అమెరికన్ ఆంత్రో పాలజిస్ట్ జోరా నియేల్ హర్ట్సన్(వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్

1891 జనవరి 7న ,అమెరికా అలబామా రాష్ట్రం నోటా సుల్గా లోజన్మించి , జనవరి 28న 1960లో 70 వ ఏట మరణించిన జోరా నియేల్ హర్ట్సన్ రచయిత్రి, ఆంత్రో పాలజిస్ట్ ఫిలిం మేకర్ .జాన్ హర్త్సన్,లూసీ ఆన్ దంపతుల ఎనిమిది మంది సంతానం లో అయిదవ ఆమె .ఆమె నలుగురు తాతలు బానిసలుగానే పుట్టారు .తండ్రి బాప్టిస్ట్ ప్రీచర్ ,షేర్ క్రాపర్ . తర్వాత కార్పెంటర్ అవగా తల్లి స్కూల్ టీచర్ అయింది . .ఆమె మూడవ ఏట తండ్రి కుటుంబాన్ని ఫ్లారిడా రాష్ట్రంలోని మొట్టమొదటి పూర్తీ బ్లాక్ టౌన్ అయిన ఈటన్ విల్ కు మార్చాడు .ఇదే తన పుట్టిన ఊరు అనే అభిప్రాయం ఆమెకు కలిగింది .తండ్రి మేయర్ గా ఎన్నికై ,అతిపెద్దదైన మాసిడోనియా బాప్టిస్ట్ మిషన్ చర్చికి మినిస్టర్ అయ్యాడు .

ఈ ఊరునే తన కథలకు నేపధ్యంగా ఆమె తీసుకొన్నది .ఇక్కడి ఆఫ్రికన్ అమెరికన్ లు తమ ఇష్టప్రకారం జీవించే సౌకర్యం ఉంది .1901లో కొంతమంది ఉత్తర ప్రాంత స్కూల్ టీచర్లు ఇక్కడికి వచ్చి ఆమెకు చాలాపుస్తకాలు అందజేయగా ,వాటి వలన ఆమె సాహిత్య జ్ఞాన నేత్రం విచ్చుకొన్నది .అవే తనకు జాగృతి కలిగించాయని చెప్పింది .ఈ వాతావరణాన్ని అంతా వర్ణిస్తూ ఆమె 1928లో ‘’హౌ ఇట్ ఫీల్స్ టు బికలర్డ్ మి’’అనే మొదటి వ్యాసం రాసింది .1904లో తల్లి చనిపోగా తండ్రి మరో పెళ్లి చేసుకొన్నాడు .మారుటి తల్లి ఈమెను ఫ్లారిడాలోని జాక్సన్ విల్ బాప్టిస్ట్ బోర్డింగ్ స్కూల్ లో చేర్పించింది .తర్వాత కావాలనే ఆమె ట్యూషన్ ఫీజు చెల్లించకపోతే ఈమెను డిస్మిస్ చేయగా ,మేరీలాండ్ లోని బోయీ స్టేట్ యూని వర్సిటి నుంచి ఇంగ్లీష్ లిటరేచర్ తో మొట్టమొదటి HBCU గా గ్రాడ్యుయేట్ అయింది .

1916లొ గిల్బర్ట్ అండ్ సల్లివాన్ థియేటర్ లో ప్రముఖ సింగర్ ఇంట్లో మెయిడ్ ఉద్యోగం చేసింది .1917లో మేరీలాండ్ లోని బాల్టిమోర్ లో ఉన్న నల్లవారి మోర్గాన్ సైట్ యూని వర్సిటి లో ఫ్రీ హైస్కూల్ చదువుకు క్వాలిఫై అవటానికి 26వ ఏటచేరి 1918లో గ్రాడ్యుయేట్ అయింది.ఈ కాలేజిలో ఉండగానే జాతులమధ్య ఉన్న సారూప్యతలపై అధ్యయనం చేయాలనే కోరిక కలిగింది .చారిత్రాత్మకంగా బ్లాక్ కాలేజి అయిన వాషింగ్టన్ డిసి లోని హార్వర్డ్ యూని వర్సిటిలో1918లో చేరి చదివి చొరవ తీసుకొన్న మొదటి బాచ్ ‘’జేటా ఫి బేటా’’ అనే నల్లజాతి ఆడపిల్లలకోసం స్థాపించబడిన విద్యార్ధి పత్రికలో పని చేసింది .స్పానిష్ ,ఇంగ్లీష్ గ్రీక్ ,పబ్లిక్ స్పీకింగ్ సబ్జెక్ట్ లు తీసుకొని 1920లో అసోసియేట్ డిగ్రీ పొందింది .1921’’జాన్ రెడ్డింగ్ గోస్ టుసి’’అనే కథ రాసి ‘’అలైన్ లాక్స్ లిటరరీ క్లబ్ ‘’దిష్టైలస్ ‘’మెంబర్ గా క్వాలిఫై అయింది.

జోరా 1924లో హార్వర్డ్ వదిలి ,1925లో బెర్నార్డ్ ట్రష్టీ అన్నేనాథాన్ మేయర్ స్కాలర్షిప్ పొంది కొలంబియా యూని వర్సిటిలో వుమెన్స్ కాలేజిలో చేరింది ఇక్కడ ఈమె ఒక్కతే ఏకైక బ్లాక్ స్టూడెంట్ . ఇక్కడ ఎథ్నోగ్రాఫిక్ రిసెర్చ్ ని ప్రముఖ ఆన్త్రోపాలజిస్ట్ ఫ్రాంజ్ బోస్ దగ్గర చేసి,గ్రాడ్యుయేట్ అయింది .బెనెడిక్ట్ ,ఫెలో ఆన్త్రోపాలజిస్ట్ మార్గరెట్ మీడ్ లవద్ద పనిచేసింది .1928లో ఆంత్రోపాలజీ డిగ్రీ 37ఏళ్ల వయసులో సాధించింది .సాహిత్య పోషకుడు ఆన్త్రోపాలజిస్ట్ గాడ్ మదర్ అని పిలువబడే చార్లేట్టీ ఆస్గుడ్ మాసన్ ను తన చదువు తెలివి తేటలతో మెప్పించింది .ఆఫ్రో అమెరికన్ ఆధర్స్,కవులు అయిన లాంగ్ స్టన్ హగ్స్ ,కౌంటీకల్లెన్ వంటివారికి సాయం చేసింది .ఆమె అపార్ట్ మెంట్ సోషల్ గాదరింగ్ కు వేదికగా ఉండేది .ఆమె రాసిన ‘’ఆపర్ట్యూనిటి-ఎ జర్నల్ ఆఫ్ నీగ్రో లైఫ్ ‘’అనే నాటకం రాసి పోటీలో గెలుపొందితే’’నేషనల్ అర్బన్ లీగ్ ‘’వాళ్ళు ప్రచురించారు .1920లో నల్లజాతి బాలికలకోసం స్థాపించబడిన Zeta Phi Beta Sorority లో మొదటి బాచ్ లో ఉన్న అమ్మాయి .ఆల్ఫా చాప్టర్ స్టూడెంట్ గా హార్వర్డ్ యూని వర్సిటిలో ప్లేడ్జ్ చేసింది ‘

1927లో జాజ్ గాయకుడు హెర్బర్ట్ షీన్ ని పెళ్ళాడి౦ది . తర్వాత అతడు ఫిజిషియన్ అయ్యాడు .నాలుగేళ్ళకే ఈ వివాహ బంధం విచ్చిన్నమవగా 1935లో కొలంబియా యూనివర్సిటి గ్రాడ్యుయేట్ స్టూడెంట్ తో ప్రేమలో పడి‘’దెయిర్ ఐస్ ఆర్ వాచింగ్ గాడ్ ‘’లో టీ కేక్ పాత్రగా మలిచింది .1939లో ఫ్లారిడా లో WPAకు పని చేస్తుండగా ఆల్బర్ట్ ప్రిన్స్ ను పెళ్ళాడి ,కొన్ని నెలలోనే వదిలేసినా, 1943దాకా విడాకులు పొందలేదు .తరవాత ఏడాది క్లీవ్ లాండ్ కి చెందిన జేమ్స్ హొవెల్ పిట్స్ ను పెళ్ళాడి, ఏడాదికే వదిలేసింది .

గ్రేట్ డిప్రెషన్ కాలం లో ఫండ్స్ అందకపోవటం తో ఆస్గుడ్ పోషణలో జీవితం గడిపింది .తర్వాత న్యు జెర్సిలోని వెస్ట్ ఫీల్డ్ కి చేరింది .1934లో బెతూన్ కుక్మన్ యూని వర్సిటి లో ప్యూర్ నీగ్రో ఎక్ష్ప్రెషన్ ఆధారంగా ఫ్లారిడాలోని డేటన్ బీచ్ వద్ద ఉన్న బ్లాక్ కాలేజి లో ‘’స్కూల్ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్ ‘’స్థాపించింది . విద్యకు,మానవ వనరులకు చేసిన సేవకు జోరాకు బెతూన్ కుకింగ్ కాలేజి అవార్డ్ అంద జేశారు .ఈ కాలేజి ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ లో ఆమె సంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తున్నారు .తర్వాత ఆమె నార్త్ కరోలినాలోని ఈనాడు నార్త్ కరోలినా సెంట్రల్ యూని వర్సిటిగా పిలువబడుతున్న ఆనాటి నార్త్ కరోలినా కాలేజి ఫాకల్టిలో పనిచేసింది .

ఆంత్రోపాలజీ రిసెర్చ్ కోసం జోరా కరేబియన్ ,అమెరికా సౌత్ ప్రాంతాలన్నీ తిరిగింది .1928నుంచి 32వరకు మహాదాత ,మహా ధనికురాలు ఆస్గుడ్ మేసన్ పోషణలోనే ఉన్నది .1935లో ‘’మ్యూల్స్ అండ్ మెన్ ‘’.రాసింది నార్త్ కరోలినాలోని ‘’లంబర్ కాంప్స్’’పై రిసెర్చ్ చేసింది .ఇక్కడ అధికారం లో ఉన్న తెల్లజాతిమగాళ్ళు సెక్సువల్ కంకుబైన్స్ అంటే ఉంపుడు కత్తెలుగా నల్లజాతి స్త్రీలను వాడుకోవటం పిల్లల్ని కనటం పై తీవ్రంగా స్పందించింది.ఇదేతర్వాత ‘’పరామర్ రైట్స్ ‘’గా చెలామణి అయింది .ఈ విషయాలుఆధారంగా 1934లో ‘’జోనాస్ గౌర్డ్ వైన్ ‘’వంటి నవలలు రాసింది .

1935లో జార్జియా ,ఫ్లారిడా రాష్ట్రాలను అలాన్ లోమాక్స్ ,ఎలిజబెత్ బార్నికల్ లతో కల్సి ఆఫ్రో అమెరికన్ సాంగ్ ట్రే డిషన్ ,బానిసలతో వాళ్ళ బాంధవ్యాలు ,ఆఫ్రికన్ ప్రాచీన గీత విధానం లపై రిసెర్చ్ చేయటానికి పర్యటించింది .1936-37లో జమైకా ,హైతిలను గుగ్గెన్ హీం ఫౌండేషన్ సాయంతో పర్యటించి ,తన ఆన్త్రో పాలిజికల్ రచన ‘’టెల్ మై హార్స్ ‘’ 1938లో కూర్చింది .ఫెడరల్ రైటర్స్ ప్రాజెక్ట్ కు కూడా పని చేసి ఫ్లారిడా చారిత్రక , సంస్కృతి లపై వివరాలు సేకరించింది.1947-48లో ఉత్తర తీర ప్రాంతం ప్యూర్టో కోర్టేస్ లో హోండూరస్ లో ఉన్నది .ఇక్కడ మయాన్ శిధిలాలు కని పెట్టబడనినాగరకత చిహ్నాలు కానీ దొరుకుతాయేమో నని వెతికింది .అక్కడి భిన్నజాతిప్రజల జీవన విధానాలపై రాసింది .తర్వాత ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా పని చేసింది ,

లైవ్ ఓక్ చేరి తెల్లవారు నల్లజాతి స్త్రీలను వాడుకొనే విషయం పై తీవ్ర పరి శోధనలు చేస్తూ అనేకమందిని విచారిస్తే ఎవరూ వివరాలు చెప్పటానికి ముందుకు రాలేదు .దీనిపై ఆమె రాసిన వ్యాసాలను పేపర్లు బాగా కవర్ చేశాయి .ధారావాహికంగా 1953లో మూడు నెలలు దీనిపై’’ది లైఫ్ స్టోరి ఆఫ్ రుబి మిక్కోలం ‘’పేరుతొ రాసింది.దీనిపై తెల్ల వాళ్ళు కోర్టుకు వెళ్ళారు .రెండు సార్లు విచారణ జరిగింది .తర్వాత పాన్ అమెరికన్ ఎయిర్ వేస్ టెక్నికల్ లైబ్రరీలో ఆత్రిక్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో 1967లో పని చెసి౦ది .ఉద్యోగానికి తగిన అర్హతలకంటే ఎక్కువ విద్య ఉంది అని తర్వాత తీసేశారు .మళ్ళీ ఫ్లారిడాలోని ఫోర్ట్ పియర్స్ కు చేరి దొరికిన ఉద్యోగాలన్నీ చేసింది .ఆరోగ్య, ఆర్ధిక ,మందుల సమస్యలు ఆమెపై ముప్పేట దాడి చేయగా సెయింట్ లూసీ కౌంటీ వెల్ఫేర్ హోమ్ లో చేరింది .విపరీతమైన గుండె పోటుతో 28-1-1960న మరణించింది .

హర్లెం రినైసేన్స్ కు జోరా కేంద్ర బిందువుగా నిలిచింది .ఆమె ఆఫ్రో –అమెరికన్ అనుభవం అంతా ‘’న్యు నీగ్రో ‘’మరియు ‘’ఫైర్’’వంటి నార్త్ ఫ్లారిడా ఆఫ్రికన్ –అమెరికన్ జానపద సంపుటి రాయటానికి వినియోగించింది .ఆమె రాసిన ముఖ్యమైన నాలుగు నవలలు –మ్యూల్స్ అండ్ మెన్ ,జొనాన్స్ గోర్డ్ వైన్ ,దెయిర్ ఐస్ ఆర్ వాచింగ్ గాడ్ ,మోజెస్ మాన్ ఆఫ్ ది మౌంటేన్’’లు కూడా ఈ నేపధ్యంతో రాసినవే .జమైకా ,హైతి లలో కర్మ కాండ లపై డాక్యుమెంటరీ లే –టెల్ మై హార్స్ –వూడూఅండ్ లైఫ్ ఇన్ జమైకా అండ్ హాతి రచనలు ఆమె రచనలన్నీ ఆఫ్రో అమెరికన్ లగురించి ,ఆఫ్రో అమెరికన్ మహిళల జీవన పోరాటాల గురించే .1975ప్రముఖ రచయిత్రి ఆలీస్ వాకర్ ‘’ఇన్ సెర్చ్ ఆఫ్ జోరా నియేల్ హార్ట్సన్’’అనే వ్యాసం రాసేదాకా దశాబ్దాలపాటు ఆమె నవలలు కాలగర్భం లో కలిసిపోయాయి.1920లో ఆమె రాసిన కథలు ‘’ఎవిరి ట౦గ్ గాట్ టుకన్ఫెస్ ‘’సంపుటిగా వెలువడింది .కుడ్జోలా అనే ‘’కుడ్జో లెవిస్’’జీవితం పై రాసిన –బార్రకూన్ –ది స్టోరి ఆఫ్ దిలాస్ట్ బ్లాక్ కార్గో 2018లో ప్రచురితమైంది .జోరా నిశ్చితాభిప్రాయం –

‘’ Prayer seems to me a cry of weakness, and an attempt to avoid, by trickery, the rules of the game as laid down. I do not choose to admit weakness. I accept the challenge of responsibility. Life, as it is, does not frighten me, since I have made my peace with the universe as I find it, and bow to its laws.[51]

ఫ్లారిడాలోని ఈటన్ విల్ లో జోరా జయ౦తి వేడుకలు జనవరిలో జరుపుతున్నారు .ఆమె ఇంటిని జాతీయ స్మృతి చిహ్నంగా భద్రపరచారు .ఆలీస్ వాకర్ జోరా సమాధినిగుర్తించి దానిపై ‘’ఎ జీనియస్ ఆఫ్ ది సౌత్ ‘’అని గౌరవపూర్వకంగా రాయించింది .1994లో ‘’నేషనల్ వుమెన్ ఆఫ్ ఫ్రేం’’లో జోరా పేరు చేర్చారు .2002లో వందమంది ప్రభావ శీల ఆఫ్రో అమెరికన్స్ లో జోరా ను చేర్చారు .ఆఫ్రికన్ అమెరికన్ సాహిత్యం లో విశేష కృషి చేసినవారికి ఆమె పేర 2008 నుంచి అవార్డ్ ఇస్తున్నారు .2010లో ‘’న్యూయార్క్ రైటర్స్ ఆఫ్ ఫేం’’లో ఆమె పేరు చేర్చారు .7-1-2014న ఆమె 123వ జయంతిని ‘’గూగుల్ డూడీ’’ఘనంగా నిర్వహించింది .ఆమె ఆటోబయాగ్రఫీ’’డస్ట్ ట్రాక్స్ ఆన్ ఎ రోడ్ ‘’లోని ఒక భాగాన్ని డాక్యుమెంటరి ఫిలిం లో చదివారు .

జోరా రచనలు –కవిత్వం –జర్నీస్ ఎండ్ ,నైట్ ,పాషన్ , .నవలలు –జోనాస్ గోర్డ్ వైన్ మొదలైన నాలుగు నవలలు .కథలు –మట్సి, స్వెట్ ది గిల్దేడ్ సిక్స్ బిట్స్ –నాటకాలు –కలర్ స్ట్రక్. వ్యాసాలు -,హౌ ఇట్ ఫీల్స్ టు బి కలర్డ్ మీ .నాన్ ఫిక్షన్ –టెల్ మై హార్స్ ,మ్యూల్స్ అండ్ మెన్ .జానపదం –ఫోక్ లోర్ మెమరీస్ ,ఎవిరి టంగ్ గాట్ టు కన్ఫెస్ తోపాటు ఆంత్రో పాలజి రచనలు .

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో