విలువైనదేదీ
అంత సులభంగా దొరకదు
గులాబీకీ
ముళ్ళున్నాయి …
***
ఇంటి విస్తీర్ణం
పెద్దదైతే మంచిదే
మనసు వైశాల్యం
తగ్గకుంటే చాలు
***
ఆత్మ బలిదానాలు
అమరుల త్యాగాలు
ఇవే …
తెలంగాణ రాష్ట్రం
***
ఎంత తుడిచినా
అడ్డం మసకగానే …
ముసుగు తీయాల్సింది
మనసుకు…
***
మాటల యుద్ధం
జరుగుతోంది
చివరకు గెలిచేది
మౌనమే !
***
దేశమంతా
స్వచ్చ భారత్
మరి మనో మాలిన్యం
పోయేదేలా ?
-– వడ్డేపల్లి సంధ్య
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~