“భయం” నాటకంలోసామాజికజీవనచిత్రణ (సాహిత్య వ్యాసం ) – నెమ్మలూరిభవాని

ISSN – 2278 – 478 

ఆత్రేయ అసలు పేరు కిలాంబి వెంకట నరసింహాచార్యులు. ఈయనది: 7-5-1921 న నెల్లూరుజిల్లా ,మంగళంపాడు గ్రామంలో, సీతమ్మ ,శ్రీకృష్ణమాచార్యులు దంపతులకు జన్మించారు. 1910 లోపద్మావతితో వీరి వివాహం జరిగింది. ఆత్రేయ 10 నాటకాలు ,15 నాటికలు , 400 చిత్రాలకి మాటలు పాటలు పద్య కవితలు అందించారు .వీరిరచనలు ఏడు సంపుటాలుగా వెలువడ్డాయి. జనం నోళ్లలో “మనసుకవి” ఆత్రేయస్థిరపడ్డారు.

“నాటకాంతహిసాహిత్యమ్”, అనడం వల్ల పూర్వులు నాటకానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్టు స్పష్టమవుతుంది. కాళి దాసు ‘మాళవికాగ్ని మిత్రం’ అనే నాటకం నాటకాన్ని “చాక్షుషమైన కతృవు”గా అభివర్ణించడం గమనార్హం. (డా.ద్వానాశాస్త్రి – తెలుగు సాహిత్య చరిత్ర (పూట సంక్ష – 660)) “నాటకాంతహికవిత్వమ్”, అని నాటక ప్రక్రియను ఉత్కృష్ట సృష్టిగా సంస్కృత పండితులు భావించారు. తెలుగు నాటక రచన దానివి కాసప్రదర్శనలు విదేశీయములగు పాశ్చాత్య ప్రభావం చేతనే వృద్ధిపొందినవి. పాశ్చాత్య నాగరికత ,సారస్వతం తెలుగు నాటకరంగ మనకు ఎంతగానో దోహదపడ్డాయి. 1860లో “మంజరీమధుకరీయం” అనుప్రకరణమును స్వతంత్రంగా రచించిన కోరాడ రామచంద్రశాస్త్రిగారే తెలుగు నాటక రచన గావించిన వారిలో ప్రథములని అని చెప్పవచ్చు. క్రీ.శ.1886 నుండి తెలుగు నాటక చరిత్రలో వికాస దశ ప్రారంభమైనవి. ఈ దశలోనే ఆధునిక నాటకములు బహుముఖంగా విస్తరించినవి. “పౌరాణికనాటకాలు, చారిత్రక నాటకములు సంచలనం తగ్గిన తర్వాత సాంఘిక నాటకము వెలువడినవి. వ్యావహారికభాషోద్యమం క్రమంగా నాటకములపై కూడా ప్రభావంచూపింది. ఆచార్య ఆత్రేయ రాసిన ఎన్. జి. ఓ., కప్పలు ,భయం అను నాటకములు భయానుమానములతోనూ ,అథఃపతనముతోనూ, సంఘర్షణ సాగించు సామాన్యుని మనస్తత్వము చక్కగా చిత్రించినవి”. ( నాగయ్యగూడూరి -తెలుగుసాహిత్యసమీక్షద్వితీయసంపుటి(పుట సంఖ్య-793)

సామాన్య మానవుని జీవనం :
మధ్య తరగతి కుటుంబంలో సాదాసీదా జీతంతో బ్రతికే సగటు మనిషి జీవితం గురించి, వాళ్లుపడే అవస్థ గురించి ఈ నాటకంలో స్పష్టంగా కనిపిస్తుంది. కష్టపడేవాడికన్నా ,కబుర్లు చెప్పి బ్రతికేవాడి కాలం ఎంత దర్జాగా నడుస్తుందో చెప్తూనే , శ్రమజీవికి ఎప్పుడూ కష్టేఫలి అని, దుష్టుడిదురాగతాలకి, కాలమే సమాధానం చెబుతుందని చక్కని పాత్రలతో సామాన్య మానవుని జీవనాన్ని చిత్రించారు ఆత్రేయగారు.

మధ్యతరగతి కుటుంబీకులు కష్టం :
కుటుంబం కోసం పగలు రాత్రి తేడా లేకుండా పని చేసే అకౌంటెంట్లాంటి శ్రమజీవులు తాముపడే బాధలు చెప్పుకోలేక ఎలాంటి మనోవ్యధను అనుభవిస్తారో నాటక ప్రారంభంలో తెలియజేశారు. అకౌంటెంట్పడే మనోవ్యధ అతని మాటల్లో తెలుస్తుంది.

అతని బాధను అర్థం చేసుకున్న మేనేజర్తన కష్టాన్ని చెప్పుకున్నాక అకౌంటెంట్‌తో పాటు పాఠకులు సైతం జాలి పడే విధంగా సగటు జీవులను ఆకట్టుకుంది ఈ నాటకం. మౌనంగా ఎవరు ఏది చెప్పినా కాదనకుండా పనిచేసే ముసలయ్యలాంటి మనుషులు అనుభవంతో అణిగి మణిగిపనిచేసే ఎందరో ముసలయ్యలకు ఆదర్శం అనే విధంగా ముసలయ్య పాత్రను ఈ నాటకంలో తీర్చిదిద్దారు ఆత్రేయ.

ఎదురుతిరగలేనినైజం :
కుటుంబం కోసం కష్టమైనా భరిస్తూ మౌనంగా పనిచేసే అకౌంటెంట్ ఒక పక్క అయితే, ఎందుకు మౌనంగా భరించాలని ఎదురు తిరిగేనైజం శంకర్‌ది. కుర్రవాడుగా ఉన్న శంకర్‌లో గల ధైర్యం, ముక్కు సూటిగా మాట్లాడేతత్వం, అన్యాయాన్ని ఎదిరించే స్వభావం ఇలాంటివన్నీ బహుశా అందరిలోనూ ఉంటే ప్రొప్రైటర్లాంటి మనుషుల ఆగడాలు ఉండవేమో అనే అభిప్రాయాన్ని శంకర్పాత్ర ద్వారా కల్పించారు ఆత్రేయగారు. ఎందుకంటే ఈ నాటకంలో కనిపించిన మేనేజర్కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని ఎదురు తిరగలేక ప్రొప్రైటర్చెప్పిన ప్రతి పని చేస్తూ ఉద్యోగానికే అంకితం అయిపోయికుటుంబంతో కాలం గడపలేకపోయాడు. ఫలితంగా ఏ భార్యా బిడ్డల కోసం తన జీవితాంతం కష్టపడ్డాడో అదే కుటుంబంలో దీపాన్ని పెట్టే తన భార్య సంతోషాన్ని కోల్పోయి పిచ్చిదానిలా మారిపోయింది. తన భార్యను చూసి అనుక్షణం దుఃఖించే స్థితికి చేరుకున్నాడు మేనేజర్.

శ్రమదోపిడీ :
తలవంచుకుని కుటుంబం కోసం అహర్నిశలు శ్రమించిన మధ్య తరగతి వారి కష్టం యజమానుల అభ్యున్నతికి దోహదపడుతుందే కానీ శ్రమజీవుల వృద్ధికి కాదు. అందుకు ఈ నాటకంలో మేనేజర్పాత్ర ఉదాహరణ. పి. ఎస్. లాంటి కాకా పట్టే మనుషులను నేటి కాలంలో ఎంతోమందిని చూస్తున్నాం. పని చేయకుండా యజమానులను మచ్చి కచేసుకుని కల్లబొల్లి కబుర్లు చెబుతూ హాయిగా కాలక్షేపం చేసి కష్టపడేవాళ్ళ పైన అజమాయిషీ చెలాయిస్తూ బతికేసే మనుషులే నేటి సమాజంలో ఎదుగుతూ ఉన్నారు.
ఇలాంటివాళ్ళని చూసినప్పుడు ఏదో ఒక రోజు కాలం వీరికి ఖచ్చితమైన సమాధానం చెబుతుందనిపిస్తుంది.  కుటుంబం కోసం కష్టపడిపని చేసే అకౌంటెంట్లాగానే కుటుంబం గడవక తప్పనిసరై, మరో దారి లేక పనిచేసే టైపిస్టు పార్వతి లాంటి వ్యక్తులను కూడా నేటి కాలంలో చూస్తూనే ఉన్నాం. కుటుంబాన్ని నడిపించడం కోసం పార్వతి ప్రొప్రైటర్లాంటి వాణ్ణి భరిస్తూ ఉద్యోగం చేస్తుంది. ప్రొప్రైటర్పనులు నచ్చకపోయినా తన ఆర్థిక స్థితి ఆమె పరిస్థితులను తప్పనిసరిచేసింది. ఇంటి ఆర్థికపరిస్థితుల కారణంగా అభిమానాన్ని చంపుకుని పని చేసినా, మనసుపడిన మనిషిని సొంతం చేసుకోవాలని ఆరాటపడి అందరిముందు తలవంచుకుని నిలబడాల్సిన స్థితికి వచ్చింది.

సామాన్యమానవులస్వభావం:

“భయంయుగంభయంయుగం
మహాభయంకరయుగం
అనుక్షణంమరణభయం
జీవనసంభరణభయం”( కొంగరజగ్గయ్య-ఆత్రేయసాహితీ 2, పుటసంఖ్య -235)

మేనేజర్భార్య మతిచలించినా, ఆమె మాట్లాడే ప్రతి మాట ఆమె వేదనను తెలియజేస్తుంది. పిల్లల్ని కని వారిని పెంచుతూ ,ఒంట్లోని శక్తినంతా పోగొట్టుకుని, భవిష్యత్తు బాగుంటుందని ఆశతో ఎదురు చూసి, చివరికి పిచ్చిదానిలా మారిపోయిన మేనేజర్భార్యలాంటి ఆడవాళ్లు చెప్పుకోలేని మానసిక వ్యధను అనుభవించే స్త్రీలు నేటి సమాజంలో ఎందరో. యజమానులు ఏదో ఉద్దరిస్తారని, జీవితాంతం పని చేసి భార్యాబిడ్డల్ని పట్టించుకోకుండా ఉండేవాళ్ళకి మేనేజర్పాత్ర, అతని భార్య పాత్ర , ఆలోచననురేకెత్తిస్తాయి. యజమానుల క్రింద పని చేసేపని వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారని తెలియజేసే విధంగా ఆత్రేయగారు ఈ నాటకంలో పాత్రలు చిత్రించారు. ప్రొప్రైటర్మనసు తెలుసుకుని ఏ ఎండకు ఆ గొడుగుపడుతూ పని చేసేపి. ఎస్., యజమాని ఏది చెప్పినా తలవంచుకుని పనిచేసే మేనేజర్, మనసుకు నచ్చకపోయినా మనిషిగా బ్రతకడం కోసం పని చేసే అకౌంటెంట్, క్యాషియర్‌గా పని చేస్తూ జ్యోతిష్యం చెబుతూ వీలుని బట్టి నడుచుకునే క్యాషియర్, పరిస్థితుల ప్రభావంతో పని చేసే టైపిస్టు పార్వతి, అనుభవంతో పని చేసే ముసలయ్య ఇలా ఎవరికి వారు తప్పని సరై కుటుంబ జీవనం కోసం పని చేసే మధ్య తరగతి మనుషుల “భయం”తో వాస్తవమైన సగటు వ్యక్తుల జీవనాన్ని చిత్రించారు ఆత్రేయ.

యజమానుల దౌర్జన్యాన్ని అరికట్టడం :
పనివాళ్ళభయం, బలహీనత యజమానుల ఆగడాలకు మరింత బలాన్ని చేకూరుస్తాయి. అందుకే ప్రొప్రైటర్తను ఎదిరించే వారు లేరనే ధైర్యంతో బోనస్‌లు ఇవ్వకపోయినా ఇచ్చినట్లు సంతకాలు చేయించుకున్నాడు. పార్వతి ఆర్థిక స్థితిని, బలహీనతని తన బలంగా మార్చుకున్నాడు. మాటలతో ఆమెను బెదిరించి శంకర్‌ను లొంగదీసుకోవాలి అనుకున్నాడు. కానీ శంకర్మనోధైర్యం పార్వతిలోనూ ధైర్యాన్ని తెచ్చింది. దానికి తోడు మేనేజర్భార్య మాటలు పార్వతిని బలంగా మార్చాయి.

ప్రొప్రైటర్దురాగతాల్ని భరించలేని అకౌంటెంట్శంకర్ధైర్యాన్ని చూసి తాను ఎదురు తిరిగిసి. ఐ. కిఫోన్చేసి అన్ని విషయాలు బయట పెట్టాడు. ప్రొప్రైటర్కారణంగా తన తండ్రిని పోగొట్టుకున్న పార్వతి, మతి చలించి పిచ్చిదానిలా మారినమేనే జర్భార్య, ప్రొప్రైటర్ ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి కూలీల పక్షం వహించిన శంకర్, అన్ని విషయాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన అకౌంటెంట్వంటి వారందరి ధైర్యము ప్రొప్రైటర్దౌర్జన్యాన్ని అరికట్టగలిగింది. ఎంతకైనా తెగించే స్వభావం గల ప్రొప్రైటర్, పార్వతిని భయపెట్టి లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ మేనేజర్భార్య మాటలకు భయపడి ఆఖరికి ఆమె ద్వారానే సంహరించబడ్డాడు.

శ్రమైకజీవన సౌందర్యం :
కుటుంబ పరిస్థితులు అందరిలోనూ “భయం” కలిగించి తలవంచుకునేలా చేసినా, ఆఖరికి కుటుంబ బాధ్యతల కారణంగా పిచ్చిదయిపోయిన మేనేజర్భార్యలో భయాన్ని పోగొట్టాయి. ఆమె అన్నంత పని చేసి ప్రొప్రైటర్ను అంతం చేసింది. శంకర్, అకౌంటెంట్ధైర్యం ప్రొప్రైటర్ అన్యాయాలను బయట పెట్టగలిగింది. ఆఫీసుకు నిప్పంటించిన మేనేజర్భార్య పాత్రనాటకంలో కీలకమైందని చెప్పవచ్చు. మనిషి అనుభవించే కష్టాలకు అతనిలో “భయం” కారణమని ఆ భయాన్ని అధిగమించిన రోజున పరిస్థితులు చక్కబడతాయి ధైర్యాన్నిచ్చిన ఆత్రేయగారి భయంనాటకం చక్కని సందేశాత్మకం. భయంతో మనిషి ఎదగలేడు సరి కదా తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి మేనేజర్లా యజమాని అన్యాయాలకు వంతపాడాల్సి వస్తుంది. కుటుంబ పరిస్థితి కూడా బాగుపడదు.

ఎప్పుడూ కష్టపడేవాడు తన కష్టాన్ని ధైర్యంగా మలచుకుని భయాన్ని విడనాడి జీవితంలో ముందడుగు వేయాలి అనే చక్కని సందేశం ఇచ్చిన భయం నాటకం మధ్య తరగతి కుటుంబీకులలో భయాన్ని పోగొట్టినూతన ఉత్సాహాన్ని రేకెత్తించింది.

–  నెమ్మలూరిభవాని

ఆధారగ్రంథాలు:
1.కొంగర జగ్గయ్య – ఆత్రేయ సాహితీ 2
2.నాగయ్య గూడూరి – తెలుగు సాహిత్య సమీక్ష ద్వితీయ సంపుటి
3.సిమ్మన్న వెలమల – తెలుగు సాహిత్య చరిత్ర
4. డా.ద్వానాశాస్త్రి – తెలుగు సాహిత్య చరిత్ర

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో