మహిళల రక్షణ సాధ్యమేనా ?(గౌరవ సంపాదకీయం )- మామిడాల శశిరేఖ

రోజు రోజుకీ మహిళల భద్రత ప్రశ్నార్ధకమవుతూనే ఉంది.వయసుతో సంబంధం లేకుండా నెలల పసిగుడ్డు నుండి వయసు మీద పడిన వృద్ధులను సైతం వదలకుండా ఆడవాళ్లపై మృగాలవంటి కామాంధుల అత్యాచారాలు మరియు హత్యలు నిర్విరామంగా కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని వెలుగులోకి వస్తున్నాయి ఇంకా ఎన్నో హింసాత్మక చర్యలు వెలుగులోకి కూడా రాకుండా ఆడవాళ్ల జీవితాలు అస్తమయమవుతున్నాయి. మన భారతదేశంలో దాదాపు ప్రతీ 16 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతుంది అంటే ఇక మహిళలకు రక్షణ ఎక్కడుంది. నిర్భయ చట్టం, దిశ చట్టం ఇలా సంరక్షించే చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ నేరస్తులలో భయం కానీ మార్పు కానీ రావట్లేదు. ఎందుకంటే ఒక నేరం జరిగితే అది ఋజువై నేరస్తుడికి తొందరగా సరియైన శిక్ష పడటమనేది కూడా తక్కువగానే ఉంది.పిల్లలపై లైంగిక వేధింపుల నియంత్రణకు ఏర్పాటు చేసిన పోస్కో చట్టం లో కూడా ఇప్పుడు చట్ట సవరణలు జరిగి నేర తీవ్రతను బట్టి నేరస్తుడికి 20 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష లేదా ఉరిశిక్ష కూడా వేయడానికి అవకాశం ఉంది.

చట్టాలు ఎంత కఠినతరమైనా ఎన్ని మార్పులు వచ్చినా నేరాల తీవ్రత తగ్గడం లేదు .మధమెక్కిన కీచకులు ఆడవాళ్లను ప్రేమించాలని ఇబ్బంది పెట్టడం ప్రేమించకపోతే హత్యలు లేదా ఆసిడ్ దాడులు చేసి వారి కుటుంబాన్ని శోక సంద్రంలోకి నెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఒకవేళ ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటే పరువు హత్యలను సమాజంలో చూస్తూనే ఉన్నాం. గృహహింస ,లైంగిక దాడులు, బ్రూన హత్యలు ఇలా ఎన్నో రకాలుగా మగువ మనుగడకు భంగం వాటిల్లుతూనే ఉంది.ఆధునికీకరణ పెరిగి పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో పోటీని తట్టుకుని అటు ఇంటా ఇటు బయటా సరియైన న్యాయం చేస్తూ ఎంతో సమర్థవంతంగా రానిస్తున్నప్పకీ వారిపై జరిగే దాడులు వారి ఆశల్ని , ఆశయాల్ని చిదిమేస్తున్నాయి.ఈ మద్యే స్వాతంత్ర్య దినోత్సవం రోజు గుంటూరులో రమ్య అనే బిటెక్ అమ్మాయిని శశికృష్ణ అనే జులాయి అబ్బాయి పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుమీద అతి కిరాతకంగా కత్తితో పొడిచి మరీ హత్య చేసాడు. అందరూ చూస్తూ ఉండిపోయారు కానీ కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే మన సమాజం ఎటు పోతుందో మనం అర్థం చేసుకోవచ్చు.

అర్ధరాత్రి ఆడవాళ్లు ఒంటరిగా తిరగగలిగినప్పుడే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లు అని మహాత్మాగాంధీ గారు అన్నారు. అర్ధరాత్రి ఏమో కానీ రాను రాను పగలు కూడా ఆడవాళ్లు బయట తిరగగలిగే భద్రత కనిపించడం లేదు. నేటి వాస్తవిక పరిస్తితులను చూస్తుంటే ఇప్పటికీ స్త్రీలకు స్వాతంత్య్రం రాలేదనే మనం చెప్పవచ్చు.ఇలాంటి పరిస్థితులలో మార్పులు రావాలంటే ముందుగా ఇంట్లో పెంపకం నుండే ఆ జాగ్రత్తలు ఎంతైనా అవసరం. ప్రతీ తల్లిదండ్రులు అమ్మాయిలకు ఎలా జాగ్రత్తలు చెప్తామో అబ్బాయిలకు కూడా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించొద్దని చెడు అలవాట్లకు బానిస కావొద్దని హెచ్చరిస్తూ పెంచాల్సిందే. చట్టాలలో ఇంకా సవరణలు మార్పులు జరిగి కఠినమైన శిక్షలు త్వరితగతిన అమలుజరగాలి. స్కూల్లలో, కాలేజీలలో తప్పకుండా చట్టాలపై అవగాహన కల్పించాలి. ప్రభుత్వం వారు సోషల్ మీడియా ద్వారా చట్టాలను గురించి వాటిలోని శిక్షలను గురించి అందరికీ తెలిసేలా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి.

ధూమపానం , మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని సినిమాలలో మరియు టీవీ కార్యక్రమాలలో హెచ్చరికగా ఏ విధంగా అయితే వేస్తారో అలాగే ఆడవాళ్లపై అఘాయిత్యాలు లేదా ఏదైనా లైంగిక దాడులను ఇబ్బందికర విషయాలను వెండితెర మీద కానీ బుల్లితెరమీద కానీ చూపించినప్పుడు ఆడవాళ్లతో ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తే కఠినమైన శిక్షలు వర్తిస్తాయి ఇది తప్పు అనే హెచ్చరికను నోట్ గా వేయాలి. ఇలా చేస్తే అఘాయిత్యాలు చేసేవాళ్ళు కొంతైనా భయపడి నేరాల తీవ్రత తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆడవాళ్లు కూడా ఎవరిని పడితే వారిని నమ్మడం మరియు సోషల్ మీడియాలో అన్నీ షేర్ చేసుకోవడం మంచిది కాదు. అపరిచితులతో స్నేహాలు ఎప్పటికైనా ప్రమాదమని భావించాలి.ఆడవాళ్లు ఏ పరిస్థితినైనా అనుమానించి జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అమ్మాయిల పట్ల ఎవరైనా ఇబ్బందికలిగించేటట్లు ప్రవర్తించినా లైంగికంగా వేధించినా అమ్మాయిలు తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు విషయాన్ని చెప్పి పోలీసువారిని ఆశ్రయించడం మంచిది. సమస్య చిన్నగా ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉంటే తర్వాత జరిగే పెద్ద నేరాలను నియంత్రించవచ్చు. స్త్రీలను సంరక్షించాల్సిన బాధ్యత సమాజానికి ఉంది. ఎందుకంటే స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు కదా.

-మామిడాల శశిరేఖ
న్యాయవాది, కవయిత్రి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయంPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో