుకునే వెసులుబాటు, మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. వితంతువులు సైతం మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో శాస్త్రీయ అంశాలు ఆధునిక మానవులు సైతం అందుకోలేని ఆలోచనలు, ఐక్యత, స్నేహం, ప్రేమ, ఉన్నంతలో ఆనందంగా జీవితాన్ని గడిపే తత్వం యానాదులో కనిపిస్తుంది

యానాదుల ఆహారపు అలవాట్లను బట్టి మరియు వృత్తులను బట్టి వారిని నాలుగు సమూహాలుగా వర్గీకరించారు. అవి

1.మంచి యానాదులు లేదా రెడ్డి యానాదులు : (cultivator). వీరిని తల యానాదుల అని అంటారు. వీరు చాలా నిజాయితీగా ఉంటారు, వీరిలో కొంత వరకు అక్షరాస్యత కూడా ఉంటుంది

2.అడవి యానాదులు : (Those Living in Forest) వీరు పశువులను అడవుల్లో మేపుతూ, పశువుల ఆధారంగా జీవిస్తున్నారు.

3.పాకి యానాదులు : (scavengers) మురికి కాలువ నుండి లోహాన్ని సేకరిస్తారు, పాకి పనులు చేస్తుంటారు

4.చల్ల యానాదులు : వీరినే చల్లని యానాదులు కూడా అంటారు. వీరు కాలవ గట్టున నివసిస్తారు. ఏ చీకూ చింతా లేకుండా రోజులు గడుపుతారు, రేపటి గురించి ఆలోచనే వీరిలో ఉండదు. ఈ తెగలో పాకి యానాదులు, చల్ల యానాదులను తక్కువ హోదాగా పరిగణిస్తారు.

ప్రభుత్వం వీరి కోసం విద్య, అవాసం, మహిళా మరియు శిశు అభివృద్ధి, ఆరోగ్యం, పోషకాహారం, రోడ్డు వంటి ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టింది కాని, అందులో వీరికి అందినవి చాలా తక్కువ మాత్రమే అని చెప్పవచ్చు. పేద యానాదుల కోసం ‘ల్యాండ్ కొలనైజేషన్’ పథకాన్ని బ్రిటిష్ కాలంలోనే ప్రవేశపెట్టారు. ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని వారికి భూమిని కల్పించే ఆలోచనతో ‘ల్యాండ్ అసైన్మెంట్’ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇది కొంత వీరిని ఆదుకున్నా, వీరి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఎందరో భూస్వాములు వీరి భూములు లాక్కొన్నారు. ఇలాంటి సంఘటనల ఆధారంగానే కేశవ రెడ్డి గారు యానాది జీవితాన్ని చిత్రిస్తూ ‘చివరి గుడిసె’ నవల రాశారు. ఈ నవలలో వీరి యొక్క సామాజిక, ఆర్థిక జీవితంతో పాటు అనేక అంశాలను చర్చించారు. ల్యాండ్ కొలనైజేషన్, ల్యాండ్ అసైన్మెంట్ పథకాలను గురించి వివరాలు దాని ద్వారా లభించిన భూమిని ఇతరులు కొల్లగొట్టిన విధానాన్ని చిత్రీకరించారు.
.

— భోజన్న

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

కాలమ్స్, , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో