మలి బాల్యానికి భరోసా(సంపాదకీయం )- అరసి శ్రీ

ఒకప్పుడు ఇంటిలో బుడి బుడి అడుగులు వేసే బుజ్జాయి నుంచి మూడు కాళ్ళ ముసలమ్మ , తాతయ్యల వరకు అందరితోను , అన్ని వరసలతో ఇల్లు సందడిగా అంత మించి బంధాలతో , బాంధవ్యాలతో ఉండేవి. కానీ కాలంతో పాటు మనలో వచ్చిన మార్పులు ఎన్నింటినో మార్చేసింది. వాటిలో ముఖ్యంగా నాయనమ్మ , అమ్మమ్మ , తాతయ్య బంధాలును పలచన చేసేసింది.

ఒకప్పుడు నాయనమ్మ, అమ్మమ్మలు పెట్టె గోరు ముద్దలు , తాతయ్య చెప్పే కథలు , బోలెడన్ని వింతలు పిల్లలకి అవే ఆట విడుపు. ఇంక పండగలు వచ్చాయంటే ఆ సందడే వేరు. కాని ప్రస్తుతం అమ్మ , నాన్న, చెల్లి లేదా తమ్ముడు . కుదిరితే యిద్దరూ లేకపోతే ఒక్కరే అన్నట్టు ఉంది పరిస్థితి. ఇంక నాయనమ్మ , తాతయ్య , అమ్మమ్మలు వృద్దాశ్రమాల్లో చెప్పవలసిన పనే లేదు.

పేదరికం కూడా ఒక సమస్య , అప్పటి వరకు నిరంతరం పని చేసి ఒక్కసారిగా ఖాళీగా ఉండటం మనసు అంగీకరించకపోవడం మరొక వైపు, మనం కోసం నిరంతరం కష్టపడి మనల్ని ఒక స్థాయికి తీసుకు వచ్చిన తల్లిదండ్రులను వదిలి దూరంగా ఉండటం, మరొక వైపు వాళ్ళని వదిలించుకోవడం లేదా మారుతున్న కాలంతో పాటు వాళ్ళు మారకపోవడంతో కొడుకుకి దూరంగా ఉండవలసి రావడం నేటి సమాజంలో నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో అక్టోబర్ 1 వృద్ధుల దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి పరిగణిస్తుంది .

ప్రపంచ వృద్ధుల దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న నిర్వహించబడుతుంది. పెద్దల పట్ల నేటితరం చూపిస్తున్న వ్యవహారశైలిని పరిగణనలోకి తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో ఈ సమస్యను చర్చించి వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. ప్రారంభం మొట్టమొదటిసారిగా వియన్నాలో 1984లో వయో వృద్ధుల గురించి అంతర్జాతీయ సదస్సు నిర్వహించబడింది. సీనియర్‌ సిటిజన్‌ అనే పదం కూడా ఇదే సదస్సులో మొదటిసారిగా వాడడం జరిగింది.1990, డిసెంబర్‌ 14న ఐక్యరాజ్య సమితి వృద్ధుల కోసం ఒక నిర్థిష్ట ప్రణాళికను తయారుచేసి, ప్రపంచ దేశాలన్నీ వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని కోరింది. 2004లో స్పెయిన్ దేశంలో జరిగిన 86 దేశాల సమీక్షా సమావేశాలలో వృద్ధుల సంక్షేమం కోసం 46 తీర్మానాలను ఆమోదించారు. మొదటిసారిగా 1991, అక్టోబర్‌ 1న ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. 


ఇవి ఏడాది ఒకసారి వచ్చే వేడుకలు. ఆరోజు మాత్రం మాట్లాడుకుని విస్మరించడం తప్ప అంతగా ప్రయోజనం లేదనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. ప్రపంచ దేశాల పద్దతులు , కట్టు బాట్లు ఎలా ఉన్నా మన భారత దేశంలో ఉన్న సంప్రదాయాలు , బంధాల పట్ల ఉన్న నమ్మకాలు కూడా నేటి సమాజంలో నిలబడలేకపోతున్నాయి . రోజు రోజుకి మన దేశంలో కూడా వృద్దాశ్రామాలు పెరగడం , వాటిల్లో ఉంటున్న వృద్ధుల జీవిత కథలు వింటుంటే మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామో , మన ముందు తరాల వారికి నేర్పిస్తున్నది ఏమిటో అర్ధం అవుతుంది.

తండ్రి చనిపోయిన తర్వాత తల్లిని గుడి మెట్ల మీద వదిలేసిన కొడుకు , నేను మళ్ళీ వస్తాను యిక్కడే ఉండు అని చెప్పి తండ్రిని అనాధ ఆశ్రమంలో వదిలి పెట్టి విదేశాలకు వెళ్ళిపోయినా కొడుకు , కోడలు మరొక కథ . యివే కాదు కొడుకు , కోడలు ఉద్యోగాలే మనవళ్ళు , మనవరాళ్లు చదువులు , కంప్యుటర్ ఇంక మాతో మాట్లాడే సమయం , తీరిక వాళ్లకి ఎక్కడిది అందుకే ఇక్కడికి వచ్చేసాం అనే వాళ్ళు లేకపోలేదు.
మనకి ఒక నిమిషం కూడా ఆలోచించే తీరిక లేదు. కాదు కాదు ఆలోచించ లేకపోతున్నాం. ఆలోచిస్తే మనం చేస్తున్నది, ఏం కోల్పోతున్నామో, ఏం చేసి మనల్ని కన్నా వాళ్ల ఋణం తీర్చుకుంటున్నామో తెలుస్తుంది.

ఈరోజు మనం చేస్తున్నదే రేపు మన పిల్లలు చేస్తారు అనేది మరిచిపోతున్నాం.

వృద్ధాప్యం అంటే ప్రతి ఒక్కరి జీవితంలో మళ్ళీ వచ్చే బాల్యం. బాల్యం అంత స్వచ్చమైనది . తాను పెంచి పెద్ద చేసిన బిడ్డ నీడలో సేదరాల్సిన సమయం. ఈ జీవితం ఇచ్చినందుకు ఋణం తీర్చుకోలసిన తరుణం . మనం దేశాన్ని , మన ఊరిని ఉద్దరించవలసిన పనిలేదు. నిన్ను కన్న వాళ్ళని కనిపెట్టుకుంటే చాలు. ఈ ప్రత్యేక దినోత్సవాలు అవసరం ఉండదు.

-అరసి శ్రీ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయంPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో