చీకటెప్పుడో ముసిరిందంటూ
ఇప్పటి వేకువ నెందుకు కప్పేయడం
లోకమెప్పుడో వాడిందంటూ
రేపటి మొగ్గను ఎందుకు తుంచేయడం
లే…
లే….
తొలి తొలి కిరణాలు
ప్రతిరోజూ ఉదయిస్తాయి
రా…
రా….
ఆశల గాలులు
ఏనాటికీ ఎండిపోవు
సమరానికి నీ నా తేడాలు
ఎక్కడున్నాయోయ్
పోరాడే వాడే యోధుడు
గెలిచావా
వీరుడివి
ఓడావా
పరమవీర చక్రకు అర్హుడివి
సాగే కాలం
ముగిసే జీవితం
రెండిటి నడుమ నీదో చిన్న ప్రయాణం
ఎంత దూరమో ఎరుగని గమ్యానికి
నీ నవ్వే వెలుగు దీపం
-సుధామురళి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~