సంపాదకీయం – జనవరి -అరసి శ్రీ

ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. విహంగ మహిళా సాహిత్య పత్రిక పదకొండేళ్ళు పూర్తి చేసుకుని పండేళ్ళ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో విహంగ పత్రిక అందంగా ఆకట్టుకునేలా సాహిత్య విలువలు తగ్గకుండా నాణ్యతతో రావడానికి సహకరిస్తున్న సంపాదక వర్గానికి, సాంకేతిక నిపుణులకి హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ సహకారాన్ని ఎప్పటికీ ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం .

ఎప్పటికప్పుడు వర్తమాన సంఘటనలపై రచయిత్రులు, రచయితలు స్పందిస్తూ మన పత్రికలో కూడా కథలు, కవితలు, వ్యాసాలూ రాసారు. ఎంతో మంది చదువరులు ఎప్పటికప్పుడు తగిన సహాలిస్తూ లోటుపాట్లను సవరించుకునే అవకాశాన్ని ఇచ్చారు. పత్రికలో వస్తున్న రచనలపై తమతమ అభిప్రాయాలను తెలియజేస్తూ అటు రచయితలని, ఇటు సంపాదక వర్గాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు.

“విహంగ” ఈ పయనంలో భాగస్వాములైన ఎందరికో పేరు పేరున వార్షికోత్సవ శుభాకాంక్షలు.

                                                                         *****

కరోనా కొత్త వేరియంట్ ఒమ్రికాన్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంటే మన దేశంలో మాత్రం కరోనా కేసులు రోజు రోజుకి మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో భారత్‌లో మొత్తం 16,764 కొత్త కేసులు నమోదు కాగా, 220 మరణాలు సంభవించాయి. గడచిన అక్టోబర్ తర్వాత ఒక్కరోజులో నమోదైన కేసుల సంఖ్యలో ఇదే తొలిసారి.

దేశ రాజధాని ఢిల్లీ, ముంబైతో పాటు కోల్‌కతాలో మరింత ఎక్కువగా కనిపిస్తోంది. శుక్రవారం ముంబైలో 3,671 కొత్త కేసులు వెలుగు చూశాయి. గురువారంతో పోల్చితే ఎక్కువనే చెప్పాలి. ఢిల్లీ, కోల్‌కతాలోను యిదే పరిస్థితి. కొన్ని రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ ని ఆమలు చేయడం మొదలు పెట్టాయి.

ఏప్రిల్, మే నెలల్లో కరోనా సెకండ్ వేవ్ మన దేశంలో ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడిప్పుడే బడులు , వ్యాపార సంస్థలు అన్ని ఒక గాడిలో పడుతున్నాయి. ఇలాంటి సమయంలో మళ్ళి పెను ప్రమాదం పొంచి ఉంది. ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా భారీ మూల్యం చెల్లించాల్సిందే అనే విషయం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరు మాస్కులు , సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉండాల్సిన సమయం.

మరొకసారి సాహితీ ప్రియులకు , చదువరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు విహంగ వార్షికోత్సవ శుభాకాంక్షలు . 

-అరసిశ్రీ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయంPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో