గజల్-21 – ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

తెలుగు గజల్ ప్రేమికులకు నమస్సుమాంజలి. సూర్యచందులు లేకుంటే తూర్పు, రాత్రి చిన్నబోతాయి. టెట్లు లేకుంటే పూలకు పండుగలుండవు. అలల సవ్వడిలేకపోతే
తీరానికి నిదురరాదు. చివురు తిని కమ్మనిపాట పాడే కోకిల పాడకుంటే దిగులుతో చూవురు వాడి రాలిపోదా? పుడమిపై వర్షించే మేఘాలు నేలను వెలివేస్తే కరువు రాజ్యమేలదా ? ఇంట్లో ఆడపిల్ల
తిరుగుతూ  ఉంటేనే ఇంటికి సందడి. ఆడపిల్ల  అత్తారింటికి వెడితే సందడిని కూడా తనతోటే తీసుకొనివెళ్లిపోతుంది. ఇల్లు బోసిపోతుంది. తీయని కలల జోలపాటలతో నిదురించే కనులకు కలలు లేకుంటే కాళరాత్రే కదా … ఇలా ఎన్నో భావాలను ఒకే గజల్ లో భిన్నమైన షేర్లలో చొప్పించే ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఈ గజల్ మీకోసం …

గజల్ :  
 

సూర్యరేఖ లేకుంటే తూర్పు బోసిపోదా మరి
చందమామ లేకుంటే రాత్రి నిదురబోదా మరి    
 
తీపిపాట వినగానే పూలు మురిసిపోతాయీ
తేనెటీగ లేకుంటే తోట మూగబోదా మరి

జలవేదం వల్లింపుకి పరవిశించిపోతుంది
అలల ఘోష లేకుంటే ఒడ్డు చిన్నబోదా మరి

నిర్భాగ్యుని నుదుటిపైన ఎందుకుండదో తెలియదు
భాగ్యరేఖ లేకుంటే బతుకు చితికిపోదా మరి

తీయని పాటకు  మూలం కావాలనుకుంటుంది
కోకిలమ్మ లేకుంటే చివురు రాలిపోదా మరి

పచ్చని పైరులతోనే పుడమి నిండిపోవాలీ
ఏరువాక లేకుంటే కరువు పెరిగిపోదా మరి
 
ఇంటిలోన ఉందంటే సందడిగా ఉంటుందీ
ఆడపిల్ల లేకుంటే ఇల్లు చిన్నబోదా మరి 

రెప్పలపై కురిసినపుడు హాయి కదా నెలరాజా
కలలవాన లేకుంటే  కనులు మండిపోవా మరి

– ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
  

కవితలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో