సంపాదకీయం జూన్ నెల – అరసి శ్రీ

ప్రభుత్వాలు ప్రదర్శించిన నిర్లక్ష్యం వైఖరి ఒక వైపు, కోవిడ్ తో ఎన్నో సంఘటనలు చూసిన సామాన్య పౌరులు వాటినన్నింటిని మరిచిపోయి ఎమరపాటుగా ప్రవర్తించిన తీరుకి గత నెల రోజులుగా కరోనాతో సాగుతున్న పోరాటమే సాక్ష్యం. నెల రోజుల ఈ పోరాటానికి ఇప్పుడిప్పుడే కాస్త కేసులు తగ్గడం కాస్త ఊరటనిస్తున్న కాని మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. మరొక వైపు కోవిడ్ వచ్చిన తగ్గిన వాళ్ళలో బయట పడుతున్న బ్లాక్ ఫంగస్ ప్రజలని వణికిస్తుంది.

ఒకానొక దశలో ఆక్సీజన్ అందక ప్రజలు నరకయాతన అనుభవించారు. కేవలం ఆక్సీజన్ సదుపాయం అందుబాటులో లేకపోవడం వలన ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. ప్రస్తుతం దేశంలో ఆక్సీజన్ అందుబాటులోకి వచ్చింది. అటు ప్రభుత్వం , ఇటు స్వచ్చంద సంస్థలు , ప్రముఖుల కృషి అభినందనీయం.

నిన్నే కేంద్రం కూడా లాక్ డౌన్ మరొక నెల వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేయడం కాని తుది నిర్ణయం రాష్ట్రాలకే వదిలేసింది. వాక్సిన్ విషయంలో మాత్రం ఇప్పటికి ఆ కొరత అలానే ఉంది. ప్రభుత్వం వాక్సీన్ వేసుకోవడానికి అనుమతి ఇచ్చి ప్రజలలో సగం జనాభాకి అయినా వాక్సినేషన్ ప్రక్రియ సాధ్యమైనంత తొందరగా పూర్తి చేస్తే కాస్త ఊపిరి తీసుకోవచ్చు. కరోనా సెకండ్ వేవ్ తగ్గుతుందని అని ఆశ పడుతుంటే మరొక వైపు చిన్న పిల్లల్లో కరోనా కేసులో రోజు రోజుకి ఎక్కువ కావడం కరోనా ధర్డ్ వేవ్ కి హెచ్చరికలు జారీ చేస్తున్నట్టే ఉంది. కరోనా థర్డ్ వేవ్ పిల్లలకు ముప్పుగా మారుతుందనే ఆందోళనల నేపథ్యంలో కరోనా వైరస్ తన స్వభావం మార్చుకుంటే పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఒక్క మే నెలలోనే మహారాష్ట్రలో 8 వేల మంది చిన్నారులు కరోనా బారిన పడటం ధర్డ్ వేవ్ లో చిన్నారులకు ప్రమాదం అనేది తేటతెల్లం అవుతుంది.

ఇప్పటికైనా ప్రభుత్వాలే కాకుండా ప్రతి ఒక్కరు ఎవరికి వారుగా చిన్నారుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు రోగనిరోధక శక్తి విషయంలో పౌష్టిక ఆహారాన్ని అందించాలి. మన దేశంలో కనీసం పౌష్టిక ఆహారం అందని చిన్నారులు ఎందరో వాళ్ళ కోసమైనా కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ముందస్తుగానే ఆలోచన చేయడం ఎంతైనా అవసరం.

అదేవిధంగా మొదటిసారి చేసిన పొరపాటులను యిప్పుడైన పునరావృతం కాకుండా చూడాలి. తగ్గుముఖం పడుతున్న ఈ సమయంలో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలి.

ఇది అంతా నాణానికి ఒక వైపు, మరొక వైపున పరిస్థితి వేరుగా ఉంది. ఈ సమయంలో మనిషికి సాటి మనిషి మానవత్వంతో సాయం చేయాల్సిన తరుణంలో కూడా పైశాచికంగా ప్రవర్తించడం మనం ఎక్కడ జీవిస్తున్నాము అని ఆలోచించాల్సి వస్తుంది.

కరోనా భయంతో మానవత్వం మంట కలుస్తోంది. ఆక్సీజన్ ఉన్న చోట ఎక్కువ తక్కువ ఉంటుంది. ఉండని చోట అస్సలు ఉండటం లేదు. ఇలాంటి సమయంలో ఆక్సీజన్ కొరకు ఒక యువతి అభ్యర్థించిన సమయంలో తన కోరిక తీర్చితే ఆక్సీజన్ సమకూర్చుతానంటూ ఆఫర్ ఇచ్చిన సంఘటన చర్చనీయాంశంగా మారింది.

ఢిల్లీకి చెందిన ఒక యువతి ఇటీవల తన స్నేహితుడి కుటుంబ సభ్యులకు అత్యవసరంగా ఆక్సీజన్ ఏర్పడింది. దాంతో ఆక్సీజన్ కోసం ఆమె పలు చోట్ల ప్రయత్నించింది. చివరకు తనకు చాలా కాలంగా తెలిసిన వ్యక్తిని. సోదరుడిగా భావించిన వ్యక్తిని ఆక్సీజన్ కోసం సంప్రదించింది. ఆ సమయంలో అతడు తనతో రూమ్ కు వచ్చి తన కోరిక తీర్చితే వెంటనే ఆక్సీజన్ ను సమకూర్చుతాను అంటూ సమాధానం చెప్పాడట. అతడి మాటలతో షాక్ అయిన యువతి ఆ విషయాన్ని నెట్టింట షేర్ చేసింది. ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలో మీరు చెప్పండి అంటూ ఆమె ట్విట్టర్ లో పేర్కొంది.

ఇలాంటి సమయంలో కూడా మహిళకి రక్షణ లేకుండా పోవడానికి కారణం మన చట్టాల లేక మన చుట్టూ ఉన్న అహంకారపు భావజాలమా అనేది మనకి మనమే ప్రశ్నించుకోవలసిన సమయం ఇది. కాని ఒక సంఘటన జరిగినప్పుడు దాని పరిణామం , ఫలితం అనేది తర్వాత తరాలకి గుణపాఠం అయితే అది మళ్ళి పునరావృతం కాదు అన్నది అక్షర సత్యం .

 

-అరసి శ్రీ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయం, , , , , Permalink

2 Responses to సంపాదకీయం జూన్ నెల – అరసి శ్రీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో