ఓటుహక్కు కోసం పోరాడిన అమెరికన్ జర్నలిస్ట్ –మేరీ వైట్ ఓవింగ్టన్(వ్యాసం )- గబ్బిట దుర్గాప్రసాద్

11-4-1865న అమెరికాలోని న్యూయార్క్ వద్ద బ్రూక్లిన్ లో మేరీ వైట్ ఓవింగ్టన్ జన్మించింది .తలిదండ్రులు స్త్రీ హక్కులకోసం,బానిసత్వ నిర్మూలన కోసం పోరాడే యునిటరేనియన్ చర్చి కి సంబంధించిన వారు .పాకర్ కాలేజి ఇన్ ష్టిట్యూట్,రాడిక్లిఫ్ కాలేజి లో చదివి , 1890లో సివిల్ రైట్స్ ఉద్యమం లో పాల్గొని ,ఫ్రెడరిక్ డగ్లస్ ఉపన్యాసం న్యు యార్క్ లో విని ప్రేరణ పొంది ,1903లో సోషల్ రిఫార్మ్ క్లబ్ లో బుకర్ టి.వాషింగ్టన్ ప్రసంగం తో స్పూర్తి పొందింది .1894లో ఇడా బి.వెల్స్ ను కలిసి ,అతని అక్క చెల్లెళ్ళ పిల్లలకు క్రిస్మస్ గిఫ్ట్ లు అందించి ,వారి దయనీయ జీవితాలను చూసి కలత చెంది ,ఇడా తో కలిసి వారి నివాసాలను మెరుగు పరచటానికి కృషి చేసింది .1895లో బ్రూక్లిన్ లో ‘’గ్రీన్ పాయింట్ సెటిల్ మెంట్ ‘’ఏర్పరచి ,తర్వాత ఏడాది ఆప్రాజేక్ట్ హెడ్ అయింది .1904లో సాంఘిక విచారణ సంఘం అయిన గ్రీన్ విచ్ హౌస్ కమిటీ ఫెలో అయింది .తర్వాత అయిదేళ్ళు మాన్ హట్టన్ నల్లవారి ఉద్యోగాలు గృహ విషయాలపై అధ్యయనం చేసింది .ఆ సమయం లో డబ్లు బి.డ్యుబోస్ తో పరిచయమై ,ఇద్దరు ‘’నయాగర మూమెంట్’’ కు సంస్థాపక సభ్యులయ్యారు .

1905లో ఓవింగ్టన్ అమెరికన్ సోషలిస్ట్ పార్టీ లో చేరి ,విలియం మోరిస్ ప్రభావం తో ఫిలిప్ రాండాల్ఫ్ ,ఫ్లయోడ్ డెల్,మాక్స్ ఈస్ట్ మాన్ ,జాక్ లండన్ వంటి ప్రముఖులతో పరిచయం పెంచుకొన్నది .వీరంతా జాతి సమస్యలు క్లాస్ సమస్యల వంటివే అని అభిప్రాయ పడ్డారు .దిమాసేస్ ,న్యూయార్క్ ఈవెనింగ్ పోస్ట్ ,న్యూయార్క్ కాల్ ,పత్రికలలో ఈసమస్య లపై వ్యాసాలూ రాసింది .రే స్టానార్డ్ బెకర్ తో కలిసి పని చేసింది అతడు 1908లో రాసిన ‘’ఫాలోయింగ్ ది కలర్ లైన్ ‘’పుస్తకం చదివి ప్రభావితురాలైంది .

1908లో విలియం ఇంగ్లిష్ వాల్లింగ్ అనే సోషలిస్ట్ ది ఇండి పెండెంట్ పత్రిక లో రాసిన ‘’రేస్ వార్ ఇన్ ది నార్త్ ‘’చదివి ,నల్లజాతి నిలయాలైన అబ్రహాం లింకన్ ,స్ప్రింగ్ ఫీల్డ్ ,ఇల్లినాయిస్ లలో జరిగిన హత్యలు గృహదహనాలు బిజినెస్ లపై దాడులు తెలిసి అత్యున్నత సంఘం తో విచారణ జరిపించి వారికి తక్షణ న్యాయం జరిపించాలని కోరిన విషయాలన్నీ తెలుసుకొని ,తానుకూడా ఆర్టికల్స్ రాసి ,న్యూయార్క్ సిటిలో వాలింగ్ ను ఆయన ఇంట్లో హెన్రి మొసోవిజ్ బృందంతో వెళ్లి పరామర్శించి ,ఆఫ్రికన్ అమెరికన్ ల పౌర ,రాజకీయ హక్కులకోసం లింకన్ పుట్టిన రోజు 1909ఫిబ్రవరి 12న జాతీయ సమావేశం జరపాలని నిర్ణయించారు .

న్యూయార్క్ లో1909లో మే 31,జూన్ 1 న ‘’నేషనల్ నీగ్రో కమిటీ ‘’సమావేశం జరిగింది .తర్వాత ఏడాది అది ‘’నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్ మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ ‘’(NAACP)గా విస్త్రుతమైసమావేశం జరిపింది .ఓవింగ్టన్ ఎక్సి క్యూటివ్ సేక్రేటరిగా ,జోసేఫిన్ రాఫిన్ ,మేరి టాల్బర్ట్ ,జార్జి హెన్రి వైట్ మొదలైనవారు సభ్యులు .తర్వాత ఏడాది లండన్ లో జరిగిన ‘’యూనివర్సల్ రేసెస్ కాంగ్రెస్ ‘’లో పాల్గొన్నది .రిచేట్టా వాన్డాల్ఫ్ వాలెస్ ‘’చాలాకాలం ఈమె వద్ద సేక్రేటరి గా ఆ సంస్థకు పని చేసింది .

మహిళా ఓటింగ్ హక్కు ఉద్యమాలలో1921లో ఓవింగ్టన్ చురుకుగా పాల్గొని ,ఆలిస్ పాల్ కు ఒక ఉత్తరం రాస్తూ19వ అమెండ్ మెంట్ బిల్లు పాసైన సందర్భంగా జరిపే ‘’నేషనల్ వుమెన్స్ పార్టీ ‘’ఉత్సవాలలో నల్లజాతి మహిళలను కూడా ఆహ్వానించామని కోరింది .పాసిఫిస్ట్ అయిన ఓవింగ్టన్ మొదటి ప్రపంచయుద్ధం లో అమెరికా పాల్గొనటం పై వ్యతిరేకించింది .నల్లవారి పౌరహక్కులను సమర్ధిస్తున్న ‘’ది మెసెంజర్ ‘’పత్రికాధిపతి ఫిలిప్ రాండాల్ఫ్ ను సమర్ధించింది .

యుద్ధం తర్వాత ఓవింగ్టన్ NAACP) లో బోర్డ్ మెంబర్ ,ఎక్సిక్యూటివ్ సెక్రెటరి,చైర్మన్ గా పని చేసింది .మహిళలను చైతన్యం చేసి సంస్థలో చేర్పించింది .ఈ సంస్థ ఓటింగ్ హక్కు, జాతి వివక్షత ,విద్య ,ఉద్యోగం ,గృహాలు ,రవాణా విషయాలపై తీవ్ర పోరాటాలు చేసింది .దక్షిణ రాష్ట్రాలు చేసిన చాలా చట్టాలు రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీం కోర్ట్ లో1915నుంచి 1923 వరకు కేసులు వేసి న్యాయం పొందారు .

1934జూన్ లో ఒవింగ్టన్ 14 వివిధ కాలేజి లలో ప్రసంగాలు చేసింది .తన సంస్థ నల్ల తెల్ల యువత ను సమానంగా చూస్తూ నల్లవారి హక్కులను కాపాడే ది అనీ తెల్లవారిలో కూడా నల్లవారి హక్కులపట్ల సానుభూతి తో ఉన్నవారున్నారని “They should know the power the race has gained” – Mary White Ovington[7] చెప్పింది.

బ్లాక్ మాన్హట్టన్ స్టేడి ,హాఫ్ ఎమాన్ ,స్టేటస్ ఆఫ్ నీగ్రో ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ,సోషలిజం అండ్ ఫెమినిస్ట్ మువ్ మెంట్ ,యాన్ ఆ౦థాలజి ఆఫ్ బ్లాక్ చిల్డ్రెన్ ,ది అప్ వర్డ్ పాత్ ,బయాగ్రఫికల్ స్కెచెస్ ఆఫ్ ఆఫ్రికన్ –అమెరికన్స్ ,పోర్త్రైట్స్ ఆఫ్ కలర్ ,పుస్తకాలతో పాటు తన జీవిత చరిత్ర ‘’రెమినిసేన్సెస్ ‘’రాసింది . తన అనారోగ్యం దృష్ట్యా తన పదవి నుంచి తప్పించమని మరీమరీ కోరేది . తప్పని సరి పరిస్థితులలో మేరీ వైట్ ఓవింగ్టన్ 1947లో 38 సంవత్సరాల నిర్విరామ సేవ చేసి తన సంస్థ బోర్డ్ మెంబర్ గా రిటైర్ అయింది . చివరి రోజులలో మాసా చూసేట్స్ లో తన అక్క చెల్లెళ్ళ వద్ద సుఖ జీవితం గడిపింది .అక్కడే న్యూటన్ హైలాన్డ్స్ లో 17-7-1951న 86ఏళ్ళ సార్ధక జీవనం గడిపి మేరీ వైట్ ఓవింగ్టన్ మరణించింది .బ్రూక్లిన్ లోని మిడిల్ స్కూల్ కు ఆమె పేరుపెట్టి గౌరవించారు .2009లో ఆమె గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు .

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో