జనపదం జానపదం- 18- లంబాడ ప్రజల జీవన విధానం, ఆచారాలు, సంప్రదాయాలు-భోజన్న

ISSN – 2278 – 478

అడవికి సమాజ జీవనానికి సంధాన కర్తలుగా లంబాడి ప్రజలని చెప్పవచ్చు. ఈ తెగ వారు అటు అడవిలోను జీవించగలరు, ఇటు నాగరిక జీవనంలోను తమదైన ముద్రను వేయగలరు. ఆదిమ కాలం నుండి ఆధునిక కాలం వరకు అనేక ఆటుపోట్లను, అలజడులను, అక్రమాలను, అన్యాయాలను చవి చూసి నేడు తమకంటూ చరిత్ర సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకునే దిశగా అడుగులు వేస్తున్నారనడం అతిశయోక్తి కాదు.

వీరు అడవిలోనూ, నాగరిక సమాజంలోనూ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. నిజాం రాజును బెదిరించడంలోను వీరి పాత్రను అందరూ స్మరించుకోవాల్సినదే. ఈ విషయాన్ని దాశరధి రంగాచార్య ,”చిల్లర దేవుళ్ళు” నవలలో విశేషంగా ప్రస్తావించారు. నిజాం నిరంకుశత్వంలో బలి అయిన వారిలో అనేక క్రింది తరగతి కులాలు ఉండగా, వారితో పాటు ఎక్కువ శ్రమను, త్యాగాలను చేసిన తెగ సుగాలి తెగగా చెప్పవచ్చు. లంబాడీలను బంజారా, వంజారీ, లంబాడి, బ్రింజారీ, లబానీ, లంబాడా, లంబాడీలు అంటారని థర్ స్టన్ తెలియజేశారు.

లంబాడి తెగను తెగువకు మారుపేరుగా చెప్తుంటారు. ఆజానుబాహువులుగా ఉంటూ ధైర్యసాహసాలను ప్రదర్శించడంలో ఈ తెగకు ఈ తెగనే సాటిగా చెప్పాలి. ఆడవారు అందంలోనూ, అలంకరణలోనూ, శ్రమలోనూ తమకంటూ సొంత గుర్తింపును సంపాదించుకున్నారు. మగవారు బ్రిటిష్, నిజాం సైనికులతో పోరాటం చేయడంలో కాని, వారిని హతమార్చడంలో కాని తగినంత తెగువను చూపారు. దాని ఫలితంగా నేరస్తుల తెగగా బ్రిటిష్, నిజం చేత నుండి అనేక సమస్యలను అవస్థలను పొందారు, అసువులు బాసిన వారు కూడా ఉన్నారు. బ్రిటిష్ వారు criminal tribe act అమలులోకి తెచ్చి, ఈ తెగను దాని పరిధిలోకి తీసుకెళ్ళారు. వీరి శరీర దారుఢ్యాన్ని, తెగువను చూసి లాంగ్ బాడీస్ అని పిలిచేవారు, ఇలా పిలవడం వలనే లంబాడి అనే మాట వచ్చిందని కొందరి వాదన.

‘‘వనచరులే వంజారాలయ్యారనీ, వంజారాలే వంజరులయ్యారనీ, వారే బంజారాలుగా పిలువబడుతున్నారని’’ (ముందుమాట, కసిరెడ్డి వెంకట రెడ్డి, 1995, కరీంనగర్ జిల్లా లంబాడీల ఆచార వ్యవహారాలు, జనపాల శంకరయ్య). లంబాడీల సంస్కృతిలో అనేక రకాల జీవన విధానం మనకి కనిపిస్తుంది. వారి ఆహార అలవాట్లు, దేవతా పూజలు, శ్రమ జీవనం, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు మొదలైన ప్రతి అంశము మిగతా దేశాలతో పోల్చి చూస్తే ఒకింత భిన్నంగానే కనిపిస్తాయి. లంబాడి స్త్రీల ఎంబ్రాయిడరీ పనితనం చూడ ముచ్చటగా ఉంటుంది. రంగురంగుల మరియు బంగారం, వెండి మరియు బీడ్స్ తో తయారు చేసిన ఆభరణాలను వీరు ధరిస్తారు. వీరు ధరించే వస్త్రాలపై ఎంబ్రాయిడరీ వీరికి వీరే స్వయంగా చేస్తున్నారు. అంతేకాకుండా బట్టలు, స్కర్ట్లు, ఫెట్టయా, రవికలు (వంచులు), ఓనీ, మేలిముసుగు (టుక్రి) తయారు చేసుకుంటారు.
బంజారాలో తురక లంబాడి, సిక్కు లంబాడా మొదలైన రకరకాల లంబాడి ప్రజలు కనిపిస్తారు. తురక లంబాడా గుజరాత్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లో ఉన్నారు. వీరు 1947లో పాకిస్తాన్, కరాచీ, సింధు మొదలైన చోట్ల స్థిరపడ్డారు. ఉర్దూ, హిందీ, లంబాడా, సిక్కు, మరాఠీ మొదలైన భాషలు మాట్లాడతారు.
లంబాడాలలో ప్రముఖులు రామ్ సింగ్ భావనత్ (పద్మశ్రీ అవార్డు గ్రహీత), విక్రమ్ (ఎవరెస్టు అధిరోహణ), వసంత రావ్ నాయిక్ (మాజీ ముఖ్యమంత్రి), యతిరాజ్ (సినిమా యాక్టర్), మాలోతు పూర్ణ (ఎవరెస్ట్ అధిరోహణ), లాల్చంద్ రాజ్పుత్ (క్రికెటర్), శేఖర్ లక్ష్యం నాయక్ (క్రికెటర్ ),కే.టి. రాథోడ్ (మంత్రి), డాక్టర్ వెంకట లక్ష్మమ్మ (భరత నాట్యం), జీవన్ మిల్క్ సింగ్ రాథోడ్ ( హాకీ), మిల్క్ సింగ్ (పరుగు పందెం), బాయ్ లఖీ రామ్ బంజార్ మొగల్ కాలంలో (సివిల్ కాంట్రాక్టర్, వ్యాపారం).

లంబాడాలు దూరంగా ఉన్నా వారి గోత్ర నామాలను బట్టి సోదరి, సోదర భావాలతో మెలుగుతారు, వీరి గోత్రమే వీరందరిని ఏక తాటిపై తెస్తుంది. లంబాడాలు సంతలలో గాని, బంధువుల ఇంట్లో కలిసినప్పుడు ఏ కారణం లేకుండానే ఏడుస్తారు, ఈ ఏడుపు సంప్రదాయంగా అనాది కాలం నుండి వస్తుంది. పశువులను మేపుతూ వెళ్లిన వారు కొందరు మాత్రమే తిరిగి ఇంటికి వస్తారు, దీనిని తలుచుకొని సందర్భం దొరికినప్పుడ్ల ఏడుస్తూ ఉంటారు. ‘‘ఉప్పు అమ్మడానికి మరియు ఇతర వ్యాపారాల కోసం వెళ్ళినప్పుడు, పాట రూపంలో బాధలు, గాథలను వారు చేసిన మంచి పనులను తలచుకొని ఏడుస్తారు’’ (పాడ్య సుమన్ 29 సంవత్సరాలు, తొర్రూరు, మహబూబాబాద్ జిల్లా). పూర్వం చాలా రోజులు ఒకరికొకరు కలిసేవారు కాదు ఎప్పుడైనా కలిస్తే ఈ సంప్రదాయం పాటిస్తారు.

లంబాడీలు గిరిజనుల్లో 28 వ తెగగా హైదరాబాదులోని బంజారాహిల్స్ వీరి పూర్వీకుల దేనని ఒక వాదన ఉంది. ఆడబిడ్డలు అత్తగారింట్లో అత్తమామలు, తోడికోడళ్ళు పెట్టిన ఇబ్బందులను తల్లిదండ్రులకు పాట రూపంలో వినిపిస్తారు. వీరి ఆహారం ఇతర కులాలు, మతాలకు భిన్నంగా ఉంటుంది. రాగి, జొన్న అంబలి, జొన్న గట్టుక, అతి పలుచనైన చపాతితో శాఖాహారం, మాంసాహారం తింటారు.

తండాలోకి కొత్తవారిని పూర్వం అనుమతించే వారు కాదు, వీరి భాషపై, భావజాలంపై ఎవరి ఆధిపత్యాన్ని అనుమతించరు. లంబాడాలు మేరమ్మ, త్వల్జ భవాని, సీత్ల, మంత్రల్, హింగ్ల, ద్వాళ్ అంగళ్, కంకాళీ మొదలైన దేవతలను పూజిస్తుంటారు. మేరమ్మకు వర్షాలు పుష్కలంగా కురియాలని, పంటలు బాగా పండాలని, అమ్మాయిలకు మంచి సంబంధాలు దొరకాలని, త్వల్జ భవానిని నవధాన్యాలు గాదెల నిండా నిండాలని, సీత్లా దేవతని పశువులు సుభిక్షంగా ఉండాలని, మంత్రల్ దేవతను అంటువ్యాధులు సోకకుండా ఉండాలని, హింగ్ల దేవతని గర్భంలో ఉన్న మహిళకు సుఖ ప్రసవం జరగాలని, తల్లిపిల్ల సంరక్షణ భాధ్యత ఈ దేవతలకు అప్పగిస్తారు. ధ్వాళ్ అంగాళ్ దేవతను అడివిలోని జీవజాలం బాగుండాలని, ఏ కీడు వాటికి జరగకూడదని కొలుస్తుంటారు. వీరు పాలపిట్టకు ప్రత్యేక గౌరవం ఇస్తారు, పాలపిట్ట తండకు వచ్చి కనబడితే తండాకు మంచి జరుగుతుందని నేటికి నమ్ముతారు.

కంకాళి దేవతను ధాన్య రాశులపై, పశుసంపదలపై ఎలాంటి దాడులు జరగకుండా ఉండాలని కొలుస్తారు. వీరి ఆచారాలలో బరో పురాకరేర్ (కన్యాశుల్కం), వరుని దేహదారుఢ్య పరీక్ష, ఢాతలో (వధువు ఏడ్చే సంప్రదాయం నేర్పడం), మళేరో (అందరిని తలచుకొని దుఃఖించడం), గోట్ (విందు) కుటుంబ సేవ మొదలైనవి కనిపిస్తున్నాయి.

లంబాడీలు పెండ్లిళ్లు, హోలీ, మొదలైన ఉత్సవాలలో నృత్యం చేస్తారు. నృత్య రూపాల్లో తెలంగాణ లంబాడీల నృత్యం సమున్నత స్థానాన్ని ఆక్రమించింది. లంబాడీలు ఉత్తర ప్రాంతం నుండి వచ్చి తెలుగు నేలలో స్థిరపడ్డారని తెలుస్తుంది. వీరి ఆహారం చాలా పౌష్టికంగా ఉంటుంది, రకరకాల పండుగలలో శరీరానికి మంచి చేసే పోషకాహార పదార్థాలను తయారు చేసుకుని ఆరగిస్తారు. ఈ తెగలోని పురుషులు తలపాగా, తెల్లని ధోవతి, అంగి ధరించగా, మహిళలు అద్ధాలతో చేయబడిన దుస్తులను ధరిస్తూ ఉంటారు. మహిళలు మోచేతి వరకు, ఆపై వరకు కూడా తెల్లని ఈ గాజులు వేసుకుంటారు. అద్ధాలతో చేయబడిన దుస్తువులు క్రుర మృగాల దాడుల నుండి తప్పించుకోవడానికి సహకరిస్తాయి అని చెప్పుకుంటారు.

-భోజన్న

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో