‘శృంగార శాకుంతలము’లో నాయిక భేదాలు (సాహిత్య వ్యాసం )-బి. జ్యోతి,

ISSN 2278-478

నల్లగొండ జిల్లా పిల్లలమర్రి గ్రామానికి చెందిన పినవీరభద్రుడు (1450) 30 ఏళ్ళ వయసులో ‘నారదీయ పురాణము” తెలుగులో రచించారు. సరస్వతీకటాక్షం పొందిన మహాకవి సాళువ నరసింహరాయల ఆస్థానంలో ఉన్నాడు. ‘వాణి నా రాణి’ అని చెప్పినట్లు జనబాహుళ్యంలో ఉంది. పదిహేనవ శతాబ్దంలో ఈ కవి ‘శృంగార శాకుంతలం’, ‘జైమినీ భారతం’ అనే గ్రంథాలను రచించాడు. శృంగార శాకుంతలం నాలుగు ఆశ్వాసాల ప్రబంధం. వెన్న మాత్యునికి అంకితం ఇచ్చాడు. ఈ కావ్యానికి పేరు పెట్టడంలో శ్రీనాథుని అనుకరించాడు.

వ్యాసభారతంలోని మూలకథను కాని, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలమును గాని యథాతధంగా అనుకరించక రెండిటిని కలిపి మృదుమదురంగా శృంగారరస ప్రబంధంగా శృంగార శాకుంతలాన్ని రచించాడు. శృంగార శాకుంతలంలో ప్రథమాశ్వాసంలో హస్తినాపుర వర్ణనతో ప్రారంభమైంది.

హస్తినాపుర వర్ణనలో కోటలు, వీధులు, పురజనాలు, సంపదలు మొదలైన వాటితో పాటువారకాంతల వర్ణన ఉంది. వారి గురించి వివరించేటప్పుడు వర్ణన ఈ విధంగా ఉంది.

“సీహరినీల రుచుల నీలాలకంబులు గావు
చిత్తజు మధుప శింజినులు గాని
క్రొన్నెల వంక లాగుల భ్రూలతలు గావు
విషమాస్తు తియ్యని విండ్లు గాని
యలసంబులైన వాలారుఁ జూపులు గాపు
రతిరాజా మోహ నాస్త్రములు గాని
బంధుర స్థితిఁ దొల్చు కంధరంబులు గాపు
కందర్పు విజయ శంఖములు గాని
తే. నలిన దళ లోచనలు గారు నడువ నేర్చు
కుంకు నవ శస్త్ర శాలలు గాని యనఁగ
నంగకంబుల సౌభాగ్య మతిశ యిల్ల
వారసతు లొప్పుదురు పుర పరమునందు”
(శృంగార శాకుంతలము ప్రథమా శ్వాసం-82)

హస్తినాపురంలోని వేశ్యలను మాటల్లో వర్ణించలేము. వారి వెంట్రుకలు ముదురాకుపచ్చ, నీటిరంగు కలిసినవి కావు. అవి మన్మథుని తుమ్మెదల రెక్కలు, వారి కనుబొమ్మలు చంద్రవంకలవలె కాక మన్మథుని ధనుస్సు వంపుల్లగా ఉంటాయి. వారి చూపులు సిగ్గుతో కూడిన వాలుచూపులు కాకుండా మన్మథుడు వేసిన బాణాల్లాగ ఉన్నాయి. వారి కంఠాలు అందంగా నిలిచిన అరటి మొక్కల్లాగ కాకుండా అవి మన్మథుని విజయాన్ని పొగిడే శంభాలు. ఆ వేశ్యలు అబలలు కాదు. రతిరాజు బాణాగారలు వారి ప్రతీ అంగము సౌందర్యానికి ప్రతీకంగా, ఆదర్శంగా రూపకంగా ఉంటారు.

నాయిక సామాన్య వారాంగనలు సాక్షాత్కరించిన స్పటికపు బొమ్మల్లాగా ఉంటారు. స్పటికము తన సమీపమున ఉన్న వస్తువులను తనలో ప్రతిబింబింపచేసుకుంటాయి. అదే విధంగా సామాన్య నాయికలు తమ అందచందాలతో ఎదుటి వారిని ఆకర్షిస్తారు.

చ. వెలకుఁ దగం బ్రసూనములు వేడురు మార్వరికింప నెత్తులం
గలసి చిగుర్లు వెట్టి యదకట్టిన క్రొవ్విరి మల్లె పూవు టె
త్తులు దశ నాదరద్యుకులఁ దోంచిసం బైకొస రీవిగా విటుల్
విలువంగ వారి చిత్తములు విలురు తత్పరిఁ బుష్కలావికల్
(శృంగార శాకుంతలము ప్రథమా శ్వాసం-83)

మ. సరసుల్ చొచ్చి సరోజ కోటర కుటీ సంపర్తికా చారుకే
సర గుచ్ఛంబులు దొచ్చి బాహ్య వనపుష్ప శ్రేణి నిర్యన్మధూ
త్కరముం దెచ్చి తదీయ సౌరభము లుద్దారింపుచున్ సంతత
స్మర సంజీవనమై చరించుఁ గలయన్ మందానిలుండ ప్పురిన్
(శృంగార శాకుంతలము ప్రథమా శ్వాసం-84)

హస్తినాపురంలో పూవ్వులు అమ్మే యువతులు చాలా చమత్కారం కలిగిన వారు. నెలకు తగినన్ని పువ్వులు ఇవ్వటమే కాకుండా కొనే వాళ్ళకి కొసరు వేస్తారు. ఆ కొసర్లు వట్టి పువ్వులు కావు. చిగుళ్ళనే సింహాసనాల మీద మల్లెపూల దండ వంటి పళ్ళతో కెంపురంగు పెదవుల మీద వెదజల్లె తీయని చిరునవ్వులే ఆ కొసర్లు. ఆ నవ్వుల కొసర్లతోనే విటుల మనసులని ఆకట్టుకోగల చతురలు.

సాహిత్యం వచ్చిన తరువాతనే అలంకార శాస్త్రం వచ్చింది. ప్రాచీన సాహిత్యంలో స్త్రీలను సుకుమారంగా, మెత్తని పూలతో, అందమైన పూలతో వర్ణించారు. ప్రతి అంగాన్ని కూడ ప్రకృతిలో ఉన్న వస్తువులతో ముడిపెట్టడం జరిగింది. కనుక హస్తినాపురంలో పుష్ప లావికలని సౌందర్య పనితలుగా వర్ణించడం జరిగింది. ఇక్కడి స్త్రీలకు కూడ సామాన్య లక్షణాలు కనిపిస్తాయి. హస్తినాపురాన్ని ఏలుతున్న దుష్యంత మహారాజు వద్దకు అడవి రాజులు వచ్చి అడవిలో దొరికే ముదురు వెదుళ్ళ పందిన బియ్యం, అడవి చెరకు ముక్కలు, కర్రజవ్వాది, జీడిపప్పు, సారపప్పు, తెల్లని చమరీ మృగాల తోకలు, బాగా కాచిన పళ్ళగుత్తులు, సన్నని దంతపు పిడులుగల నెమలి ఈకల విసన కర్రలు, జుంటితేనే, పులి, ఎలుగుబంటి, కస్తూరి మృగాల పిల్లలు మొదలైన కానుకలు తెచ్చి ఇస్తారు. వాళ్ళ మొహాల్లో భయం, ఆందోళనతో ఉన్నారు.

వారి సమస్యను తెలుసుకుని చక్రవర్తి అడవిలో ఉన్న క్రూరమృగాలను వేటాడటానికి బయలుదేరతాడు. ఒక జింక పిల్లను వేటాడుతూ ముని ఆక్రమాలకి వస్తాడు. అక్కడ శకుంతలను చూసి ఆమె అందానికి ముగ్ధుడవుతాడు. పినవీరభద్రుడు ఆమె అందాన్ని ఇలా వర్ణించాడు.

చంచ త్పల్లవ కోమ లాంగుళ కరన్, సంపూర్ణ చంద్రాసనన్,
న్యంచ చ్చందన గంధి, గంధగజయానన్, జక్రవాక స్తనిన్,
గించి న్మధ్యం దటి ల్లతా విలసి తాంగిన్, బద్మ పత్రాక్షి, వీ
క్షించెన్ రాజు శకుంతలన్ మధుకర శ్రేణీ లస త్కుంతలన్.
(శృంగార శాకుంతలము ద్వితీయ శ్వాసం-53)

సీ. దర్పకు రాజ్యంబు దలచూపు నెత్తిన
బంగారు టనటి కంబము లనంగ
రతి మన్మథులు విహారమునకై చేతులు
బట్టి యాడెడి నిమ్మపండ్లనంగ
రేయి వెన్నెల నాంటి రేయెండ యుదయింప
బెదరు చకోరంపుఁ బిల్ల లనఁగ
శృంగార సరసి రాజీవ కానసమున
విచ్చిన కన కారవింద మునఁగ
(శృంగార శాకుంతలము ద్వితీయ శ్వాసం-54)

శకుంతల మెరుపు తీగలా ప్రకాశిస్తున్నది. శరీరఛాయ రాజహంసను మరిపిస్తుంది. ముఖం పూర్ణ చంద్రుడిలా ఉంది. ఆమె నడక మందగజాలను మరిపిస్తున్నది. నడుము ఉండి లేనంత సన్నగా ఉంది. స్తనాలు చక్రాకారంలో గుబ్బలేలి ఉబ్బిన మొనలతో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఆమె చేతుల వేళ్ళు లేత ఆకుల చిగుళ్ళవలె కదలాడుతూ ఉన్నాయి. ఆమె జుట్టు తుమ్మెద రెక్కల కంటే నల్లగా ఉన్నాయి. మన్మథ సామ్రాజ్యాన్ని నిలబెట్టటానికి బంగారు అరటి స్తంభాల్లా తొడలు ఉన్నాయి. రొమ్ముల రతీ మన్మథులు ఆడుకునే దబ్బపళ్ళలా, పిరుదులు చక్రవాకా పిల్లలాగ ఉన్నాయి. కళ్ళు నిర్మలమైన సరస్సులో వికసించిన నల్లకలువల్లాగా ఉన్నాయి. పద్మాలంత విశాలంగా ఉన్నాయి. సౌందర్య లావణ్యాలన్ని ఒక చోట మూర్తీభవించిన స్త్రీలాగా ఉంది.

ఇక్కడ శకుంతల బాల్య దశ నుంచి యవ్వనంలోకి అడుగు పెడుతుంది. వివాహం కానిస్త్రీ(కన్య) కాబట్టి ఇక్కడ శకుంతల ముగ్ధ నాయిక అవుతుంది.

దుష్యంతుడు శకుంతల శరీర లావస్యమును చూసినప్పుడు అతడు పొందిన అనుభూతి సందర్భంలో ఈ క్రింది విధంగా అనుకుంటాడు.

గీ. చందనంబుఁ బుష్పంబు, గుందనమునం
బరిమలం, బిక్షు లతికను ఫలము వోలె
రతి మనోహర మైన యీ యతివ మేన
నరయం గనుగొంటిఁ గాదె యీ యౌవనంబు!
(శృంగార శాకుంతలము ద్వితీయ శ్వాసం – 62)

మంచి గందంలో పువ్వుపూసినట్లు, బంగారానికి సువాసన అచ్చినట్లు, బిచ్చగాని బొచ్చెలో పండువేసినట్లు రతీదేవికే ఈర్యను పుట్టించే ఈ సౌందర్యరాశి శరీరంలో యవ్వనం విజృంబించడం చూసే భాగ్యం నాకు కలిగింది అని దుష్యంతుడు శకుంతలను గురించి తలచుకుంటాడు. ఇక్కడ శకుంతల యవ్వనంలోకి అడుగుపెడుతుంది అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. కనుక శకుంతల కన్య, ముగ్ధనాయిక అవుతుంది. దుష్యంతుడు శకుంతల రూపురేఖా విలాసాలకు ముగ్ధుడవుతున్న సందర్భంలో శకుంతల ముఖమును కమలం అనుకొని ఒక తుమ్మెద ఆమె ముఖంపై వాలుతున్నది. శకుంతల తన నెచ్చెలులతో మాట్లాడుతూను ఉంది. ఆ తుమ్మెద నుంచి తన ముఖాన్ని కాపాడుకోలేక తత్తరపాటుతో అటు ఇటు పరుగెత్తడం వల్ల ఆమె ముంగురులు చెదిరిపోయాయి. జుట్టు ముడిసడలిపోయింది. ధైర్యంపోతుంది. గుండెలు తల్లడిల్లుతున్నాయి. తన సుఖాలతో మొరపెట్టుకుంటుంది. ఇదంతా ఒక పొదరింటి చాటు నుండి చూస్తున్న దుష్యంతుడు బయటికి వచ్చి శకుంతలను కాపాడాడు. ఆ సందర్భంలో శకుంతల దుష్యంతుని రూపురేఖా విలాసాలకు ఆకర్షితురాలయింది.

శా. ఆ కాంకా తిలకంబు చన్నుగవపై నందంద రోమాంచ మ
స్తోకంబై పొడకట్ట, నుత్కలికఁ జేతో భీతి సంధిల్ల, నా
క్ష్మా కాంతామణి మంజు భాషణము లాకర్ణించుచుం దోన తా
నాకర్ణించె మనోజ చాప గుణ సాహంకార టంకారముల్.
(శృంగార శాకుంతలము ద్వితీయ శ్వాసం-84)

క. భావ భవ పుష్ప చాప
జ్యా వల్లీ రవము తన్మయత్వముఁ దెలుపం
దేవేంద్ర తనయ నన్నిభు
నా విభుఁ గనుఁగొనుచు నుండె ననిమిష దృష్టిన్,

దుష్యంతుని మాటలు, అతని రూపురేఖావిలాసాలను చూసి శకుంతల మనసు, శరీరం నూతనమైన భావావేశలకు లోనయింది. కుచాల మీది రోమాలు నిక్కచోడుచుకున్నాయి. శరీరమంతా పులకెత్తినట్లయింది. హృదయంలో ఏదో ఉత్సాహంతోపాటు కోరిక. భీతి సందడి చేస్తుంది. దుష్యంతుని మాటలు వింటుంటే శకుంతలకు గుండెల్లో మన్మథుడు ప్రవేశించి చెరకు వింటి నారిని సారించుతున్న ధ్వనులు గ్రహిస్తుంది. మన్మథుడు విసురుతున్న పూలబాణాలు తాకిడికి శకుంతల హృదయం పరవేశం చెందుతుంది. మన్మథుని మించిన దుష్యంతుడు కళ్ళెదుట కనిపిస్తున్నాడు. ఆమె అతన్ని కనురెప్పలారని అప్సరసలా చూస్తుంది. దుష్యంతుని చూసి విరహవేదన పొందుతున్నది కనుక విరహత్కంగిత అయింది.

పవిత్రం ప్రశాంతత నిండిన హిమాలయ పర్వత ప్రాంతాలలో విశ్వామిత్ర మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ మహర్షి అత్యంత శక్తిమంతుడు. పంచాక్షరీ మంత్ర పరమార్థం. ఉపనిషత్తుల సారం గ్రహించిన వాడు. బ్రహ్మర్షి మరొక స్వర్గాన్ని సృష్టించే శక్తి కలిగిన వాడు. అటువంటి విశ్వామిత్రుడు శివున్ని మెప్పించాలని కరోరమైన తపస్సును ప్రారంభించాడు. విశ్వామిత్రుని తపశ్శక్తికి భూలోకం కంపించిపోయింది. కఠోర తపస్సుతో లోకాలన్నింటిని జయించగల విశ్వామిత్రుడు తన సింహాసనాన్ని ఆక్రమిస్తాడనే భయంతో దేవేంద్రుడు అప్సరకాంతలను హిమాలయాలకు పంపి, విశ్వామిత్రుని తపస్సు భంగం చెయ్యటానికి ప్రయత్నిస్తాడు. కాని విశ్వామిత్రడు ఏ మాత్రం చలించకుండ ఏకాగ్ర చిత్తంతో తపస్సు పూర్తి చేసుకుంటున్నాడు.

దేవేంద్రుడు అప్సరసలందరికంటే సౌందర్యవతి చతురికీ, మన్మథుని జుగాలన్నింటిని గెలవటానికి సానబట్టించిన కత్తి అంచువంటి స్త్రీ, యోగుల మనసులను ఆకర్షింపగలంత సౌందర్యం గల అప్సరస, పందెం వేస్తే ఆ బ్రహ్మను, శివుని, విష్ణువును కూడ తన కౌగిట బానిసలను చేసుకోగలంత నెరజాణ అయిన మేనకను పంపిస్తాడు. మేనక హిమాలయాలకు వచ్చి అప్పలందరూ సేకరించిన రకరకాల పూలను విశ్వామిత్రుని పాదాల పైన పోస్తుంది. ఆ మునిపాదాలకు నమస్కరించి, ఆ దగ్గరలో ఉన్న ఒక చెట్టు నీడన నిలిచి, ఒక కాలిని కొంచెం వంచి, లతలాగ రెండోకాలిని, చుట్టి, చెట్టుమ్రానుపై జరగిల్లినట్లు విలాసంగా చేరగిలి, నుదుటి చిరు చెమటలను కొనగోటితో మీటుకుంటు సమ్మోహనంగా విశ్వామిత్రుని వంక చూస్తుంది. ఆమె శరీర భంగిమ మొత్తం మన్మథుడెక్కుపెట్టిన మోహనీస్త్రం లాగ ఉంది. ఆమె శరీరం నుంచి, ప్రత్యేకంగా ఆమే వాలుచూపుల నుంచి ఎన్నెన్నో పుష్పబాణాలు ఒకేసారి విజృంభించి ఆ మహర్షి శరీరాన్ని తూట్లు పొడుస్తున్నట్లు మహర్షికేదో కొత్త అనుభూతి కలిగింది. విశ్వామిత్రుడు కళ్ళు తెరచి మేనకను చూసాడు. అపుడు మేనక ఈ విధంగాఉంది.

సీ. తేఁటి మొత్తము నేలపు దూఁటు పుచ్చఁగ నోపు
కమనీయ నీలాలకములు చూచి,
చిగురు టాకుల డాలుఁ జిన్నంబుచ్చఁగఁ జాలు
సాంద్రంపు కెంపు హస్తములు చూచి,
కరి కుంభముల క్రొవ్వుఁ గాకు సేయఁగ నవ్వు
తోరంపు నెటి చన్ను దోయిఁ జూచి,
చంద్ర బింబము పెంపు సవతుగా దనిపించు
మొలక నవ్వుల ముద్దు మోముఁజూచి,
తే. రసము లుట్టెడు బింబాధరంబుఁ జూచి,
పసిఁడి పొడరాలు కక్ష వైభవముం జూచి,
కమలముల నేలు పాద పద్మములు చూచి,
మునికిఁ జక్కిలిగింతలు గొనె మనంబు.
(శృంగార శాకుంతలము ద్వితీయ శ్వాసం-140)

తుమ్మెదల బారుల నల్లదనాన్ని హేళన చేయగల ఆమె జుట్టు చిగురుటాకుల ఎర్రవాలు రంగును వెక్కిరించగల ఆమె చేతుల అందం, మదించిన వెనుగుల కొవ్విన తల శిఖరాలను ఓడించే ఆమె చనుదోయి చిని, చంద్రబింబం అందం, తనకు సవతి కాలేదని లెవిటీ చిరునవ్వు మొలకెత్తె మోము తేనెలూరించే ఆమే పెదవుల సారు, బంగారు పొడి రాలినట్టు ప్రకాశిస్తున్న ఆమె శరీరం, ఎర్ర కలువలచే దాస్యం చేయించుకోగల ఆమే పాదాల శోభ, ఇవన్నీ చూసేసరికి విశ్వ మిత్రునికి చక్కిలిగింతలు పెట్టినట్లు ఒళ్ళు పులకరించింది గిలిగింతలు పెట్టింది. మేనక అందచందాలతో విశ్వమిత్రున్ని ఆకర్షించింది. నిండు యవ్యనం గల మేనక ఇక్కడ ప్రార్ధనాయిక. దుష్యంతుడు శకుంతల అందచందాలను వర్ణిస్తు తలచుకుని పరితపిస్తున్నాడు. శకుంతల ఒంటరిగా కూర్చొని దుష్యంతుని గురించి పరిపరి విదాల ఊహించసాగింది. ఆ రోజు ఈతపోవనానికి వచ్చి తన జన్మ వృత్తాంత వివరాలు తెలుసుకున్నాడు. ఇది మంచిదే అయింది. కాని ఎన్నడు నాకు దుష్యంతుని దర్శన భాగ్యం దక్కకుండా చేసింది కదా ఈ రాత్రి ఎప్పటికి తెల్లవారుతుందో మరెంత సేపటికి ఉదయకాలం వస్తుందో! నా హృదయాన్ని జయించిన ఆయన్ని మళ్ళీ చూచే భాగ్యం ఎప్పటికి లభిస్తుందో అని పరితపిస్తుంది. ఆ సందర్భంలో శకుంతల
అవస్థ ఈ విధంగా ఉంది.

మ. చెమటం జెక్కులు తొంగలింప, సుఖ రాజీవంబు వాడంగ, సో
లమునన్ రెప్పలు ఆల, గన్ను గవ దేలన్, మోవి నిట్టూర్లుం
గమలం, దల్పముఁ జేరుదున్, విభుని రాకల్ గోరుచుం, బొద్దు భా
రమునం బుచ్చుచు వర్ధమాన విరహ గ్లానిన్ మదిం గందుచున్

మ. మలయ క్ష్మాధర నిర్గళ త్వవసముల్ మడింప, గామాగ్ని యం
గలతం గాల్పక యుండ, గంతు సుమనః కాండ సకాల దాహతిం
తెలు వెల్లం జెడకుండ, నవ్విబు, సుర స్సీమంబుతో ఆర్కొనం
గలలో వైనను గల్లు నొక్కా యని యక్కంజాన్య దీవాస్యయె,

శా. ఆ చంద్రాన్వయ రాజు చంద్రముని పొం దాసించి, చన్నుం గవం
మచం, గస్ట్నూల నీరు నించుందల యూచున్, మేను శయ్యా స్థలిన్,
వైచున్, లేచును, నవ్వు సున్సురను, దోవం గంటగించున్, దృతిన్
రామన్, ద్రోద్దు గనుంగొమన్, వెతఁబదున్ గామాంధ కారా ర్తయై

ఆమె చెక్కిలు చెమట పట్టాయి. పద్యం వంటి ముఖం వాడిపోయింది. రెప్పలెంత భారంగా ఉన్న మూతపడడం లేదు. నిట్టూర్పుల వల్ల పెదవులు కమిలి పోతున్నాయి. విరహ బాధ క్షణక్షణం ఎక్కువ అవుతుంది. పాస్సు మీద పడుకున్న కాలం గడుస్తున్నట్లు లేదు. నిద్ర రావటంలేదు. చెట్ల మీద నుంచి వస్తున్న చల్లని గాలులు ఆమె శరీరం మీద కామాగ్నిని రగుల్చుతున్నాయి. కాని ఆ మాటలు, ఆమే తనూ లావణ్యాన్ని కాల్చడం లేదు. మన్మథుని పుష్పబాణాలు గుండెల్లో మంటలు రేపుతున్నాయి. ఆ మంటలు చల్లార్చటానికి తన ప్రియుడు ఎప్పుడు వచ్చి కౌగిలించుకుంటాడో అని ఎదురు చూస్తున్నది. చంద్రవంశోద్దారకుడైన దుష్యంతుని తలచుకుంటూ తన రొమ్ముల చంద్రాకారాల్ని, వాటి గుబ్బలపై గల వలయా కారపు నలుపు మచ్చలి, సాభిప్రాయంగా చూసుకుంటున్నది. ప్రతి అణువున పొంగుతున్న ఆవేశాన్ని ఆపాలనే ఉపాయం లేక కళ్ళు నీరు పెట్టుకుంటున్నది. తలను అటూ, ఇటూ ఊపి శరీరమంతటిని కుంచించుకుని పాన్పుపై వండుకొని ఉచ్చరని మూలుగుతూ, సన్నగా నవ్వుకుంటున్నది. మాటి మాటికి లేచి కిటికీ వద్దకు వెళ్ళి, చంద్రున్ని, చుక్కల్ని చూసి జాములు లెక్కిస్తున్నది. క్షణమొక యుగంగా గడుపుతున్నది. కామదేవత పూర్తిగా ఆవహించి ఉన్నది.

శకుంతల కంటికి కునుకు రాక తీయని ఊహలు ప్రజ్వదీల్ల చేస్తున్న విరహతాపానికి ఆహుతి అవుతుంది విరహ వేదనిని అనుభవిస్తున్నది. కనుక ఇక్కడ శకుంతల విరఘోత్కంఠత నాయిక. శకుంతల దుష్యంతుని గురించి ఆలోచిస్తున్నది. ఆయన యుద్ధానికి వెళ్ళింది మొదలు, రాక్షస సంహారం చేశారనే శుభవార్త చేరే వరకు దుష్యంతునికి విజయం చేకూర్చండని ఇష్టదేవతలను ప్రార్థించింది. దుష్యంతుడు మునుల వద్ద సెలవు తీసుకుని విడిదికి విచ్చేసాడనే వార్త వినగానే మన్మథుని చెరకు వించి తుమ్మెదల నారీ ఝంకారధ్వని చెవుల్లో గింగురమని
మ్రోగింది. మరియు

చ. తులఁగఁగ నిల్చు టెట్లు వసుధాపతి తారసమైన యట్టి చోఁ?
………………………………………………………………..
వలపుల రాచజోదు ప్రసంబుల పేరును గొర్వి కోలలన్.

క. వాలిక పూ ములుకులంద
………………………………………….
కోలలఁ గెలకు టని యా శకుంతల కయ్కెన్.

క. గణనకు ఘనమై మరు మా
………………………………………..
గణమున కేతెంచి నిలిచి కనుగొన నెదురన్.

సీ. విరహులపైఁ జల్ల విషపుఁ జూర్ణము నించి
…………………………………………………
నిలిపిన గండ్రగొడ్డలి యనంగ,

గీ. శంబ రారాతి శర వహ్ని సై-ప లేక
……………………………………………….
సరిపపై పడఁజల్లెల జం ద్రాతపంబు

క. ఉడు రాజ దీధికులందరు
…………………………………………….
శృంగార శాకుంతలం – తృతీయాశ్వాసం-పుట-170

సీ. చనుదోయిఁ బొందిన జలజ పత్రంబులు

……………………………………….

కిసలయంబులు పచ్చి గిడ్డ దయ్య,

గీ. కొమ్మ విరహాగ్ని వేదన కొలఁది యెద్ది
…………………………………………………….
దొక్కు నలులకు నలచేతఁ బొక్కు లెగసె.

క. ఎంతెంత శిశిర కృత్యం
…………………………………………….
క్లాంతియుఁ బడు పాటు జూచి కన్నీరొలుకన్.

ఆ క్షణం నుంచి ఆ మదనుడు పూలబాణాలనే పేరుతో కొరకంచులు ఆమే హృదయంలో రగిల్చి, దుష్యంతునిపై శికుంతలకు విరహతపం పురికొల్పుతూనే ఉన్నాడు. గాందర్వ సమయంలో ఆయన చేతిని పట్టుకోగానే, తన విరహతాపం చల్లారి. మన్మధుని బాణాలు చేసిన గాయాలన్నీ వంచిపోయాయనే అనుకుంది. కాని ఇప్పుడు ఆ పుష్పబాణాలు మళ్ళీ పాత గాయాలనీ కూడ కెలికి శరీర మంతా చురచుర కాల్చివేయసాగింది. ఆ బాణాల తాకిడి మరీ ఎక్కువయ్యే సరికి ఆగలేక, శకుంతల పర్ణవాల బైటికి వచ్చి, ప్రియుని రాకకై ఎదురు చూసే అభిసారిక అయింది. అట్టా బైటికి వచ్చేసరికి నీలమాకాశంలోని చంద్రుడు వేసవి కాలపు మధ్యాహ్న సూర్చునివలె అమే శరీరాన్ని భగ్గుమనిపించాడు. “చంద్రుడు విరహాలపై చల్లడానికి మదనుడు తయారు చేసిన విషపు చూర్ణపు భరిణి. విరహారుల్ని తెచ్చి బలి ఇవ్వటానికి ఉపయోగించే వధ్యశిల, ప్రేమించిన అపరాధానికి ప్రేయసీ ప్రియుల శరీరాలకు శిక్షగా తోడిగే సూరేకారపు బురఖా; ఎడబాటైన ప్రియుల్ని నరకటానికి పదును పెట్టించిన గొడ్డలి అనుకుంది శకుంతల. చంద్రుని వెన్నెల ఆమె శరీరానికి పడగాలుపే అయింది. శరీరమంతా సెగలు, పొగలు రేగాయి. శకుంతల పూతోటలో నాలుగడుగులు నడిచేసరికి కామాగ్ని, విరహం ఎక్కువైవడగాలి తగిలిన బాట సారిలా పడిపోయింది. ఇక్కడ శకుంతలకు చంద్రుని వెన్నెల వలన విరహం తగ్గాలి కాని అమేకు తాపం ఇంకా ఎక్కువయింది. కనుక విరహాత్కంది.. చంద్రుని వెన్నెలలో ప్రియుని కోసం ఎదురు చూస్తుంది.

కనుక జ్యోత్నభిసారిక అయింది. శకుంతల చెలులైన ప్రియంవద, అనసూయలు లేలేత పూల రేకులతో పేర్చిన ఒక పాన్పుపై పదుకో బెట్టారు. నీతలోపచారాలు చేయసాగారు. కాని రొమ్ములపై కప్పిన కలువరేకులు అంతలోనే ఎండుటాకుల వలె మారి, పొడి పొడిగా మారిపోతున్నాయి. కళ్ళమీద పరచిన పూలరేకులు కన్నీటిలో కలిపి సెలయేటి కాగితపు పడవల్లాగ కొట్టుకుపోతున్నాయి. శరీరం పూసిన గంధం అంతలోనే చిట్టులా, ఊకలా మారి చెత్తకలై లేచిపోతున్నది. హారాలుగా వేసిన కలువ కాడలు కొద్ది సేపటికే శకుంతల విరహ తాపానికి ఉడికి గుజ్జు అయి జీవలాగా కారిపోతున్నాయి. లేత మామిడి చిగుళ్ళు ఎండుటాకు పీలికల లాగా ఎగిరి పోతున్నాయి.

శీతలో పచారాలు అమే విరహతాపాగ్నిలో లజ్యాన్నే పోస్తున్నాయి. ఆమే పాదాల మీద కుప్పలుగా కప్పిన పుమలు. మంగలంలో వేయించిన పేలాల్లాగ చిట్లిపోతున్నాయి. శకుంతల విరహ తాపం ఎక్కువ కావడం, దాన్ని చల్లబరచటానికి ప్రాణసఖియలు పడుతున్న పాట్లు గుర్తించిన శకుంతల కన్నీరు పెట్టుకుంది. దుష్యంతునిపైన శకుంతలకు ఎటువంటి విరహవేదన అనుభవిస్తున్నదో తెలుస్తుంది. కాబట్టి శకుంతల అష్టవిధ నాయికలలో విరహాత్కంఠిత అయింది. శకుంతల గాంధర్వ వివాహ సందర్భంలో చేసిన పాణిగ్రహణ స్పర్శ ఆనందాన్ని గుర్తుచేసుకుంటూ, అవే కలలు కంటున్నట్టు ప్రవర్తించసాగింది. ఒకోసారి ఎండుటాకు మోగితే ప్రియుడే వస్తున్నాడని లేచి అటు ఇటు చూస్తున్నది. అతను కనిపించలేదని ఉస్సూరుమంటూ

మళ్ళీ పడుకుంటుంది. అంతలోనే కలలో కాంతుని చూచి ప్రేమతో పిలిచి కౌగింలిచుకుంటున్నది. పలవరిస్తున్నది. మేలుకువతోనే ఉండి కలలు కంటున్నది. చివరికి ఆమే కలవరింతలు పలవరింతలతోనే మూర్చిల్లుతుంది. దుష్యంతుడు గాంధర్వ వివాహం తరువాత మునులు చేయు యజ్ఞయాగాదులకు రక్షసుల వలన ఎటువంటి వఘ్నము కలగకుండ చేయటానికి మున్యాక్రామాలకు వెళ్ళి, రాక్షసులతో యుద్ధంచేసి రాక్షసులను ఓడించి వస్తాడు. శకుంతల దుష్యంతుని తలచుకొని తాపాన్ని కలిగి ఉంటుంది. ప్రియుడు వివిధ పనులవలన దేశాంతరం వెళ్ళినపుడు చింతించు నాయికగా శకుంతల కనిపిస్తున్నది. కనుక ఇక్కడ శకుంతల ప్రోషిత భతృక అయింది. శృంగార శాకుంతలములో శకుంతలకు, సహనాయికలుగా ఉన్న అనసూయ, ప్రియంపదలు పాత్ర విశిష్టమైనది. ప్రధాన పాత్రలు శకుంతల, దుష్యంతుడు అయినప్పటికి కథను ముందుకు తీసుకువెళ్లటానికి వీరి పాత్రలు తగిన ఔచిత్యాన్ని పాటించారు.

శకుంతలకు దుష్యంతుల సమాగమము, శకుంతలకు పుట్టిన బిడ్డ పట్టాభిషక్తుడు కావాలని, దుష్యంత శకుంతలకు గాంధర్వ వివాహం చేయటం, శకుంతలను దుష్యంతుడు స్వీకరించనప్పుడు అనసూయ ప్రియంపదలు అతనితో మాట్లాడం, శకుంతలకు దుర్వాసముని శాపం ఇచ్చినపుడు, శాపవిమోచనం కొరకు దుర్వాసుని వేడుకోవటం, నిండు సభలో అనసూయ దుష్యంతునితో మాట్లాడుతూ శకుంతలకు దుష్యంతుడు ఇచ్చిన అంగుళీయకమును రాజుపై విసిరివేయటం మొదలైన వాటిన నిర్వర్తించటంలో వీరి పాత్ర చాలా ప్రాముఖ్యతని కలిగి ఉంటాయి.

బి. జ్యోతి,
సహా ఆచార్యులు,
ఏవి. కళాశాల,
దోమలగూడ, హైదరాబాదు.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో