ఏకశిలా స్తంభం(కవిత ) – తేళ్లపురి సుధీర్ కుమార్

 

 

 

 

ఎప్పుడూ నువ్వనేదానివి కదా నాతో
ఎప్పటికైనా పుణ్యస్త్రీగానే వెళ్లిపోవాలని –

అనుకున్నట్టుగానే వెళ్లిపోయావు కదా
నన్నిలా హఠాత్తుగా ఒంటరివాడిని చేసి
అమాంతం అనంతశూన్యంలోకి విసిరిపారేసి

నీకు గుర్తుందా ?

నాడు తలుపుచాటు నుండి
నువ్వు చూసిన తొలిచూపులతో
మన మనసులు ముడిపడి
సప్తపదితో మొదలై
సప్తపదుల వరకూ సాగిన
మన సంసార సాగర సంగమానికి
నేటికి నలభై వసంతాలు –

తొలిరేయినాడు నీవన్నమాట గుర్తుందా ?

పూటగడవని మనజీవితాలు
చక్కబడేవరకూ
ఆధారంలేని మన బతుకుల్లో
మరోభారం అప్పుడే పడకూడదని
సున్నితంగా నువ్వు సూచించినప్పుడే
నాకు తెలిసింది
అసలైన సంసార సుఖమంటే ఏమిటో –

కారణం తెలీని కన్నవాళ్ళు
నరంలేని ఎన్నో నాలుకలు
ఎంతకాలమైనా పిల్లలు లేరని
నిష్కారణంగా నిందిస్తున్నప్పుడు
మౌనంగా నువ్వుమాత్రమే భరిస్తూ
నన్నుమాత్రం నలుగురిలో
నిటారుగా నిలబెట్టావు
ఇదంతా నీ గొప్పదనమే కదా –

కాలం కలిసొచ్చి
చక్కబడిన మన జీవితాల్లో
బంధం మరింత చిక్కబడి
అనురాగపు వలపు చినుకులు కురిసి
మనప్రేమకు ప్రతిరూపం
పురుడుపోసుకున్న క్షణంలో
నీ కళ్ళలో మెరిసిన ఆనంద భాష్పాలు
ఇప్పటికీ నాకళ్లలో సజీవంగా
కదలాడుతూనే ఉన్నాయి –

అప్పుడేకదా
పిడుగుపాటుకు పెనువృక్షం నేల కూలినట్టు
మృత్యుశకటం నా వెన్ను విరిచేసింది –
దీనంగా మంచాన పడివున్న నాలో
ధైర్యాన్ని నూరిపోసి
ఏకశిలా స్తంభంలా
నాటి నుండి ఇంటిని నిలబెట్టింది నీవే కదా –

ఇప్పుడు నీవు
కట్టెల్లో కాలిపోయాకే తెలిసింది
నేను వెన్నులేని వాడినని
నా కంటిదీపం ఆరిపోయాకే అర్థమయ్యింది
నా ఇంటి స్తంభం నేలకొరిగిందని

ఒక్కటి మాత్రం నిజం
నన్నిలా నిర్దాక్షిణ్యంగా వదిలేసి
వెళ్లిపోయిన నీకు
ఆనంతపుణ్యఫలం దక్కిందేమో కానీ
నిన్ను కోల్పోయిన నాకు
అంతులేని శోకం మాత్రమే మిగిలింది..!

– తేళ్లపురి సుధీర్ కుమార్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో