సాహితీ వనంలో శిష్య, ప్రశిష్యుల ఘనాకరుడు -సుధాకరుడు (సంపాదకీయం)- అరసి

కొన్ని సమయాల్లో మౌనం ఎన్నో ఎన్నో సంఘటనలను కళ్ళ ముందు నిలుపుతుంది. ఎంతగా మాట్లాడాలి అనుకున్నా మనసులోను , కళ్ళల్లోను ఎన్నో సంఘటనలు కనిపిస్తున్నా కాని ఒక్క పలుకు కనీసం ఒక్క అక్షరం కూడా రాదు అలాంటి పరిస్థితిలోనే ఉన్నాను ఎప్పుడు ఒకటో తారీఖున పెట్టె సంపాదకీయం ఇప్పుడు కాని కాలేదు. కారణం ఇప్పుడు రాయాల్సింది “ఆధునిక తెలుగు సాహితీ వనంలో నల్లద్రాక్ష పందిరి వేసి మల్లె మొగ్గల గొడుగు లో వర్తమాన విషయాలను కొత్త గబ్బిలంతో సాహిత్యాకాశంలో చిరస్థాయిగా నిలిచిపోయిన సుధాకరుడు ఆయన”. …..వారి అనుభవం అంత కాదు నా వయస్సు. 

పుష్కర కాలం పైగా సార్ కి దగ్గరగా ఉండే అదృష్టం దొరికిన అతికొద్ది మంది శిష్యులలో నేను ఒకరిని. తెలుగు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగు నుంచి మొదలు నా ప్రయాణం. మేము ఎం.ఏలో ఉన్నప్పుడు ఆధునిక తెలుగు సాహిత్యం, సాహిత్య వాదాలను సార్ వివరించిన తీరు ప్రత్యేకం.

ఎప్పుడు అనే వారు ఈ సిల’బస్’అనే బస్ సెమిస్టర్ అయ్యే సమయానికి ఎలా అయినా బస్ స్టాప్ కి చేరుతుందిరా బాబు. నాకు కావాల్సింది ఇది కాదు మీకు సాహిత్యం విలువ తెలియాలి. కనీసం ఇప్పుడు వస్తున్న సాహిత్యం పుస్తకాలు, రచయిత్రులు, వాళ్ల ధోరణులు మీకు అర్ధం కావాలి అని మాకు ప్రతి రోజు తరగతిలో రోజుకో పుస్తకాన్ని తెచ్చి పరిచయం చేసే వారు. మా చేతనే చదివించేవారు. అలా ఏం.ఎ లో సార్ క్లాసులో నేను ఎన్నో పుస్తకాలను చదివాను.

ఇక ఒక అంశం గురించి మాట్లాడితే దాని మీద ఎన్ని పుస్తకాలు వచ్చాయో అన్ని మన గ్రంధాలయంలో ఉన్నాయి వెళ్లి చూడండి అంటూ పుస్తకం పేరు , రచయిత పేరు అవలోకగా మాకు చెప్పేవారు ఆయన.
మాకు పాఠం చెప్పే సమయంలో ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు వెంటనే మా నుంచి సమాధానం రాకపోతే అన్ని మన మెదడు అనే ‘చిప్’ లో ఉండాలి రా బాబు లేకపోతే తెలుగు మాస్టర్ అనగానే అందరికి లోకువే ఇది కూడా తెలియదా అంద్తూ ‘చీప్’ గా చూస్తారు అనేవారు

                                                                           ***
నేను పిజి అయ్యాక ఏం.ఫిల్ లో చేరడానికి వెళ్ళినప్పుడు మా నాట్య గురువు సప్పా దుర్గాప్రసాద్ గారు సార్ తో మాట్లాడటం తను నా స్టూడెంట్ మీరు పుస్తకం యిచ్చి పంపడం అని సార్ అనడం దాని మీద నేను ఏం.ఫిల్ లో చేరాను. మొదటి రోజు క్లాస్ అయ్యాక సార్ గదికి వెళ్ళినప్పుడు అక్కడే సార్ నాకు హేమలత మాం ని పరిచయం చేసారు.

ఎన్నో పరిశోధన గ్రంధాలు సార్ వద్దకు రావడం వాటిని ఆమూలాగ్రం చూసి అభిప్రాయాన్ని పంపడం సాధారణంగా విశ్వవిద్యాలయ స్థాయి అధ్యాపకులకు సర్వసాధారణం. కాని వారి వద్ద ఉన్న శిష్యులకు మాత్రమే దక్కే అదృష్టం కూడా అది. ఎందుకంటె వాటిని ఒకరోజు ముందుగానే మా చేతికిచ్చి చదవమనే వారు. మరసటి రోజు ఆ పరిశోధనను విశ్లేషిస్తూ సార్ నివేదిక చెబుతుంటే నేను రాయడం నాకు ఒక అలవాటుగా మారిపోయింది.

బహుశా అందుకేనేమో నా ఏం.ఫిల్ , పి.హెచ్ డి పరిశోధన ఎంతో సజావుగా సాగిపోయింది. ఈరోజు ఎవరినా ఒక అంశం పై పి.హెచ్ డి చేస్తున్నాను అనగానే ఎన్ని అధ్యాయాలు ఏమిటి ? ఇలా ఎందుకు చేసారు? మీరు తీసుకున్న అంశం స్పష్టత లేదు అని మాట్లాడుతున్నాను అంటే అది సార్ మాకు నేర్పిన జ్ఞానమే.
                                                                                     ***
సార్ కవితలు చెబుతుంటే రాసిన సందర్భాలు ఉన్నాయి. సార్ రాసిచ్చిన కవితలను టైప్ చేసి పలానా పత్రిక వాళ్ళు అడిగారురా బాబు వాళ్లకి పంపండి అని మెయిల్ ఐడి , ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్లకి పంపే వాళ్ళం. ఇక కవితలు, వ్యాసాలు పరిశోధన గ్రంధాల నివేదికలు రాసినప్పుడు ఎన్నో వేల పదసంపద వారి నుండి నేర్చుకున్నవే. ఒక పదాన్ని ఒకసారి ఉపయోగిస్తే మరొక సారి ఆ పదం కాకుండా మరొక పదం అక్కడ రావాల్సిందే . అలా వచ్చిన పదాలను మాకు వివరించేవారు కూడా. మచ్చుకు ముప్పిదాలు , కోకొల్లలు, ఆమూలాగ్రం  వంటి పదాలు.

ఇంట్లో ఉన్నవి కొన్ని వేల పుస్తకాలు సార్ కి ప్రతి పుస్తకము పేరు, పుస్తకం పైన ఉన్న అట్ట రంగు కూడా గుర్తే. పలానా పుస్తకం కావాలి అని అన్ని వివరాలు చెప్పి తీసి ఉంచమని అనే వారు అంతగా జ్ఞప్తి ఆయనకు.అంతర్జాలంలో తెలుగు సాహిత్యం విస్తరిస్తున్నప్పుడే హేమలతం మాం సార్ పేరుతో బ్లాగ్ రూపొందించారు. వాటి గురించి నాకు ఏం తెలుసు నాకు  రాయడం ఒకటే వచ్చు. అవన్నీ మీరే చూసుకోవాలి అనేవారు.

ఏ సాహిత్య సభలకి ప్రయాణం చేసిన చివరికి విశ్వవిద్యాలయం కి వెళ్తున్నప్పుడు కూడా ఏదో ఒక పుస్తకం ఆయన హస్త భూషణంగా మారాల్సిందే. ఎప్పుడు ఏదో ఒకటి చదువుతూనే ఉండేవారు. 2002 లో సార్ కి బై పాస్ సర్జిరీ అయ్యింది. విశాఖపట్నం, హైదరాబాద్ లలో వైద్యం జరిగింది. ఆ సమయంలో కూడా పుస్తకాలు చదవడం, సాహిత్యం వారికి ఎలా వ్యాపకం అయ్యిందో ఒక సందర్భంలో అన్న మాటలువి “ ఈ నేపథ్యంలో ఎన్నో రాత్రులు ఆసుపత్రుల్లో గడపవలసి వచ్చింది. అప్పుడు ఉర్దూ కవిత్వమే నా దర్దే జిగర్ కు ఔషదంలా పని చేసింది. హిందీ లిపి లోంచి నజరానా అనువాదాలు 230వరకు చేశాను” అన్నారు . అంతగా నిరంతరం సాహిత్యంలోనే గడిపేవారు .

సార్ సెమినార్ లకు , సాహిత్య సభలకి విరివిగా హాజరు అయ్యేవారు. అక్కడ ఉన్న ఆయన శిష్యులు వచ్చి సార్ ని సభ ప్రాంగణానికి తీసుకు వెళ్ళడం, తిరిగి రైలు ఎక్కే వరకు ఆయన వెంటే ఉన్న శిష్యులు ఎందరో, రైలు, బస్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ల ఉన్న ప్రాంతం నుంచి సార్ ప్రయాణం ఉంటె సమయానికి స్టేషన్ కి రావడం సార్ తో రెండు నిమిషాలు మాట్లాడి వెళ్ళడం చాలా మందికి అనుభవంలో ఉన్నదే .

సాధారణంగా  కళలలో  సంగీత,నాట్యం వంటి వాటిల్లో  శిష్య, ప్రశిష్యులు అనే మాట ఎక్కువుగా వినిపిస్తుంది. ఒక గురువు వద్ద విద్యాభ్యసించిన వారు ప్రత్యక్ష శిష్యులైతే , ఆ శిష్యులు గురువుగా ఎంతో మందికి శిష్యులకు విద్యను బోధించడం జరుగుతుంది. వాళ్లు ప్రశిష్యులు. సాహిత్యంలో అటువంటి శిష్య ప్రశిష్యులు పొందటం అరుదనే చెప్పాలి. తెలుగు సాహిత్యంలో సి.నా.రె , ఎండ్లూరి వారికే అది సాధ్యం అయ్యింది అనడంలో అతిశయోక్తి లేదు.

మీరు భౌతికంగా మాతో లేకపోయినా మీ  జ్ఞాపకాలు మాతో ఎప్పటికి సజీవం.

-అరసి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~Related: nrma road closures nsw, nye county pahrump news, what happened to bruno hauptmann’s son, new jersey judges appointed, how to reference an exhibit in a document bluebook, san francisco superior court department 501, does she sleep with him in indecent proposal, protemp pt 175t kfa parts, silverleaf golf club owner ben herman, neisd high school lunch menu, reason to live give reason to die tattoo, denyce lawton sister, at what age can a child refuse visitation in utah, is alissa skovbye blind, andy bumatai wife,Related: percy and his mom lemon, dennis cavallari house, does amlodipine cause post nasal drip, python program to calculate heart rate, retrofit refresh token medium, iowa baseball roster 2014, linda sarsour husband, maher judeh, nasw code of ethics apa citation 2022, backstreet concert 2022, boy names that go with the middle name angel, what is blunt force trauma, future medical center careers, difference between handball and volleyball, best places to see turtles in cyprus, hank williams jr house address,Related: joseph simon araneta marcos biography, joan blackman and elvis relationship, peng zhao citadel wife, wall street tower manchester, nh death, the z castle marengo airbnb, where does anson mount live in connecticut, pimper’s paradise explication, what font does dmv use for registration, brett larson obituary, que sont devenus patrice et philippe gall, homer george gere, how old was sylvester stallone in rambo: first blood, , is fiona pregnant again 2021, queen ants for sale california,Related: skiing hilgard peak, tariq woolen scouting report, iu hoosiers basketball roster, mlb the show 21 fielding settings, florida man november 15, 2000, david bedella partner, do goldendoodles have a good sense of smell, is peter segal related to steven seagal, silvia cristina nodal, violence in macbeth quotes, margo dydek cause of death, google sheets data validation named range, ian epstein related to jeffrey epstein, sdpd community relations officer, tiffini hale 2020,Related: gaf timberline shingles recall, boosey and co serial numbers, mobile homes for rent in thomson, ga, terence kennedy son of arthur kennedy, medicina generale krasnodar 25 email, william alvin pitt net worth, object that represents bravery, travis hirschi propositional integration, how to read a lexisnexis report, did margot fonteyn die in poverty, teste para saber qual o meu karma, when do jamie and eddie sleep together, heather o’rourke parents, white dracolich 5e stats, beaver falls football,Related: boston university class of 2024, billings montana court case search, talbots credit card customer service, narwhal dartboard manual, southern shores mayor, jefferson county alabama dispatch log, houston national cemetery obituaries, elizabeth tower manchester for sale, viziv technologies news, opening a trade with $100 and 20x leverage, fairfax county court docket schedule, 44 caliber black powder revolver made in italy, howard hill vs fred bear, former boston meteorologists, best german restaurants in america,Related: is brent grimes still married, ocean city, maryland mugshots, illinois police academy dates 2022, floating homes for sale 2021, when and where was this contract written sharecropper contract, sandy neck beach orv permit application, appetizers for beef bourguignon, julia marie schlatter, law and order: svu fanfiction olivia knocked out, what is dr pol’s brothers name, craigslist 49cc scooters for sale, somerset county wanted list, left knee irrigation and debridement cpt code, the sum of three consecutive integers is 15, crimes and courts idaho falls,

సంపాదకీయం, , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో