చాలా బాగుంటది (కవిత )- చందలూరి నారాయణరావు

నీ
ఆలోచనకు
మిరిమెట్లుగొల్పే మనసు
చాలా బాగుంటది.

మాటతీపికి
ఎరుపెక్కిన ఆనందం
చాలా బాగుంటది.

ఎదురొచ్చిన ఊహలో
వెనుకేసుకున్న ఆశ
చాలా బాగుంటది.

పడి లేచే ఊసులో
పదునెక్కే తృప్తి
చాలా బాగుంటది.

మొలకెత్తిన మాటకు
విరబూసిన బంధం
చాలా బాగుంటది.

గుర్తొచ్చే జ్ఞాపకంతో
గుప్పించిన అందం
చాలా బాగుంటది.

మాట్లాడే నవ్వుతో
మనసు సువాసన
చాలా బాగుంటది.

సద్దు చేయని స్పర్శతో
పులకింతల పరుగులాట
చాలా బాగుంటది.

తుళ్ళింతల కవ్వింతలో
తడిసి ముద్దవ్వడం
చాలా బాగుంటది.

కలుపుకోలు కళకు
కలవరింత మెలుకువ
చాలా బాగుంటది.

కన్నులలో వర్షించే
మెరుపుదనం
చాలా బాగుంటది.

చేతలలో చెంగుమనే
చురుకుదనం
చాలా బాగుంటది.

నా అనుకున్న నీలో
నాదైన ప్రేమ
చాలా బాగుంటది.

… చందలూరి నారాయణరావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో