జ్ఞాపకం-68 – అంగులూరి అంజనీదేవి

అతను అదేం గమనించకుండా “ఏమీ అనుకోదు. నీకిప్పుడు టైం చాలా ముఖ్యం. ఇలాంటి చిన్నచిన్న పనులకి సమయాన్ని చేసుకోకు”
“ఇదేంటండీ కొత్తగా మాట్లాడుతున్నారు?” మళ్లీ ఆశ్చర్యపోయింది సంలేఖ.
“నీ కొత్త సీరియల్ ప్రారంభమైందిగా!”
“అవును. అయింది. అది మొన్ననే మార్కెట్ లోకి వచ్చింది. ఆ పత్రిక వాళ్లు మనకో కాంప్లిమెంటరీ కాపీకూడా పంపించారు. చూశాను. మీక్కూడా చూపించాను. కానీ మీరప్పుడు దానివైపు అంత ఇంట్రస్ట్ గా చూడనట్లనిపించింది. ఇప్పుడెందుకు దాన్ని గుర్తు చేస్తున్నారు?”
“చెయ్యాల్సిన సమయం వచ్చింది కాబట్టి!”
ఏంటో ఆ సమయం అన్నట్లు భర్త ముఖంలోకి సూటిగా, లోతుగా చూసింది.
అతను చాలా ఆనందంగా వున్నట్లు అతని ముఖంలో చిరుతేజం వుట్టిపడుతోంది. అది ఎందుకో ఆమెకు అర్థం కావడం లేదు.
“ముందు నువ్వు నీ కుడిచేతిని నా పెదవుల దగ్గర పెట్టు” అన్నాడు.
అతను చెప్పినట్లే పెట్టింది సంలేఖ. వెంటనే ఆమె చేతిని పట్టుకొని దానిపై పెదవులతో ఇంచి, ఇంచి అద్దుతూ “ఈ చేత్తోనే కదా నువ్వు రచనలు చేసేది? నువ్వు చేస్తున్న రచనలు ఎక్కడెక్కడికి వెళ్తాయో! ఎవరెవరు చదువుతుంటారో నీకు తెలుసా?” అన్నాడు. అతనామె చేతిని మాత్రం వదలకుండా అలాగే పట్టుకున్నాడు. అపురూపంగా దాన్నే చూశాడు.
అతనంత దగ్గరగా కూర్చుని, తనకి నచ్చిన మాటలు మాట్లాడుతుంటే ఆ ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయి ఇల్లంతా పుస్తకాలు, ఎక్కడ చూసినా సాహిత్యపు సువాసనలు వస్తున్న అనుభూతి కలుగుతోంది. అత్తగారు, మామగారు కూడా ‘నా కోడలు రచయిత్రి’ అని చుట్టుపక్కలవారితో తన రచనల్ని చదవించి ఆనందపడుతున్నట్లు ఒక్కక్షణం సంలేఖ హృదయం పులకింతల తడితో తడిసిపోయింది.
అన్నిరోజులు అత్తగారు, మామగారు తమ మాటలతో పెడుతున్న హింస ఎగిరిపోయి భర్త భుజం హంసతూలికా తల్పంలా అన్పించి తల ఆన్చి ప్రశాంతంగా చూస్తోంది. అతనామె చేతివేళ్లను ప్రేమగా నిమురుతున్నాడు.
అలా కొద్ది క్షణాలు గడిచాయి.
“చెప్పు లేఖా! నీ రచనలు ఎక్కడెక్కడికి వెళ్తుంటాయో! వాటిని ఎవరెవరు చదువుతారో నీకు తెలుసా?” అని మళ్లీ అడిగాడు.
అతను అడిగేది ఆమెకు బాగా నచ్చిన అంశం కావడంతో ఆమెకు ఇంకా ఏదో చెప్పాలనిపిస్తూ “నాకే కాదు. ఏ రైటర్ కి తెలియదు. నేను మా ఆదిపురి పొలాల్లో చెట్లకింద కూర్చుని కొమ్మూరి, యండమూరి, యద్దనపూడి, మాలతీచందూర్ గారి నవలలు చదివేదాన్ని. చదువుతున్నంతసేపు ఆ రైటర్స్ గురించి ఆలోచించేదాన్ని. ఎలా రాస్తారు వీళ్లు? అన్న ప్రశ్న తప్ప ఇంకేం వుండేది కాదు నాలో. కానీ వాళ్ల రచనల్ని నేను చదివి అలా ఫీలవుతున్నానని వాళ్లలో ఒక్కరికైనా తెలుసా? తెలియదు. తెలిస్తే మాత్రం జన్మ ధన్యమైనట్లే! ఎందుకో చెప్పనా?” అంది.
“చెప్పు!” అన్నాడు జయంత్.
“ఏదైనా ఒక రచన చదువుతున్నప్పుడు ఆ రచనతో చదివేవాళ్ల హృదయం మమేకమైపోతుంది. ఎంత వద్దనుకున్నా మాట్లాడుతుంది. పోట్లాడుతుంది. ప్రశ్నలు వేస్తుంది. జవాబులు వెతుక్కుంటుంది. ఇందులో చదివిన వాక్యాలన్నీ నా జీవనసరళికి దగ్గరగా వున్నాయే అని ఆశ్చర్యపోతుంది. అనుభూతిస్తుంది. ఇది రాసిన వాళ్లను చూస్తే బావుండని ఉవ్విళ్లూరుతుంది. తొందరపడుతుంది. కానీ ఎక్కడో తప్ప రచనలు చేసేవాళ్లను పాఠకులు కలుసుకోవటం, చూడటం జరగదు. ఎందుకంటే రచనలనేవి బయటికెళ్లాక విస్తృతంగా చేతులు మారుతుంటాయి. ఊర్లు మారుతుంటాయి. నగరాలు మారుతుంటాయి. గ్రంథాలయాల్లోకి చేరి తరతరాలు నిలిచిపోతాయి. అందుకే తమ రచనలు ఎవరెవరు చదువుతున్నారో అవి ఎక్కడెక్కడికి వెళ్తున్నాయో రైటర్స్ తెలుసుకోలేరు” అంది.
“వావ్! అద్భుతం కదా! ఎందుకంటే ఇప్పుడు నీ పరిస్థితి కూడా నువ్వు చెప్పినట్లే వుంది తెలుసా?” అన్నాడు.
సంలేఖ తెలుసనలేదు. తెలియదనలేదు. నిమిత్తమాత్రంగా చూస్తోంది. కానీ తన భర్త అంత ఆసక్తిగా రచనల ప్రసక్తి తేవడం, మాట్లాడటం, వినటం బావుంది. తాము చేస్తున్న పనిని ఇంట్లో వాళ్లు మెచ్చుకుంటే ఎవరికైనా అలాగే వుంటుంది.
కానీ ఎప్పుడు చూసినా కంపెనీలో ఫైల్స్ ముందేసుకుని లెక్కలు చూసుకునే ఒక చార్టెర్డ్ అక్కౌంటెంట్ అయిన తన భర్త రచనల గురించి మాట్లాడటం, వినటం వింతగా అన్పించి “ఎప్పుడూ లేని విధంగా ఈ టాపిక్ మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాకైతే వండర్ గా, హ్యాపీగా వుంది. ఇంత మార్పు ఎలా వచ్చింది మీలో?” అడిగింది సంఖ.
“అది నీ సెల్ ఫోన్ మహిమ”
“అదేదో తాయత్తు మహిమ అన్నట్లు సెల్ ఫోన్ మహిమ ఏంటి? మరీ జోగ్గా వుంది మీరు చెప్పేది” అంటూ మళ్లీ నవ్వింది.
“నేను చెప్పేది వింటే అది జోకైంది లేంది నీకే తెలుస్తుంది” అన్నాడు.
“సరే! చెప్పండి” అంటూ అతని చెంపమీద చేయి ఆన్చి సున్నితంగా తనవైపుకు తిప్పుకుని సరదాగా అతని కళ్లలోకి చూసింది.
వెంటనే జయంత్ తన ప్యాంట్ బ్యాక్ పాకెట్లోంచి సంలేఖ సెల్ ఫోన్ ని బయటికి తీసి ఆమె చేతిలో పెట్టాడు.
“దీన్ని రిపేర్ చేయించమని నా చేతికి ఇచ్చావ్ గుర్తుందా?” అని అడిగాడు.
దానివైపే చూస్తూ “అవును. ఇచ్చాను. గుర్తుంది” అంది.
“అది ఈరోజు నేను ఆఫీసుకి వెళ్లేముందు షాప్ కెళ్లి తీసుకున్నాను. నేను ఆఫీసులో వున్నంతసేపు నీ సెల్ ఫోన్ కి నీ అభిమానులు ఫోన్లు చేస్తూనే వున్నారు. వూపిరి పీల్చుకోనివ్వలేదు. మొన్న ప్రారంభమైన నీ సీరియల్ మీద వచ్చిన రెస్పాన్స్ అది” అన్నాడు.
“అవునా! ఈ మధ్యన సీరియల్ ప్రచురించే ముందు రైటర్ మొబైల్ నెంబర్ ఇస్తున్నారు. దీనివల్ల పాఠకులకు రైటర్స్ తో మాట్లాడే సౌకర్యం ఏర్పడింది. మీరు చెప్పేది వింటుంటే నా సీరియల్ మీద కాల్స్ బాగానే వచ్చినట్లుంది” అంది.
“నెమ్మదిగా అంటావేం? విపరీతంగా వచ్చాయి” అన్నాడు.
సంలేఖకి ఆనందంగా వుంది. భర్త ఇంకా ఏం చెబుతాడా అని ఎదురు చూస్తోంది.
“కొందరు స్టూడెంట్స్ కాల్ చేసి ‘కేక సార్! మేడమ్ సీరియల్’ అన్నారు. నడివయసువాళ్లు ‘ఏం రాశారండీ! చదువుతుంటే ఇంకా చదవాలనిపిస్తోంది. మళ్లీవారం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాం! ముందు మిమ్మల్ని అభినందించాలి. మేడమ్ గారికి ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు’ అన్నారు.

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలు, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో