జనపదం జానపదం- 15- ఎరుకల తెగ జీవన విధానం -భోజన్న

ISSN -2278 – 478

మనుష్యులంతా ఒకే చోట జీవిస్తారు కానీ వారి జీవన విధానం ఒకరితో ఒకరికి సంబంధమే ఉండదు.ఒకరి ఆచారాలు సంప్రదాయాలు మరొకరి ఇంట్లో కనబడవు.ఎందుకంటే సామాజికంగా అభివృద్ది చెందిన కులం, వెనుకబడిన తరగతులకు చెందిన తెగ పక్క పక్కనే ఉండడం వలన వీరి మధ్యన చాలా అంతరాలు కనిపిస్తాయి.

         “తెగ” అనగానే మనకు కొండా కోనలు గుర్తుకువస్తాయి. కానీ సమాజంలో భాగంగా జీవిస్తూ తమకు కూడా తాము ఒక తెగకు చెందిన వారిమని తెలియని వారు ఎరుకల తెగకు చెందిన వారు.అత్యంత వెనుకబడిన తెగల్లో ఒకటిగా ఈ ఎరుకల తెగను చెబుతారు.వీరి జీవన విధానం చాలా భిన్నంగా ఉంటుంది.

 ఎరుకల తెగకు చెందిన వారు గ్రామాల్లో భూస్వాముల దగ్గర పాలేరులుగా, తారు రోడ్డు పనుల్లో, వ్యవసాయ కూలీలుగా, పందుల పెంపకం, పక్షి వేట మొదలైన పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.వీరి వృత్తి ఒక్కో గ్రామానికి ఒక్కో విధంగా ఉంటుంది. అంతేకాదు వీరి వ్యక్తిత్వం కూడా ఇతరులకు భిన్నంగా ఉండి నేర్పరి తనాన్ని ప్రదర్శిస్తారు.జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వీరు అనేక రకాల పనులు చేస్తుంటారు.నేర ప్రవ్రృత్తి కలిగిన పనులు చేయడం వల్ల వీరిని భారత ప్రభుత్వం నేర ప్రవృత్తి తెగని ప్రకటించింది.సమాజంలో వీరి తెగను దొంగలకు సంబంధించిన తెగగా భావిస్తారు. నేను సేకరించిన జానపద కథల్లోనూ ఎరుకల దొంగ కథ, ఎరుకల నాంచారి కథ, కొంగ శాపం కథల్లో వీరి జీవన చిత్రణ కనిపిస్తుంది. వడ్లను నూర్చిన తర్వాత ఆ రైతు తనకు తానుగా కొంత ధాన్యం తెచ్చి ఎరుకల దొంగ ఇంటి ముందు పెట్టుపోవాలి లేదంటే అతని ధాన్యంలో సగభాగం కాపల వారికి తెలియకుండా దోచుకునే నేర్పరితనం ఉంటుందని ఎరుకల దొంగ కథలో జానపదులు చెప్పుకుంటారు. ఈ కథలోనే పోలీస్ వారితో ఎరుకల దొంగ స్నేహపూర్వకంగా మెదులుతూ మామూలు ఇస్తూ తన పనులను చాకచక్యంగా నెరవేర్చుకోవడం కనిపిస్తుంది. పై ఉదాహరణల్లో వీరి స్వభావం, నేర్పరి తనం, సమాజాన్ని అర్థం చేసుకునే తీరు, జీవన విధానం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఎరుకల నాంచారి కథలో ఎరుక చెప్పే విధానం, లచ్చిందేవి కథలు కొంగలను వేటాడే తీరు తెలిపారు.

ఎరుకల తెగకు చెందిన ఆడవారు పచ్చబొట్టు వేయడం, ఎరుక చెప్పడం, సోది చెప్పడం, తడకలు అల్లడం, బుట్టలు అల్లడం, కూలి పనులు, భర్తతో వేటలో పాల్గొనడం చేస్తుంటారు. వీరి ఆహారంలో ఎక్కువ పాలు మాంసమే ఉంటుంది. ఆహారం స్వయంగా వీరే సమకూర్చుకుంటారు. ఉడత పట్టడం, ఎలుకలని పొగ వేసి పట్టుకోవడం, కుందేల్లను సమకూర్చుకోవడం, అడవి పందులను తినడం చేస్తుండేవారు. రానురాను అడవులు మాయం అవుతుండగా మీరు జీవన విధానంలోనూ అనేక మార్పులు వచ్చి మాంసాహారానికి కొంత దూరం కాబడి ఆకుకూరలు, కూరగాయలతో పాటు కోడి, మేక మాంసంతో పాటు కొన్నిసార్లు ఉడుత మొదలైన ఆహారాన్ని నేటికి తింటున్నారు.

పురుషులు చూడడానికి ప్రశాంతంగా కనిపించిన ప్రణాళికలు వేయడంలో, పనులను అవలీలగా పూర్తి చేయడం లో వీరికి వీరే సాటి. సమాజంలోని వారు వీరితో సహవాసం చేయడానికి కొంత విముఖత చూపుతారు. వీరి స్వభావానికి దగ్గరగా ఉన్నవారు మాత్రమే వీరితో సత్సంబంధాలు నెరుపుతారు. వీరికి సైతం ఎంతో కొంత వీరంటే భయం ఉంటుంది. సమయానుకూలంగా మారిపోతుంటారు మేటి రాజకీయ నాయకులకు చక్కగా పనులు చేయడంలో వీరి మనస్తత్వం సరిపోతుంది కాబట్టే అనేకమంది వీరిని రాయబారులుగా, సంధానకర్తగా, మధ్యవర్తిగా, మాట నేర్పుతో పనులు చక్కబెట్టే కార్యక్రమాల్లో  వాడుతుంటారు. ఆది నుండి సులభంగా వచ్చే దనంతో జీవించడం వలన వీరికి ఆ పని బాగా నచ్చుతుంది. కానీ ఇలాంటి అనేక అపోహలు అవమానాలతో సమాజం వీరిని దూషిస్తున్నా వీరిలో కొందరు స్వయంకృషి నమ్ముకొని ముందుకు సాగుతున్నారు. పనులు చేయడంలో వీరి తీక్షణత, దృఢ సంకల్పం, కార్యదీక్షత మెండుగా ఉంటుంది. ఒక పని చేయడానికి పూనుకుంటే ఆ పని పూర్తయ్యేవరకు వదిలిపెట్టరు. అందుకే భూస్వాములు, పెట్టుబడిదారులు వీరిని కఠిన పనులు చేయడానికి వినియోగించుకుంటారు. కొందరు శ్రమ చేయలేనివారు మూలన వీరి తెగకు మొత్తానికి రకరకాలుగా ఆటంకాలు,  అవమానాలు నేటికి సమాజంలో ఎదురవుతున్నాయి. ప్రస్తుతం సమాజంలో సామాజిక హోదా పొందుతున్న వారిలో వీరు ఒకరు. విద్యారంగంలో, రాజకీయ రంగంలోనూ, వ్యాపారరంగంలోనూ మరియు అనేక రంగాల లోనూ తనదైన గుర్తింపు తో ముందుకు సాగుతున్నారు అయినా ఇంకా కొందరు పూర్వపు వాసనల కారణంగా కారణంగా స్వార్థపూరిత మనుష్యులకు తొత్తులుగా, అన్యాయాలు చేయడంలో ముందుంటూ ఏ పూటకాపూట పబ్బం గడుపుకునే వారు అక్కడక్కడ మనకు కనిపిస్తూనే ఉంటారు. వీరికి న్యాయం, చట్టం ,ధర్మం, సానుభూతి, దయా మొదలైన వాటితో సంబంధం లేదు. వీరి కడుపునిండడానికి ఎందరి కడుపులు అయినా కొట్టడానికి ముందుకొస్తారు. ఇది నాణానికి రెండో వైపు మాత్రమే కనిపించే స్వభావం.

 -తాటీకాయలభోజన్న

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో