జనపదం జానపదం- 20 -గోండి సాహిత్యం, భాష, జీవితం – సంస్కృతి -భోజన్న

 

మానవులు మొదట తమ ఉనికి కోసం, తదనంతరం భాష కోసం పోరాటాలు చేశారు. ఈ క్రమంలో భాష కోసం పోరాటాలు చేసే భూమి ఒక చోట ఉంటే, భాషను కొంతైనా పట్టించుకోని నేల మరొక చోట కనిపిస్తుంది. ఆదిమ జాతులు సైతం తమ జాతిని, భాషని కాపాడుకోవడానికి ఎంతో కృషి చేస్తున్న రోజులివి. వారిలో ముఖ్యంగా గోండు తెగకు చెందిన ప్రజలను చెప్పుకోవాలి. వారు తమ ఉనికి కోసం, తమ భాష కోసం నేటికి ఎంతో పాటుపడుతున్నారు. గోండు ప్రజలు వెనుకపడిన తెగలలో ఒకరు, వీరు నట్టడవిలోను మరియు గ్రామాలకు దగ్గర ఉన్న గూడాలలో జీవిస్తున్నారు. వీరిని స్వచ్ఛమైన మనస్సుకి ప్రతీకగా గ్రామాలల్లో నేటికి చెబుతుంటారు. ఇతరులకు అన్యాయం చేయడమన్నా, ఇతరుల సొమ్ము అపహరించడమన్నా, పని చేయకుండా కాలక్షేపం చేయడమన్నా వీరు అపరాధంగా భావిస్తారు. గోండు ప్రజలతో మాట్లాడడం అంత సులభమైన పని కాదు. వీరు ఇతరులతో అంత త్వరగా కలిసిపోరు, వీరిలో ఒకింత ముభావ స్వభావం, బెరుకుతనం, కలివిడి లేమి కనిపిస్తాయి. ఈ తెగలోని ఆడవారిలో ఈ లక్షణం మరింత ఎక్కువగా కనిపిస్తుంది.

రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న సమాజాన్ని అనుసరించి ఈ తెగ వారు సైతం గూడాలను విడిసిపెట్టి బతుకుదెరువుకై నగర బాట పడుతున్నారు. ఇందుకు సవాలక్ష కారణాలున్నాయి. అవి

1.రోజు రోజుకి అడవులు తరిగిపోవడం
2.వేటకు సంబంధించిన వన్య ప్రాణులు రోజు రోజుకు కనుమరుగైపోవడం
3.గూడేలలో అహార కొరత తీవ్రంగా ఉండడం
4.చేయడానికి పని కూలి పనులు లేకపోవడం
5.వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని భూస్వాములు, పెట్టుబడిదారుల అఘాయిత్యాలెన్నో చేయడం.
6.గూడేలు వదిలితేనే అభివృద్ధి చెందుతామనే భావన గిరిజనులలో అధికమవడం.
7.యంత్రాలు వీరి పొట్టగొట్టడం మొదలైన ఎన్నో కారణాలు చుట్టు ముట్టడం వలన గిరిజనులు అనేక రకాల అవస్థలు పడుతూ వలసల భాట పడుతున్నారు. కాబట్టే నగరాలలో భవన నిర్మాణ కార్మికులుగా, రోజు వారి కూలీలుగా ఎక్కడ చూసిన కనిపిస్తున్నారు. ఈ ఒక్క గోండి తెగనే కాదు, ఇతర తెగలు, అనేక క్రింది స్థాయి కులాల వారి పరిస్థితి ఇదే. గోండి తెగను అతి ప్రాచీన తెగగా మరియు ప్రఖ్యాతిగాంచిన తెగగా పరిశోధకులు భావిస్తుంటారు. సంఖ్య పరంగా చూసినా ఈ తెగ పెద్ద తెగగా గుర్తింపు సంతరించుకుంది. వీరిని వివిధ రాష్ట్రాలలో రకరకాల పేర్లతో పిలుస్తారు.

గోండు తెగలో నాలుగు రకాల ఉప తెగలున్నాయి. అవి
1.రాజ్ గోండులు
2.దుర్వే గోండులు
3.మరియ గోండులు
4.మురియ గోండులు, తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో రాజ్ గోండులు, దుర్వే గోండులు జీవిస్తుంటారు. రాజ్ గోండులలో నాలుగు వంశాల వారు ఉన్నారు, వీరిని నాలుగు నగాల వారు అంటారు.
గోండులు అత్యంత ఇష్టంతో చేసే నృత్యం గుస్సాడి. ఈ నృత్యాన్ని దండారి పండుగలో ఎంతో ఆనందంతో, ఆకర్షణీయంగా చేస్తారు. వీరు దేవుళ్ళ వేషాలు వేస్తూ ఎంతో పవిత్రమైన దీక్షతో నృత్యాలు చేస్తారు. గోండుల గురువుని ‘‘యౌదాన్’’ అంటారు. ఇతని ఆత్మ ప్రతిరూపాన్ని ఏత్మాపేన్, ఆకాడిపేన్, గుస్తాడిపేన్ అని పిలుచుకుంటారు.

గోండులు తమ ఆచారాలని, సంప్రదాయాలని, భాషని మరిచిపోకుండా నేటికి కాపాడుకుంటున్నారు. వీరి భాషకు ఈ మధ్యే లిపిని కనిపెట్టుకున్నారు. వీరి భాషకు 150 సంవత్సరాల చరిత్ర ఉంది కాని లిపి లేకపోవడం వలన అనేక అవస్థలు పడిన వీరి సంతానం నేడు ఆనందంగా మాతృ భాషలోనే విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం, గంజ్యాల గ్రామంలో గోండులకి సంబంధించిన సాహిత్యం బయటపడింది. వీటి ఆధారంగా 42 అక్షరాలతో గోండి లిపికి రూపకల్పన చేశారు. కాబట్టి జాతి జనులు తమ ప్రాంతీయ భాషలని, యాసలని, సంస్కృతులని, సాహిత్యాంశాలని, సంప్రదాయాలని, ఆచారాలని, కొన్ని ముఖ్యమైన కట్టుబాట్లని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. అదే ఆయా జాతులకి శ్రీరామ రక్షలాగా పని చేస్తుంది.

-భోజన్న

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో