
ఎండ్లూరి సుధాకర్
ప్రతి బాధనీ తడిచేయడం
కాదు సుమా భావ్యం
ఎదను అతికి ఉండాలి
ఏదో ఒక గాయం
-జానిసార్ అఖ్తర్
తొలిసారి నిన్ను చూసినప్పుడు
తొణికిసలాడింది హృదయం
ఏదో మర్చిపోయిన ముఖం
మళ్ళీ గుర్తుకొచ్చిన అనుభవం
-మఖ్మూర్ దేహళ్వీ
కొందరి సుందరాంగుల చిత్రాలు
మరికొన్ని వలపుటుత్తరాలు
నేను మరణించాక
ఇవే నా గదిలో దొరికే వస్తువులు
-గాలిబ్
-– అనువాదం ఎండ్లూరి సుధాకర్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~