**కాలవాహిని**(కవిత )-సాగర్ రెడ్డి

 

 

 

 

గుర్తుకొస్తున్నాయి
గుంపులుగా తిరిగి
ఆనందించిన రోజులు.
తట్టిలేపుతున్నాయి-
స్నేహితులతో బడ్డీకొట్టు
హాస్యాపూరిత ఉపన్యాసాలు-
కలసి సాగిన ఉదయపు
నడక ఉషోదయ ఉత్సాహాలు!!

ఉరుకుల పరుగుల
దైనందిక కార్యాలను
కట్టడిచేసినా-
ప్రత్యేకరంగాలకే
పరిమితమైన-
ఇంటినుంచే పని
అనే కొత్త సాంప్రదాయాన్ని
వీలైనన్ని వర్గాలు
అందిపుచ్చుకున్న
అనూహ్య కాలమిది!!

ఆన్లైన్ అనే పదం
వినపడని తావులేదు,
మాస్క్ తొడగని మనిషి,
కనుచూపుమేరలో లేక-
తుమ్ము, దగ్గుల శభ్ధానికే,
అల్లంతదూరం జరిగే
విచిత్ర సంఘటనలకు
కొదవలేని సమయమిది!!

విద్యారంగాన్ని-
నివ్వెరపరుస్తున్న
ఈ విషమ పరీక్షాకాలం
కృత్రిమ ఉత్తీర్ణతను
ఒంటపట్టించుకుని,
విద్యారంగ భవిష్యత్తుకే
సవాలు విసురుతున్న,
విలయ కాలమిది!!

ఆనందాల అనుభూతికి
అందలాల అవరోహణకు,
కనే కలలసాకారానికి,
జీవితాన తారసిల్లే-
ప్రతి ఉధ్ధాన పతనానికి
ఆరోగ్య సహిత
ప్రాణమే ఆదారమని
తెలియచెప్పిన విలువైన
వినూత్న సమయమిది!!

– సాగర్ రెడ్డి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో