రచయిత్రి తాయమ్మ కరుణ తో ముఖాముఖి -షఫేలా ఫ్రాంకిన్

తాయమ్మ కరుణ అనగానే మనకి గుర్తొచ్చేది సరళమైన భాషలో మనసుకు హత్తుకునే తన కథలు.
ఉద్యమం లో కొన్నేళ్ల పాటు చురుకైన పాత్ర పోషించారు. సమాజం లో స్త్రీల పట్ల అన్యాయాన్ని, శ్రమ దోపిడీని తన కథల ద్వారా ప్రశ్నిస్తూ ఆదివాసీ గిరిజన ప్రజల బతుకు చిత్రాలని వెలుగులోకి తెస్తున్నారు.
తన కథలు పాఠకుల్నే కాకుండా విమర్శకులను సైతం మెప్పించి కంటతడి పెట్టించాయి.

ఆమెని మన విహంగ పాఠకులకు ఈ ముఖాముఖిలో పలకరించడం చాలా సంతోషంగా భావిస్తున్నాం…

ప్రశ్న: మీ కుటుంబ నేపథ్యం గూర్చి మా విహంగ పాఠకులకు తెలియజేస్తారా?

మాది నల్గొండ జిల్లా నకిరేకల్‌ మండలం తాటికల్లు గ్రామం. ముగ్గురు అక్కాచెల్లెళ్లు, ఐదుగురు అన్నదమ్ములు. నాన్న మిర్యాల పరమేశం,అమ్మ తాయమ్మ. నాన్న 25 ఏళ్ళ పాటు ఊరి సర్పంచ్‌గా ఉన్నారు. చండ్ర పుల్లారెడ్డి గ్రూపులో చురుకుగా పని చేశారు. ఆయుర్వేద వైద్యం కూడా చేసేవారు. ఊరు ఊరంతా అప్పట్లో కమ్యూనిజం భావజాలంతోనే ఉండేది. నేను పుట్టకముందే మా ఇంటిపై పోలీసులు దాడి చేశారట. జనశక్తి ప్రభావం ఎక్కువ. నకిరేకల్‌ థియేటర్లలో రష్యా, చైనా, జర్మనీ దేశాల కమ్యూనిస్ట్‌ సినిమాలు వేసే వారు.అందరూ బళ్లు కట్టుకుని సినిమాలకు వెళ్లే వాళ్లు. సభలకు కూడా ఊరంతా తరలి వెళ్లేవాళ్ళు. అలా ఊహ వచ్చినప్పటి నుంచే ఎర్ర జెండాలు పట్టుకుని సభల్లో పాల్గొనటం అలవాటు.

2.మీరు ఉద్యమంలోకి ఎలా వెళ్లారు. మీ ఉద్యమ జీవితంలో పోరాట అనుభవాలను వివరిస్తారా?

సహజంగానే ఇంట్లో, చుట్టూ ఉన్న వాతావరణం వల్ల ఉద్యమం పట్ల ఆసక్తి కలిగింది, అందరూ పాండవుల్ని హీరోలుగా చూస్తే, నాకు మాత్రం కర్ణుడు హీరోలా అనిపించేవాడు. ఆడవాళ్ళ పట్ల ఎవరైనా చులకన చేసి మాట్లాడితే నచ్చేది కాదు. ఇలా చిన్నప్పటి నుండి స్వతంత్ర భావాలతో పెరిగాను. ఇంటర్ చదవడం కోసం హైదరాబాద్ రావడం, ఆ తర్వాత డిగ్రీ ఉస్మానియాలో చేరడం జరిగింది. అప్పుడే రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం జరిగింది, నాకో బ్రాహ్మణ స్నేహితురాలు ఉండేది, తను నన్ను అందులో పాల్గొనమని అడిగింది. కానీ, నేను నిరాకరించాను. మన్మోహన్ సింగ్ ఆర్ధికమంత్రి గా, పీవీ నరసింహారావు గారు ప్రధానమంత్రి గా ఉన్న టైం లో ఆర్థిక సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టారు. వాటిని మేమంతా తీవ్రంగా నిరసించాము.
అప్పట్లో అధికంగా ఉన్న వరకట్న సమస్య పై, మద్యం నిషేధం కోరుతూ నాటికలు, స్ట్రీట్ ప్లే లు కాలేజీల్లో, హాస్టల్స్, బస్తీలలో ప్రదర్శించి ప్రజల్లో అవగాహన కల్పించాము.
అలా చిన్నగా మొదలుపెట్టి తర్వాత ప్రత్యక్షంగా ఉద్యమంలోకి వెళ్ళాను.

3.కాళీపట్నం రామారావుగారినే ఏడిపించిన మీ ‘తాయమ్మ’కథల వెనుక మీ అనుభవాలను, సంఘర్షణలను గురించి వివరిస్తారా?
 నా చుట్టూ ఉన్న పరిస్థితులు, ముఖ్యంగా ఇంటిలో నాన్న కమ్యూనిస్ట్ అయినా అమ్మపట్ల చాలా చులకన భావంతో ఉండేవారు. అది నాకు అసంతృప్తిగా అనిపించేది.

నాతో పనిచేసే కామ్రేడ్ ఒకామె నేను రాసిన రెండు మూడు కవితలు చదివి నేను కథలు రాయగలనని ప్రోత్సహించింది. సంవత్సరం లోగా కథ రాయాలని మాట తీసుకొని సంవత్సరం తర్వాత మళ్ళీ అడిగింది. దాంతో తాయమ్మ కథ రాయడం మొదలుపెట్టిన. ఉద్యమంలో పని చేస్తున్నందు వల్ల ఏది రాసినా ఒక వ్యూ ఉండేది. వస్తువు పట్ల స్పష్టత ఉండేది.

నా మొదటి కథ ‘తాయమ్మ కథ’లో పితృస్వామ్య అణచివేతను ఎదుర్కొంటది. దానికి ఒక కారణం ఆమె ఆర్ధిక స్వాతంత్ర్యం కలిగి ఉండటం. ఆ ధిక్కారాన్ని సహించలేరు కాబట్టి ఆమె వడ్ల మిల్లును అమ్మేస్తారు. అప్పుడు తాయమ్మ తీవ్రమైన దుఃఖం, ఆగ్రహంతో దుమ్మెత్తి పోస్తూ తన (స్త్రీ జాతి) కష్టాలను ఏకరువు పెడుతో శోకాలు పెడుతూ ఏడుస్తుంది.

నిత్యం మన చుట్టూ జరిగే సంఘర్షణల్ని, అవి ఆదివాసీలవి అయినా, సాధారణ జనానివి అయినా కథలుగా రాసాను.

4.కథా సాహిత్యం రాయడానికి మీకు ఎవరైనా స్ఫూర్తి ఇచ్చారా?

డిగ్రీ అయిపోయాక B.ed చేస్తూన్న సమయంలో పైన చెప్పినట్టుగా పోరాటాల్లో పాల్గొంటూ పుస్తకాలు విస్తృతంగా చదివేదాన్ని.

ఉద్యమంలోకి పూర్తి కాలం కార్యకర్తగా వెళ్ళాక మంజీర (మఠం రవికుమార్) సాహచర్యం, IV సాంబశివరావు గారితో సాహిత్య చర్చలు.. కథలు రాయడానికి ఎంతో దోహదపడ్డాయి. నన్ను రచయిత్రిగా నిలిపాయి.

సాయంత్రాలు వాకింగ్కి తీసుకువెళ్లి మంజీర కేవలం సాహిత్యం, రాజకీయాలు చర్చించేవాడు.

మాస్టర్ గారు నాకు కొన్ని కథలు ఇచ్చి వాటిని చదివి అందులో నాకర్ధమైన విషయాన్ని చర్చించమని ప్రోత్సహించేవారు‌.
అదే సమయంలో నాకెంతో ఇష్టమైన రచయిత రావిశాస్త్రి గారు మరణించినప్పుడు ఆయన రాసిన ఆ సారా కథల్లోని “ముత్యాలమ్మ” అనే పాత్ర ఆయనకు నివాళి అర్పిస్తున్నట్టుగా ఒక ఆర్టికల్ రాసాను. అది అరుణతార బ్యాక్ కవర్ లో అచ్చు వేశారు.
అలా నా కథాప్రయాణం మొదలైంది.

5.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధన తర్వాత అట్టడుగు వర్గాల ప్రజల జీవితాల్లో మార్పు వచ్చిందంటారా?

అసలు తెలంగాణ కొట్లాడి తెచ్చుకుంది తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు కోసం.
నీళ్ళు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో తెచ్చుకున్నది. అంతేకాదు పరాయి పాలన నుంచి విముక్తి కూడా.

తెలంగాణా నక్సలైట్ ఉద్యమం వల్ల మునుపున్న భూస్వామ్య వ్యవస్థ రద్దవడం తో అట్టడుగు ప్రజలకు కొద్దిగా అయినా భూమి దొరికింది. భూస్వాములు గ్రామాల నుంచి పారిపోయిండ్రు (అయితే ఇప్పుడు మళ్లీ తిరిగి వచ్చారు. అది వేరే విషయం). విడిపోయినంక ఇప్పుడు గ్రామాల్లో నీళ్ళు వచ్చాయి. వ్యవసాయం చేయడం మొదలై ఆర్థిక పరిస్థితులు కొంత మెరుగయ్యాయి. విప్లవోద్యమ ప్రభావంతో ప్రజల తరఫున సాహిత్యం సృష్టించబడింది, ప్రజల్లో చైతన్యం పెరిగింది.

6.నేటి యువతకు,మహిళా సమాజానికి మీరిచ్చే సందేశం?

జవాబు : ప్రత్యేకంగా చెప్పేదేం లేదు, ఇప్పటి యువత అన్ని రంగాల్లో ముందున్నారు. టెక్నాలజీ పెరిగింది, అన్ని విషయాల్లో అవగాహన ఉంది.
కాకపోతే మహిళలకు చెప్పేది ఒకటే, మీ కాళ్ళ మీద మీరు నిలబడేలా మీకంటూ ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలి.
అలాగే యువత, మీ తల్లిదండ్రుల్నే కాకుండా వయసులో పెద్దవారిని కూడా గౌరవించండి.

7.డా.పుట్ల హేమలత గారితో మీ అనుబంధం గురించి వివరిస్తారా?

అక్క నాకు ప్రరవే ద్వారా పరిచయం, రాజమండ్రి యూనివర్సిటీ లో జరిగిన ప్రరవే మీటింగ్ లో నుండి మంచి స్నేహితులం అయ్యాం. చివరిసారిగా వైజాగ్ లో కలిసాము. చిన్నపిల్లల మనస్తత్వం అక్కది. మాములుగా పేరు, డబ్బు ఉన్నవాళ్ళు చాలామంది కొంత అంటీముట్టనట్టుగా ఉంటారు కానీ అక్కకి అలాంటి భేషజాలేమీ ఉండేవి కాదు. అందుకే అందరికీ తనంటే అభిమానం. నిజంగా తన మరణం సాహితీలోకానికి తీరని లోటు.

8. చివరిగా, మీ కలం నుండి రాబోయే రచనల గురించి తెలియజేస్తారా?

ప్రస్తుతానికి ఇంకా ఏమీ లేవు. ఈ కరోనా తగ్గినాక మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాను.

తమ విలువైన సమయాన్ని విహంగ కోసం వెచ్చించినందుకు కరుణ గారికి మా ధన్యవాదాలు.

-షఫేలా ఫ్రాంకిన్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ముఖాముఖి, , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో