స్నేహం(కవిత)-కాపర్తి స్వరాజ్యం

 

 

 

 

పేగుబంధం కాకపోయినా
ప్రేమను పంచేది
రక్త సంబంధం లేకపోయినా
మన కోసం తపించే ది
మంచి లో చెడు లో
మనలను వీడకుండా ఉండేది
మాటలను నేర్పించి
మౌనాన్ని విడిపించేది
మార్గదర్శకత్వం చేయించి
గురువుల నిలిచేది
కష్టాలను పంచుకొని
సుఖాలను కలిగించేది
ఏ బంధం వేయని ముడియై
కొత్త బంధమై నిలిచేది
మరపురాని మధుర మయై
మనలను నిరంతరం కవ్వించేది
నిదురించే స్వప్నంలో నైనా
కన్నీరు కార్చనీయ నిది
దారి తప్పిన ఆలోచనలను
దరిచేర్చి కడలియై
దాగిఉన్న ఆశలకు
కొత్త రెక్కలు తెప్పించేది
కోపగించిన వీడనిది
మలినం లేని మనసు కలది
తనువులు వేరైనా
ఆత్మ ఒక్కటే యయి నిలిచేది
ఆలోచనలకు అందని
అద్భుతాలు సృష్టించేది
అహర్నిశలు శ్రమించిన
అలసట రానీయకుండా చేసేది
నిద్రరాని కనులకు
కథలు చెప్పి నిద్రపుచ్చేది
అమ్మలా లాలించేది
నాన్నలా బుజ్జగించేది
తోబుట్టువుల ఓదార్చేది
తోడు లా సహకరించేది
కలకాలం తోడై ఉండేది
మరణం లోనైనా మరవనిది
అపనిందలు ఎదురైన జడవనిది
ఆఖరి క్షణం వరకు కలిసుండేదే స్నేహం

-కాపర్తి స్వరాజ్యం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో