జ్ఞాపకం- 62 – అంగులూరి అంజనీదేవి

అటువైపు వెళుతున్న సంలేఖ చూసి “ఏమైంది అన్నయ్యా? వదిన ఏమైనా అన్నదా?” అంటూ దగ్గరికి వెళ్లింది.

రాజారాం అప్రయత్నంగా ఒక నవ్వు నవ్వి సంలేఖ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.
“అదేం లేదు లేఖా! ఇప్పుడే పత్రికలో వచ్చిన నీ కథ చదివాను. బాగుంది. నువ్వు కథలు రాయడం చూసి నాన్న చాలా సంతోషపడుతున్నాడు. ఈమధ్య కాలంలో నాన్న ముఖంలో అంత సంతోషాన్ని నేనెప్పుడూ చూడలేదు. నాన్నకి నావల్ల ఒకరకమైన దిగులైతే తిలక్ వల్ల ఇంకోరకమైన దిగులు. మా ఇద్దరివల్ల రాని ఆనందం ఆయనకి ఇప్పుడు నీద్వారా వస్తోంది. నాన్న వున్నంత వరకు నువ్వు ఎట్టిపరిస్థితిలో కథలు రాయడం ఆపనని నాకు మాట ఇవ్వు” అంటూ చేయి చాపాడు.

అన్నయ్య చేతిలో చేయివేసి “ఆపను అన్నయ్యా!” అంది వెంటనే.

“నువ్వు రాస్తున్న కథలకి పి.జీ లు, పి.హెచ్. డి లు చెయ్యనవసరం లేదు. జీవితాలను చదివితే చాలు. అది నీలో పుష్కలంగా వుంది. ఇంకా మంచి మంచి కథలు రాయాలి నువ్వు” అని ప్రోత్సహించాడు.
అలాగే అన్నట్లు తలవూపింది సంలేఖ.

”ఒక్కటిమాత్రం గుర్తుంచుకో సంలేఖా! మన ముఖాలు వేర్వేరుగా వున్నట్టే, మనసులు కూడా వేరుగా వుంటాయి. అయినా మనందరం సంతోషమనే గమ్యం కోసమే ప్రయాణిస్తాం. కానీ ఏ ఇద్దరం ఒకేదారిలో ప్రయాణించం” అన్నాడు.

ఆ మాటలు వింటూ అక్కడికొచ్చిన వినీల అన్నాచెల్లెళ్లను చూడగానే ముఖం మాడ్చుకుంది.
“ఏం ముఖాలో, ఏం ప్రయాణాలో, ఏం గమ్యాలో. ఈ హెడ్ సెట్ ని దాచుకొని పాటలు వినలేక చస్తున్నా. ప్రపంచంలో వుండే స్వేచ్ఛలో ఒక్క ఇంచ్ స్వేచ్ఛకూడా నాకు లేదు” అంటూ గొణుక్కుంటూ వెళ్లిపోయింది.

సంలేఖ అన్నయ్య చెప్పే మాటల్ని వింటూ అక్కడే కూర్చుంది.

మాటల మధ్యలో జయంత్ గురించి చెప్పింది.

రాజారాం ఆ రాత్రికే జయంత్ విషయం తల్లిదండ్రులతో మాట్లాడాడు.

సంలేఖ నిర్ణయాన్ని తల్లిదండ్రులతో చెప్పాడు రాజారాం.

సులోచనమ్మ కొడుకు చెప్పింది విని, భర్త ఏం మాట్లాడతాడో వినాలన్నట్లు మౌనశ్రోతలా అక్కడే కూర్చుంది.

రాఘవరాయుడు “చూద్దాంలే రాజా! తొందరేముంది?” అన్నాడు.

తండ్రి ఎందుకలా అంటున్నాడో అర్థంకాలేదు రాజారాంకి.

కొడుకు మౌనంగా వుండటం చూసి “నీకు నడక వచ్చాకనే చెల్లికి పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను రాజా! ఎందుకంటే శుభకార్యం కాబట్టి అందరూ వస్తారు. నిన్నిలా చూసి, వాళ్లు చూపించే సానుభూతిని నువ్వు తట్టుకోలేవు. నేనూ, మీ అమ్మకూడా భరించలేం. వినీల బాధపడుతుంది. చూస్తున్నావుగా నీకు జరిగిన యాక్సిడెంట్ వల్ల మన ఇంటి వాతావరణంలో వచ్చిన మార్పుల్ని? ఇంకా ఎందుకు చెప్పు?” అన్నాడు రాఘవరాయుడు.

“సానుభూతిదేముంది నాన్నా! పైసలతో ఖర్చులేని పని అది. విధి వక్రించిన వాళ్లపై ప్రయోగించి విసిగిస్తుంటారు. దానివల్ల ఏమొస్తుంది చెప్పు. డబ్బురాదు. పడుతున్న బాధపోదు. ఇక మార్పులంటారా? అవిలేని ఇల్లు వుందా? కాకపోతే నాకు జరిగిన ఈ యాక్సిడెంట్ మనకో పీడకల అయింది. నాకోసం మీరు పడుతున్న బాధను చూడలేకపోతున్నాను. నేనేమో చావకుండా బ్రతికి నరకాన్ని అనుభవిస్తున్నాను” అన్నాడు బాధగా.

సులోచనమ్మ విలవిల్లాడుతూ వెంటనే లేచి రాజారాం నోరుమూసింది.

“అలా అనకు నాన్నా” అంది.

తల్లి చేతిని తొలగించి “కాకపోతే నాన్న అనేది ఎలా వుందో చూడమ్మా! మనసును రాయి చేసుకుని బలంగా నిలబడాల్సిన సమయంలో ఎవరో చూపించే సానుభూతికి భయపడటం దేనికి? చెల్లి పెళ్లి ఆపుకోవటం ఎందుకు? నాకు నడక వచ్చేంత వరకు జయంత్ పెళ్లిచేసుకోకుండా ఆగుతాడా? తొందరపడాల్సిన టైంలో తొందరేముంది అంటాడేం?” అన్నాడు.

కొడుకు మాటలు సత్యాలే అయినా నిస్సహాయగా చూశాడు రాఘవరాయుడు..

రాజారాం తండ్రిని అర్థం చేసుకున్నాడు.

ఏళ్లతరబడి నీళ్లలో వున్నా రాయి మెత్తబడనట్లు ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన తట్టుకుంటూనే వున్నాడు. రోజు ఆయనలో ఒకప్పుడు వున్న ఆత్మవిశ్వాసం లేదు. కత్తివేటుకి కిందపడ్డ కొమ్మలా వున్నాడు.
తండ్రి ఎందుకలా వున్నాడో రాజారాంకి తెలుసు. ఆయన దగ్గర డబ్బుల్లేవు. తన సంపాదనంతా తీసికెళ్లి తన భార్య వినీల చీటర్స్ చేతిలో పోసింది. మొద్దు పోలయ్య పసరు వైద్యంతో తనకి కాళ్లు రావని తెలిసి డాక్టర్ల సలహాతో తాతయ్యవాళ్ల సమాధులు కట్టించాల్సిన డబ్బుతో తనకి ఫిజియోథెరపి వైద్యం చేపిస్తున్నాడు.

“ఆ డబ్బుల్ని వాడితే నువ్విక మీ అమ్మా, నాన్నల సమాధుల్ని కట్టించలేవు నాన్నా!” అని తనెంత చెప్పినా వినలేదు.

“నా కళ్ళకు కన్పించని నా కన్నవాళ్ల సమాధులకన్నా కదల్లేని స్థితిలో నరకాన్ని అనుభవిస్తున్న నా కన్నకొడుకు కాళ్లు ముఖ్యం రాజా! నువ్వింకేం మాట్లాడకు” అన్నాడు.

పసితనంలో తను అడుగులేస్తే చూడాలని ఎంత ఆత్రుతపడ్డాడో తనకి తెలియదు కాని ఈ రోజు తన తల్లిదండ్రులు ప్రతిరోజు తన కాళ్లను తడుముకుంటూ ఎప్పుడెప్పుడు నడుస్తాడా అని ఆరాటంగా ఎదురుచూస్తున్నారు. కాలం కొట్టిన దెబ్బకి డస్సిపోయి కన్పిస్తున్నారు. ఈ స్థితిలో సంలేఖ పెళ్లంటే?
“పొలం అమ్మి సంలేఖ పెళ్లిచేద్దాం నాన్నా!” అన్నాడు రాజారాం.

రాఘవరాయుడు, సులోచనమ్మ నిర్ఘాంతపోయారు. ఆ తర్వాత మామూలుగా అయ్యారు.
“పొలం అమ్మడమంటే ఎందుకో మనసొప్పటంలేదు రాజారాం! మేం పెద్దవాళ్లమయిపోతున్నాం. ఆ ఆధారం కూడా లేకుంటే కష్టంకదా! మనం కాస్త ఓపికపడితే సంలేఖను కట్నం ఇవ్వకపోయినా చేసుకునేవాళ్లు వస్తారు. చెల్లెలికేం తక్కువ? ఐశ్వర్యం లేకపోయినా అందం వుంది. పైగా రచయిత్రి” అన్నాడు రాఘవరాయుడు.

“కొన్నిమాటల్ని మన తృప్తికోసం మనం మాట్లాడుకుంటుంటాం. అవి సమస్యల్ని తీరుస్తాయా? ఏ ఆశా లేకుండా ఆడపిల్లని ఎవరు పెళ్లిచేసుకుంటారు? అలా చేసుకోవాలీ అంటే ఏ అనాదో, అవిటివాడో, అనామకుడో వస్తాడు. ఇన్నిరోజులు దాన్నంత ఇష్టంగా పెంచుకుని అలాంటివాళ్లకి ఎలా ఇస్తావు నాన్నా? దానికీ ఓ హోదా వద్దా? సెక్యూరిటీ వద్దా? మీరు పెద్దవాళ్లయితే మిమ్మల్ని చూసుకోటానికి నేను లేనా? ఎప్పుడూ ఇలాగే మంచంలో పడివుంటానా?” అన్నాడు.

(ఇంకా ఉంది)

 

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

144
జ్ఞాపకం, ధారావాహికలు, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో