ఎంత పదిలంగా చూసుకున్నా
నా హృదయం నాది కాలేకపోయింది
ఒక్క నీ ఓర చూపుతోనే
అది నీ వశమైపోయింది
-జిగర్ మురాదాబాదీ
ఎదురు చూపులకైనా
ఓ హద్దంటూ ఉంటుంది
కడకు వెన్నెల కూడా
కటికిటెండలా మారుతోంది
– బిస్మాల్ సయీదీ
గమ్య స్థానం దాకా
నా ప్రేమను చేర్చలేకపోయాను
నిట్టూర్పులతో నడుస్తూ నడుస్తూ
కడకు ఓటమి పాలయ్యాను
– అఫ్సోస్
అర్ధం చేసుకునే వాళ్లకు
నాదొక్క విన్నపం
ప్రేమంటే కర్తవ్యం
కాదు సుమా అది పాపం
-ఫిరాఖ్
– అనువాదం ఎండ్లూరి సుధాకర్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~