మేకోపాఖ్యానం-5 ప్రకృతి -స్త్రీలు – వి.శాంతి ప్రబోధ  

“అబ్బబ్బ .. ఏంటో .. ఈ ఎండ” చెమటలు కార్చుకుంటూ వచ్చి చెట్టుకింద చేరింది గాడిద

“ఎండాకాలం ఎండల్లేకుండా వానలుంటాయా ..” నవ్వింది మేక

“అక్కడెక్కడో తుఫాను ఏమో గానీ మనకి మాత్రం నాల్రోజులు మబ్బులు వర్షాలు .. ఎంత హాయిగా ఉందో నిన్నటిదాకా” అన్నది ఆడమేక

అంతలో నెత్తి మీద పెద్ద కట్టెల మోపుతో  ఓ మహిళ వచ్చి నెత్తిమీది బరువు దించుకుని, చెంగుతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటోంది.  ఆ మోపును అట్లా నిలబెట్టుకునే ఉన్న ఆమె మోపులో సగం ఎత్తు కూడా లేదు.

“పిట్టంత మనిషి ఏనుగంత బరువు ఎలా మోస్తున్నదో .. “అన్నది ఆడమేక ఆ మహిళను చూస్తూ

“వీళ్ళ ముదనష్టం మండిపోను, అడవులను నాశనం చేసేస్తున్నారు.  ఊరి మొదట్లో ఉండే అడవులు ఆమడ దూరం పారిపోయాయి. ఆ అడవులు పోబట్టే కాలం తలకిందులవుతున్నదట” సాగదీస్తూ అన్నది గాడిద.

“అడవులు తగ్గిపోవడం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్న మాట నిజమే. కానీ కారణం ఇంటి వాడకం కోసం తీసుకుపోయే ఈ బక్క మనుషులు కాదు. పెద్ద పెద్ద తలకాయలు” అన్నది మగమేక.

“అవును, అడవితల్లి ఒడిలో పెరిగిన  బిడ్డలకు ఆ తల్లి విలువ తెలుసు. ఆ తల్లి నుంచి తమ జీవిక కోసం కావాల్సింది తీసుకుంటారు. కానీ, పాలు తాగిన తల్లి రొమ్ముని కొరుక్కు తినే దుర్మార్గులు కాదు. తల్లిని కాపాడుకుంటారు.  ఈ మాత్రమైనా ఉన్నాయంటే ఆ అడవి బిడ్డల పుణ్యమే.  లేదంటే ఎప్పుడో ఖాళీ అయిపోయేవి”  ఆలోచనతో అన్నది ఆడమేక.

“నువ్వన్నది నిజమేనోయ్.

ప్రకృతే జీవులకు కావలసిన వనరులన్నీ సమకూరుస్తుంది. వాటిని జీవులు వాడుకోవాలి. ఈ సృష్టిలో జీవులన్నీ అలాగే చేస్తున్నాయి ఒక్క మనిషి తప్ప.

స్వార్థపరుడైన మనిషి అవసరమైన దానికన్నా ఎక్కువగా వాడుతున్నాడు. విచక్షణారహితంగా వాడుకుంటున్నాడు… ” చెప్తున్నదల్లా ఆగింది మగమేక.

ఏమిటన్నట్లు నొసలు చిట్లించి చూస్తున్న గాడిద, ఆడమేకలను ఆ మాటలు వినమన్నట్టు సైగ చేసింది మగమేక.

చెట్టు నీడకు చేరిన ఓ బాటసారి సెల్ఫోన్ లోంచి వినవస్తున్నాయి ఆ మాటలు.

ముగ్గురు మౌనంగా వినడం మొదలు పెట్టారు.

“స్వార్థపరులైన మానవులు అభివృద్ధి పేరుతో ఎన్నో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.  అడవులను నరికి పరిశ్రమలు నెలకొల్పి కాలుష్యం పెంచుతున్నారు.  గ్రీన్ హౌస్ వాయువులతో వాతావరణాన్ని, భూగోళాన్ని వేడెక్కిస్తున్నారు. అది అభివృద్దా..? విధ్వంసమా..? పర్యావరణ వినాశనమా ? ఆలోచించండి .

ఈ భూగోళం ఒక్క మనిషిదేనా..? కాదు, సమస్త జీవరాశిది.

భూమి మీద 33 శాతం అడవులు ఉంటేనే జీవరాశులన్నిటికి తగినంత గాలి దొరుకుతుంది, తాగేందుకు నీరు దొరుకుతుంది. నేలమ్మ సక్రమంగా పంటలు పండిస్తుంది. కానీ మనదేశంలో అడవి భూముల విస్తీర్ణం రోజు రోజుకి తరిగిపోతున్నది. 19 శాతం కూడా లేదు.

భూగర్భ జలం అడుగంటిపోతున్నాయి. నేల కోతకు గురవుతోంది. వర్షం తాకిడికి  భూసారం కొట్టుకు పోతున్నది. గాలిలో కార్బన్ డయాక్సైడ్ పెరిగి భూమి వేడెక్కుతున్నది.

రుతుపవనాలు గతి తప్పి సమయానికి వర్షాలు రావట్లేదు. అకాలంలో ముంచెత్తే వరదలు, సునామీలు, తుఫాన్లు పెరుగుతున్నాయి.

అంతేనా..?

వ్యవసాయంలో అతిగా వాడే నీరు, ఎరువులు, పురుగు మందులతో కాలుష్యం పెరిగిపోతున్నది.  ఫ్యాక్టరీ వ్యర్థాలతో నీరు కలుషితం అవుతున్నది.

అమూల్యమైన వన సంపద, జీవరాశులు కోల్పోతున్నాం. జీవవైవిధ్యం లేని మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది

ఒక దగ్గర సమస్య వచ్చిందని మరో దగ్గరకి తరలించడం కాదు .  సమస్యలు లేని స్థిర నివాసం ఏర్పరచడం ముఖ్యం… ” ఇంకా ఏవో వినిపిస్తూనే ఉంది.

తమ మౌనాన్ని ఛేదిస్తూ “అవును, ఒక తల్లి కష్టాన్ని మరో తల్లి మాత్రమే అర్థం చేసుకోగలదు.

మనమంతా ఒకరిమీద ఒకరు ఆధారపడి జీవిస్తున్నామని మహిళలు బాగా అర్థం చేసుకుంటారు. తీవ్ర సంక్షోభంలో సమిష్టి కృషి కావాలి. దీనిని మహిళలు బాగా అర్థం చేసుకుంటారు.

పర్యావరణ సంక్షోభం ప్రభావం మహిళలపై ఎక్కువ. ఇప్పుడు దానికి జవాబు వాళ్లే ఇవ్వగలరు.” అన్నది ఆడమేక

“నువ్వేమంటున్నావో నాకొక్క ముక్క కూడా అర్ధం కాలేదు”  విసుగ్గా అన్నది గాడిద.

“నువ్వు చెప్పింది నిజమేనోయ్.  ఏమిటో ఈ మధ్య నీ బుర్ర పాదరసంలా పనిచేస్తున్నది.” మెచ్చుకోలుగా చూస్తూ నవ్వింది మగమేక.

“ప్రకృతికి స్త్రీలకు సన్నిహిత సంబంధం  ఉంది. పర్యావరణ క్షీణత వల్ల , సమిష్టి వనరుల అంతర్ధానం వల్ల కుటుంబంలో మొదట ఇబ్బందులు ఎదుర్కొనేది మహిళలే కదా! అది మనం చూస్తున్నదే కదా ..

వంటచెరుకు కోసం, నీటి సమీకరణకు పేద స్త్రీలు నిర్విరామంగా , నిరంతరాయంగా శ్రమిస్తున్నారు.”  కట్టెల మోపు నెత్తికి ఎత్తుకుంటున్న ఆమెను చూస్తూ అన్నది ఆడమేక.

“అవునవును, మనుగడ కోసం ఆహార భద్రత కోసం స్త్రీలు ఎంతో శ్రమిస్తున్నారు” అన్నది మగమేక.

“మన ఊరినే చూడండి.

కలుషితమైన ఆకాశం, ఎండిపోతున్న నదులు, తరిగిపోతున్న అడవులు,  తరిగిపోతున్న జీవనోపాధులు, పచ్చిక మైదానాలు, జంతు జాతులు ఆపదలో పడ్డాయి. సహజసిద్ధమైన ఆవాసాలు కనుమరుగవుతున్నాయి. వాటి స్థానంలో ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, కాలేజీలు … వచ్చాయి” బుర్రకు పదును పెడుతూ అన్నది గాడిద.

“కాల చక్రం పైన ఆడవాళ్ళ ఋతు చక్రం పైన దెబ్బతిన్న పర్యావరణ ప్రభావం అంతా ఇంతా కాదు.

అదిగో అటు చూడు.. సంకన బిడ్డ నెత్తిన కుండ తో ఆ తల్లి నీటి కోసం పడుతున్న తిప్పలు” అన్నది ఆడమేక వస్తున్న మహిళను చూస్తూ

“వాతావరణ సంక్షోభం పేదరికాన్ని, ఘర్షణల్ని, లింగ అసమానతల్ని మరింత తీవ్రతరం చేస్తుంది.  లాక్డౌన్ వల్ల, పర్యావరణ సంక్షోభం వల్ల అందరికన్నా ఎక్కువగా కష్టనష్టాలకు గురయ్యేది మహిళలే… ” మాటలు వింటూ “ప్చ్ .. పాపం ” అన్నది గాడిద

“సర్లే .. మనమే చేయగలం.. మహిళలు బాగుంటే పర్యావరణం బాగుంటుంది. పర్యావరణం బాగుంటే మనం బాగుంటాం” అన్నది మగమేక

“అయితే, దీనికి పరిష్కారం కూడా మహిళలే.  మహిళలు నీళ్లు, ఇంధనం, పశుపోషణ, ఆహారం, అడవి, వ్యవసాయం అన్నీ నిర్వహించగలరు.

జన్మనిచ్చి పెంచి పెద్ద చేసే సహజ లక్షణం, ఇంటిల్లిపాదినీ కాచుకునే గుణం మహిళలది. అలాగే ప్రకృతిని, ప్రకృతి వనరులు, సహజ వనరులు భద్రపరిచే సామర్థ్యం ఆమెకు ఉన్నది.

మహిళల్ని విద్యాధికులు చెయ్యడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చు.  విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చు. భవిష్యత్ పర్యావరణ నాయకుల్ని తయారు చేయవచ్చు.

లాభాలకోసం పనిచేసే వ్యవస్థలో ఉన్న మనుషుల్లో సామూహిక చైతన్యాన్ని కరోనా వైరస్ కలిగించింది.  అందరూ కలసికట్టుగా పర్యావరణ వ్యవస్థ కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది”  బాటసారి ఫోన్ రేడియో నుంచి వస్తున్న మాటలు వింటున్న మధ్యలో అందుకుని

“వ్యవస్థలు అన్నీ ఆడవాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రకృతిని స్త్రీని అణచివేస్తున్నారు.

ప్రకృతిని  దోపిడీ చేసినట్టు ఆడదాన్ని దోపిడీ చేస్తున్నారు.

పురుషులు స్త్రీలపై, ప్రకృతిపై ఆధిపత్యం చెలాయిస్తారు

కానీ ఆ వ్యవస్థల్ని తమకు  అనుకూలంగా మార్చుకోవడానికి పోరాటం చేస్తున్నారు మహిళలు ” అన్నది ఆడమేక.

” జెండర్ అసమానతలు ఎక్కువగా ఉన్న చోట అడవుల నరికివేత , వాతావరణ కాలుష్యం , పర్యావరణ విపత్తులు ఎక్కువ

దేశ పార్లమెంట్ లో అసెంబ్లీలలో, మహిళలు అధిక సంఖ్యలో ఉంటే కనీసం పురుషులతో సమానంగా ఉండగలిగితే పర్యావరణ విపత్తులు ఎన్నో తగ్గేవి.  భూమిని నీటిని వాతావరణాన్ని రక్షించేవారు.  ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించేవి.

ప్రభుత్వం వేలం వేసిన చెట్లు కొట్టుకోకుండా ముగ్గురు మహిళలు గౌరదేవి, సుదేశదేవి, బిచ్నిదేవి ఒక రాత్రంతా చెట్లను కౌగలించుకుని రక్షించడంలో మిగతావారు మరుసటి రోజు నుంచి అలాగే చేయడం మొదలుపెట్టారు.  మహిళల భాగస్వామ్యం తో జరిగిందే చిప్కో ఉద్యమం .

 రాజస్థాన్ లోని మార్వారీ లోను మహిళలు చెట్లు ఇదే విధంగా కాపాడుకున్నారు.  ఎందరికో స్ఫూర్తినిచ్చారు. ..ఇలా చాలా ప్రాంతాల్లో మహిళల చొరవతోనే పర్యావరణ పరిరక్షణకు ఉద్యమాలు మొదలయ్యాయి ” బాటసారి ఫోన్ నుండి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి.

“అవును, నిజమే. మహిళలు మార్పుకు మార్గదర్శకులు.  మన జహీరాబాదు డిడిఎస్ మహిళలను చూడండి. చదువుకోలేదు. కానీ కల్తీ లేని వ్యవసాయం చేస్తున్నారు. వనాలను పెంచుతున్నారు. భూమికి బతుకు ఇస్తున్నారు.  ప్రాణం ఇచ్చే తిండి, గాలి, నీరు వాళ్ళ సొంతం చేసుకుంటున్నారు.

తమ బతుకు పండించుకుంటూ భవిష్యత్ కు హామీ ఇస్తున్నారు”  మొన్నీ మధ్య చెవిలో పడిన టివి వార్తల సారం చెప్పింది ఆడమేక.

“నీ మాటలు వింటుంటే నెర్రలు బారిన నేల లాగా ఉన్న హృదయంపై పన్నీరు చల్లినట్లుంది”  భార్య భుజం తట్టి అభినందిస్తూ అన్నది మగమేక

“తగలబడుతున్న ఈ లోకంలో ఇక తినడానికి ఏమీ దొరకదేమో నని బెంగ ఉండేది. ఈ మాటలన్నీ విన్నాక నాకు రేపు పట్ల ఆశ బతుకుతున్నది” అన్నది గాడిద

-వి. శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో