పరంధామం(కథ) -బి. వి. లత

పరం చింతంరాజుగా పిలువబడే పరంధామం గారు 40 ఏళ్ళ క్రితం అమెరికాలోని డల్లాస్ నగరంలో డాక్టర్ గా స్ధిరపడిపోయారు. భార్య సునీత ఒక కంపెనీలో మంచి పొజిషన్ లో ఉంది. పెద్ద కొడుకు రాజారావు డాక్టర్ గాను, రెండవ వాడు సాఫ్టువేర్ కంపెనీ నడుపుతూను, నిలదొక్కుకున్నారు. మూడెకరాలలో పెద్ద రాజభవనంలాంటి ఇల్లు, మూడు పడవల్లాంటి కార్లు, ఎంతో విలాసవంతమైన జీవితం గడుపుతూ సుఃఖంగా ఉన్నారు. కొడుకులుూ, కోడళ్ళూ, మనుమరాళ్ళు, మనుమడూ, అడపాదడప వచ్చి పోతూ ఉంటారు. ఏ చీకూచింతా లేకుండా ఉన్నారు.

పరంధామంగారికి ఒక తమ్ముడు. చక్రధరం. మద్రాస్ ఐ ఐ టి లో ఇంజనీరింగ్ చదివి అక్కడే ఒక పెద్ద కంపెనీలో చేస్తూ తల్లి తండ్రులకు దగ్గరగా ఇండియాలో ఉండి పోయారు. ఎన్ని సార్లు పరంధామంగారు అడిగినా అయన ఇండియా వదిలి రావటానికి ఇష్ట పడలేదు. అతని భార్య కూడా ఒక కాలేజీలో లెక్చరర్ గా పని చేసేది. ఆయన కొడుకూ, కూతురు కూడా ఆష్ట్రేలియా లో సెటిల్ అయి పోయారు. ఆరేళ్ళ క్రితం తమ తండ్రి చనిపోయారు. అప్పటినుంచి తల్లి చక్రధరం తోనే ఉంటోంది.

ఈ మధ్యే పరంధామంగారి తమ్ముడు చక్రధరం గుండె వ్యాధి తో చనిపోయారు. తల్లినీ, తండ్రినీ తనతో ఉంచుకోవాలని పరంధామంగారు ఎంత ప్రయత్నించినా వారు ససేమిరా అనటంతో అప్పటిలో ఊరకుండిపోయారు. తమ్ముడు కూడా వారిని సమర్ధించటంతో బలవంత పెట్ట లేదు. ఇప్పుడు తన తల్లికి ఎనభై ఏళ్ళు. మరదలిని ఆమె పిల్లలు తమతో అష్ట్రేలియా తీసుకుపోవాలని నిశ్చయించుకోవటంతో సమస్య మొదలయ్యింది. తల్లి ఒంటరిది అయిపోతుంది. పరంధామంగారు ఇండియా వచ్చి ఆమెను తనతో రమ్మని ఎంతో బతిమిలాడారు, కానీ ఆమె ఇష్టపడలేదు. తనకక్కడ ఏమీ తోచదని పలకరించేవాళ్ళెవరూ ఉండరనీ మారాం చేయ్యటంతో, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్
కొని, ఒక సంస్ధ ద్వారా ఇద్దరు పనివాళ్లని, క్యారియర్ తెచ్చే వాళ్ళని, ఒక డాక్టర్ని కూడా ఆమెని చూసిపోవటానికి మాట్లాడి తను వచ్చేశారు. వచ్చారే కానీ మనసంతా తల్లిమీదనే ఉంది. తను వెళుతున్నానని చెప్పినప్పుడు తల్లి కళ్ళలో కనిపించిన బెంగ మనసును తొలుస్తోంది. తప్పు చేశానేమోనన్న భావన నిద్ర పోవియ్యటం లేదు.

తనకు చిన్నప్పుడు టైఫాయిడ్ వచ్చినప్పుడు పది రోజులు కంటిమీద రెప్ప వెయ్యకుండా తన ప్రక్కనే ఉండి సేవలు చేసింది తన తల్లి. తనకు తగ్గాక గుళ్ళో పొర్లు దండాలు పెట్టింది. తనకు మెడిసిన్ లో సీటు రావాలని ఒంటి పూట భోజనం చేసేది. తనను మెడిసిన్ చదివించటానికి కూడా వాళ్ళెంతో కష్ట పడాల్సి వచ్చేది. తన వెనకాలే తమ్ముడిని ఇంజనీరింగ్ లో చేర్చటంతో అమ్మ, నాన్నా ఎంతో కష్ట పడాల్సి వచ్చింది. అలాంటిది ఇప్పుడు ఆమెకు అవసరమైనప్పుడు తాను ఆమె ప్రక్కన లేనన్న బాధ పరంధామంగారిని నిలవనీయటంలేదు. పనిలో ఉన్నా ఇదే బెంగ.

సునీత కూడా గమనిస్తూనే ఉంది. పరంధామంగారు పరధ్యానంగా, ఉదాసీనంగా ఉండటం. ఆమెకు ఇండియా లో ఎవరూ లేరు. తల్లీ, తండ్రీ తన తమ్ముడికి దగ్గరగా ప్లోరిడాలో ఉంటున్నారు సిటిజన్ షిప్ తీసుకుని. కాబట్టి ఇండియా వెళ్ళాలంటే అంత ఇంటరెస్టు లేదు. అయినా భర్త బాధ చూస్తుంటే కష్టంగానే ఉంది. కొడుకులతో రోజూ ఇదే విషయం చర్చిస్తోంది. ఈ కరోనా భయం ఒకటి. అంతటా లాక్ డౌన్లు నడుస్తున్నాయి. పరంధామం ఆత్రుత రోజు రోజుకు పెరిగి పోతోంది. అతి కష్టం మీద వాక్సిన్ వేసుకునే దాకా ఆగాలని నచ్చ చెప్పి వప్పించ కలిగారు. కానీ పరంధామంగారు రోజూ ఇంటికి రాగానే కంప్యూటర్ ముందు కూర్చుని తల్లిని గమనించటం, పని చేసేవాళ్ళకు సలహాలివ్వటం చేస్తూ గడిపేవాడు. ఆ రోజు రానే వచ్చింది, పని వాళ్ళు రాలేమని చెప్పేశారు. వాళ్ళు పని చేసే కంపెనీ మూసేయటంతో వారు వారి ఊళ్లకు వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. పరంధామం గారు వాళ్ళ ముందు ఒక ప్రతిపాదన ఉంచారు,
ఎవరైతే అక్కడే ఉండిపోయి తను వచ్చేదాక తన తల్లిని చూసుకుంటారో వాళ్ళకి ఐదు లక్షలు, నెలకి ఏభై వేలు ఇస్తానని చెప్పడంతో ఒకతను ఒప్పుకున్నాడు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని, వాక్సిన్ కోసం ఎదురు చూడ సాగాడు.

నెల రోజుల తరువాత డాక్టర్ గా ప్రధమ వరుస వర్కర్ల క్రమంలో పరంధామం కి మొదటి విడత వాక్సన్ కి అవకాశం దొరికింది. వెంటనే అత్యవసర ప్రాతిపదికన ఇండియా వెళ్ళే విమానంలో టికెట్ కొనేసుకుని ఎదురుచూడసాగాడు. దిగులుగా ఉన్న సునీతకు, ‘అమ్మ ఉన్నన్నాళ్ళు ఉండి వచ్చేస్తాను, సునీ, వచ్చాక రిటైర్మెంట్ తీసుకుంటాను. ఇద్దరం ప్రపంచ యాత్రకు వెళదాం, సరేనా?’

‘ఊ’ అంటూ తలాడించిన సునీత బాధ అర్ధం చేసుకుంటూ, ‘ చూడు సునీ, నీ మీద పిల్లల మీద ప్రేమలేక కాదు కదా, ఎందుకో అమ్మకు ఏమి చేయలేక పోతున్నానన్న బాధ నన్ను తినేస్తోంది. ఈ చివరి రోజులలో ఆమె పక్కనే ఉండి, ఆమె చేయి పట్టుకుని నేను నీ పక్కనే ఉన్నానన్న భరోసా ఇవ్వలేని కొడుకు ఉండి లాభమేమిటనిపిస్తోంది. చక్రం బ్రతికున్నన్నాళ్ళు ఏ రోజు వంతులేయలేదు. నేనే ఎందుకు చేయాలి అని అడగలేదు. అమ్మకీ, నాన్నకి వాడే తోడుగా ఉన్నాడు. నేనే దూరంగా ఉండిపోయాను. ఇప్పుడైనా ఆమె పక్కనే ఉండి, ఆమెని నా చేతులమీదుగా సాగనంపాలని ఉంది, అంతే’,

‘ సరే, మంచిదే, కానీ మీ వయస్సు కూడా తక్కువ కాదని గుర్తుంచుకోండి. మీ గురించికూడా మీరు జాగ్రత్త వహించటం మర్చిపోకండి. సరేనా? రోజూ నాతో వీడియో కాల్ లో మాట్లాడాలి. పరిస్ధితులు బాగైతే నేను కూడా వచ్చి పోతూ ఉంటాను’.

చివరికి ఆరోజు రానే వచ్చింది. పరంధామం రెండవ డోసు కూడా తీసుకొని ఇండియాకి బయలు దేరారు. వెళుతూ కొడుకులతో, ‘ నేను మా అమ్మ కోసం వెళుతున్నాను. మీరు మీ అమ్మని జాగ్రత్తగా చూసుకోండి’ అని తన భార్యని ఆమె కొడుకులకప్పచెప్పి బయలు దేరారు.

ఇంటికి చేరి, స్నానాదికాలు ముగించుకొని తల్లిని పలకరించి తనతోనే ఇక ఉండబోతున్నాని చెప్పి, ఆమె తృప్తిగా చూసే ఆ చూపుతో తను సరైన నిర్ణయమే తీసుకున్నానని నిర్ధారించుకున్నారు. రమణకు ఇస్తానన్న ఐదు లక్షలు అతని అకౌంటుకు పంపి, తనతో తీసుకు వచ్చిన జీను పాంట్ పోలో టీ షర్టు ఇచ్చి అతన్ని పంపేశారు.

రోజూ, తల్లికి రకరకాల వంటలు చేసి తినిపిస్తూ, చుట్టాలతో వీడియోలో మాట్లాడిస్తూ, విష్ణు సహస్ర నామంతో నిద్ర లేపి లలితా సహస్రంతో నిద్ర పుచ్చేవారు. భారతం, రామాయణం, భాగవత కథలు చదివి వివిపిస్తూ, మధ్య మధ్య తండ్రిని, తమ్ముడిని తలచుకుంటూ ఒక నెల రోజులు ఇద్దరూ సంతోషంగా గడిపారు. తల్లిని అడిగి ఆమె చేసే వంటల తయారీ విధానం చెప్పమని అవి తను తయారు చేసి, సునీతకు వీడియోకాల్ చేసి చూపిస్తూ,

‘సునీ, ఈ కూర చూశవా? అమ్మ చెపుతుంటే చేశాను. మా చిన్నప్పుడు ఈ కూర అమ్మ చేస్తే నేను చక్రం మొత్తం అవగొట్టేవాళ్ళం, తెలుసా?’
‘తెలుసు, చాలాసార్లే విన్నాను కానీ, అత్తా, మీరు తినిచూశారా!’
‘బాగానే ఉంటుందిలే, ఎంతైనా నా కొడుకు బంగారం’
‘మరే, అందుకే, మీ మొహం అలా వెలిగి పోతోంది. మీ ఇద్దరూ జాగ్రత్త, కబుర్లలో పడి సమయానికి మందులేసుకోవటం మరచిపోకండి.’ అంటూ ముగించింది.

ఇలా గడిచిపోతూ ఉండగా, అనుకోకుండా ఒకరోజు తల్లికి అస్వస్థత చేయటంతో ఆసుపత్రకి తీసుకుపోక తప్పలేదు. ఆమె మూత్రపిండాలు రెండూ పాడవడంతో ఆమెకు డయాలసిస్ మొదలుపెట్టారు. కరోనా రోజుల కారణంగా ఆసుపత్రి లోని అన్ని ఇతర సేవలు నిలిపి వేశారు. అందరూ కరోనా రోగులతోనే హడావుడిగా ఉండటంతో తల్లికి తనే దగ్గరుండి సేవలు చేయాల్సిన పరిస్ధితి. తను డాక్టరు కూడా కావటంతో, రాత్రింబగళ్ళు తల్లికి ఉపచారాలు చేస్తూ, అవసరాలు చూస్తూ, తినీ తినక గడపసాగారు.

ఈ హడావుడిలో తన ఆరోగ్యంలో వచ్చిన మార్పులు గమనించలేదు. షుగరు, రక్త పోటు పెరగటం తో పాటు, ఆకలి చచ్చి పోవటం, వాసన తెలియకపోవటం, సన్నటి దగ్గు తెరలు తెరలుగా రావటం, విపరీతమైన నీరసంతో కూర్చున్న చోటే నిద్ర పోవటం గమనించుకోలేదు. ఆ రోజు వచ్చిన డాక్టరు, పరంధామంగారిని చూస్తూనే ‘సార్, మీకు జ్వరం ఉందా?’ అంటూ, పల్సు చూసి’నాతో రండి’ అని తీసుకు పోయి, కరోనా పరీక్ష దగ్గర నుంచి అన్ని చేసి, ఆయనకి కరోనా, జాండిస్ కలిసి వచ్చాయని తేల్చారు. చక్కెర వ్యాధి , రక్త పోటు కూడా పెరగడటంతో ఆయన ఆరోగ్యం త్వరగా పాడవ సాగింది. కాలేయం వాచి, విపరీతమైన నొప్పితో బాధ పడసాగారు. ఆయనను కరోనా వార్డులోని ప్రత్యేక గదికి పంపి వైద్యం మొదలు పెట్టారు.

ఇది తెలిసిన సునీత, పిల్లలు ఇండియా వచ్చి, ఆయనను తీసుకు పోవాలని, లేదా మెరుగైన వైద్యం చేయించాలనీ ప్రయత్నించారు. కానీ, అన్ని దేశాలు విమాన సర్వీస్లను రద్దు చేయటం వలన నిస్సహాయంగా ఉండిపోయారు.

రెండు రోజుల తరువాత తల్లి మరణవార్త విని తృప్తితో గట్టిగా ఊపిరి తీసుకున్నారు, పరంధామంగారు. ఎందుకంటే తన తరువాత తల్లి ఎలా ఉంటుందో అన్న బాధ తప్పినందుకు. సునీతకు విషయంచెప్పి, తన పరిస్ధితి కూడా బాగా లేదని కాలేయం పూర్తిగా దెబ్బతిన్నదని, కోలుకునే అవకాశం లేదని, తన శరీరాన్ని పరిసోధన నిమిత్తం రాసేశానని, ఎవరూ రావద్దని చెప్పారు. తల్లి అంతిమ యాత్రకు కూడా ముందే ఏర్పాటు చేసినట్లు చెప్పి శెలవు తీసుకున్నారు.

సునీత, కొడుకులు చర్చించుకొని పరంధామంకు చిరకాల స్నేహితుడూ, కాలేయ నిపుణుడు అయిన డాక్టర్ మాధ్యూస్ను కలిసి, విషయంవివరించి సాయం చేయమని కోరారు. ఆయనతో ఇండియాలోని ఆసుపత్రి డాక్టర్లతో ‘జూమ్’ ద్వారా సమావేశం ఏర్పాటు చేశారు. మధ్యూస్ గారు పరిస్ధితినంతా అడిగి తెలుసుకుని, వారి వైద్య ప్రక్రియనంతా అవగాహన చేసుకుని, ఆయన కొన్ని సలహాలు ఇచ్చి చేయవల్సిన వైద్యంలో కొన్ని మార్పులు సూచించారు. పరిస్ధితి కొంచెం విషమమే అయినా ఫలితం కనిపించవచ్చని చెప్పారు. కావలసినవన్ని ఏర్పరచుకొని, మర్నాటినుంచే మార్పులు చేయటానికి నిర్ణయించుకున్నారు వైద్యులు.

కానీ, మనమొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుందన్నట్లు అనుకోని విధంగా పరిస్ధితి విషమించి, తెల్లవారు ఝామున ఏ హడావుడి లేకుండా తన కన్న తల్లిననుసరిస్తూ పరంధామంగారు కూడా ఆ పరంధామానికి పయనమై పోయారు.

పరంధామంగారి మరణం ప్రతి ఒక్కరికీ ఒక కనువిప్పయింది. వాక్సిన్ వేసుకున్నా కరోనా అనే రాకాసి నుంచి రక్షించుకోవాలంటే జాగ్రత్తలను పాటించటమొకటే మార్గమని, నిర్లక్షం చేయకూడదని తెలిసి వచ్చింది.

-బి. వి. లత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో