జనపదం జానపదం- 19- చెంచుల జీవన విధానం – సంస్కృతి -భోజన్న

గిరిజన తెగలలో ఒకరు చెంచు తెగ వారు. చెంచు తెగ సంచార తెగగా గుర్తింపు సంతరించుకుంది. వీరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రకాశం, గుంటూరు, కర్నూలు మరియు తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో నివసిస్తున్నారు. చెంచులు వారి భాషతో పాటు తెలుగు భాషను కూడా మాట్లాడుతారు. నల్లమల అడవి ప్రాంతంలో కొండల్లో, గుట్టల్లో, కృష్ణా నది చుట్టు పక్కల జీవిస్తున్నారు. వీరింక నాగరిక జీవనానికి చాలా దూరంలో అష్ట కష్టాలతో జీవితాలను వెళ్ళదీస్తున్నారు. ‘‘ఆంధ్ర ప్రదేశ్ లో 35 గిరిజన తెగలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ 35 గిరిజన తెగలలో ఒక గిరిజన తెగ చెంచులు’’ (ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక సంచిక, 2021, పుట 862). చెంచులను ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితాలో 3 వ కులంగా చేర్చినట్లు తెలుస్తుంది.

చెంచులు చిన్న కుటుంబాలతో ‘పెద్దోయిడ్’ జాతికి చెందిన వారుగా కనిపిస్తారు. ఈ జాతి వారు శ్రీలంకలో జీవిస్తున్న అతి ప్రాచీన జాతి వారు. భారత దేశ చెంచులు రింగుల జుట్టు, విశాల వదనం, పొడవాటి దవడ, చప్పిడి ముక్కు, పొట్టిగా, నల్లగా ఉంటారు. వీరి పూర్వీకులు ఆకులతో శరీరాన్ని కప్పుకునే వారు. ప్రస్తుతం గోచీని మగవారు, నూలు రవిక, చీరను ఆడవారు కట్టుకుంటున్నారు. వీరి జీవన విధానం చాలా సాధారణంగా ఉంటుంది. కోయలు నిత్య వ్యవహారంలో విల్లంబులు, కత్తి, గొడ్డలి, గుంతలు తవ్వే కర్ర, కొన్ని కుండలు, బుట్టలు, చింకి పాతలు వీరి వెంట నిరంతరం ఉండేవి.

చెంచులు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను ఎక్కువగా అనుభవిస్తారు. వీరు ఎవరిని వ్యక్తిగత స్వేచ్చకి దూరం చేయరు. ఈ తెగలోని పురుషులు స్త్రీలకి సమాన హక్కులు కల్పిస్తారు. వితంతు పునర్వివాహాలు అమలులో ఉన్నాయి. భర్తపై ఇష్టంలేని ఆడవారు భర్తకు విడాకులు ఇచ్చే సాంప్రదాయం ఉంది. వేటకు, అడవి పండ్లకు అనుమతి, అనుగ్రహం ఇస్తుందని అడవి దేవతను, ఆకాశ దేవుణ్ణి దైవంగా భావించి పూజిస్తారు. చెంచు పెంటలలోని ఆడపిల్లలకు పన్నెండు నుంచి పదునాలుగు సంవత్సరాల వయసులోనే పెండ్లి చేస్తారు. ఇది వారి జీవితంపై చెడు ప్రభావం చూపుతుంది. దీని ఫలితంగా చిన్న వయసులోనే గర్భందాల్చి అనేక సమస్యలను లేదా మాతా శిశు మరణాలు అధికంగా జరుగుతున్నాయి. పిల్లలలో, ఆడవారిలో పోషకాహార లోపం, శారీరక, మానసిక ఎదుగుదలకు వీరు తీసుకునే ఆహారం, వాతావరణం వీరి ఆచారాలు కారణం అవుతున్నాయి.

ఆరోగ్యం విషయంలో చెంచులు చాలా వెనుకబడి ఉన్నారు. చిన్న పిల్లలు పోషకాహార లోపంతో బాధపడగా, వివాహితలు రక్తహీనతతో బాధపడుతున్నారు. గర్భవతుల కంటే పుట్టే పిల్లలు మరింత లోపాలతో పుడుతున్నారు. చలి కాలంలో వీరికి ఎక్కువ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆ చలిని తట్టుకోవడానికి నెగళ్లు మాత్రమే వీరికి ధీముగా ఉన్నాయి. వీరికి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, శ్వాస కోశ సంబంధిత ప్రాణాంతక వ్యాధులు ఫరిపాటే, వీటి కారణంగా చాలా మంది చనిపోతున్నారు.
బాలింత సమయంలో వీరికి సరియైన సూచనలు, పౌష్టిక ఆహారం అందదు. దవాఖాన వీరికి అందనంత దూరం కాబట్టి గుడిసె ప్రసవాలే ఇక్కడ ఎక్కువ. కానుపుకి కానుపుకి దూరం లేనందున మాతా శిశు మరణాలు అధికంగా ఉంటాయి. బ్లీడింగ్, ఇన్ ఫెక్షన్ కారణంగా చెంచు పిల్లల్లో అనిమియ, తలసేమియా, చికిర్ సేమియ లాంటి వ్యాధులు, కడుపులో కణతలు, గడ్డలు మొదలైనవి శాపాలుగా మారుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లోని నరుకుళ్ళపాడు గ్రామాన్ని గమనిస్తే కోయల జీవితం ఎలా ముగిసిపోతుందో అర్థమౌతుంది. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చెంచులను విందుకు పిలిచి భోజనం పెట్టి, భోజనం ముగించిన తరువాత 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి నరికించాడని తెలుస్తుంది. అందుకే ఆ వధ జరిగిన ఊరి పేరు నరుకుళ్ళపాడుగా మారిందని, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తాను చేసిన హత్యలకు పశ్చాత్తాపపడి గుళ్ళూ గోపురాలూ కట్టించాడని చరిత్ర వలన తెలుస్తుంది.
వార్తపత్రికల్లో చెంచుల గురించి ‘‘ఆదిమ గిరిజన జాతి అయిన చెంచులు అంతరించిపోతున్నారు. నల్లమల అడవికి మాత్రమే పరిమితమైన ఈ జాతి క్రమంగా కాల గర్భంలో కలిసిపోతోంది’’ (సాక్షి, 21.10.2008) (https:te.wikipedia.org), ‘‘అస్తిత్వ ప్రమాదంలో చెంచులు’’ (ఆంధ్రజ్యోతి, 28.12.2008) (https:te.wikipedia.org) అని చెంచుల అస్తిత్వాన్ని కన్నులకు కట్టినట్టు సమాజానికి తెలియజేశారు. గుర్రం జాషువా తన గబ్బిలం కావ్యంలో చెంచులని విశేషంగా కొనియాడాడు. వారిని సాక్షాత్తు శివుడితో పోల్చి వారి గొప్పతనాన్ని తెలియజేశారు.

‘‘విలు నమ్ముల్‌ ధరియించి చెంచులు తదాభీలాటవీ మధ్య భూ
ముల కన్పట్టిన నంజలింపుము మహాత్ముండైన భర్గుండు భ
క్తుల కిష్టార్థము లీయగోరిన గణస్తోమంబుతో మాయ పం
దుల వేటాడుచు భిల్లుడై నరుల కన్నుల్‌ గప్పి క్రీడించెడిన్‌’’ (గుర్రం జాషువా గబ్బిలం) 

విల్లు, అమ్ములు ధరించిన చెంచులు నువ్వు వెళ్ళే దారిలో అడవి మధ్య భాగంలో నీకు కనిపిస్తారు. వారిని భక్తులకు ఇష్టమైన కోరికలు తీర్చుతూ, మాయ అనే పందులని సంహారించడానికి మానవుల కన్నులుగప్పి చంచరించే శివుడిగా (కిరాతకులు) తలంచి నమస్కరించమని జాషువా గబ్బిలానికి సూచిస్తాడు. వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామంలో చెంచుల గురించి ప్రస్తావించారు. నేటికి చెంచుల పరిస్థితి కడు దయనీయంగానే ఉంది. ప్రభుత్వాలు చేసేది అర్థం చేసుకోలేని దశలో కొంత భాగం నష్టపోతే, విద్య అందక మరింత నష్టపోతున్నారు.

-తాటికాయల భోజన్న

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో