మనోఫలకంపై నిలిచే శిలాఫలకం(పుస్తక సమీక్ష )-AR. భారతి

కవిత్వం అంటే జీవిత వ్యాఖ్యానమే అంటాడు మ్యాథ్యూ ఆర్నాల్డ్. అతులిత మాధురీ మహిమ, బ్రహ్మానందానికి సమానమైన రసానందం, ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అండ్ థాట్స్ ఇవన్నీ వీణావాణి గారి రచనల్లో ప్రతిబింబిస్తాయి. “శిలాఫలకం” కవయిత్రి కలం నుంచి జారి పడిన ఆర్తి ఆర్ద్రతల మేలుకలయిక. ఒక్కో కవిత మనసును తట్టి లేపి అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తుంది. కవితా వస్తువు సహజమైనదే. మన దైనందిన జీవితంలోని ప్రతి సంఘటన అక్షర రూపం దాల్చి చరితార్థమైనదే. అది అప్పు అయినా ఆదివారమైనా, మనం తీసుకునేదే అనుభవించేదే, కానీ కవితా వస్తువై తెల్లకాగితం చేరడం అరుదు.

సృష్టిలో ఏ వస్తువు పనికిరానిది కాదు. మనకి పనికి రానిది వేరొకరికి పనికి వచ్చేది కావచ్చు. ఏ వస్తువు ప్రత్యేకత దానిదే. చూసే దృష్టి కోణంలోనే కవయిత్రి వైవిధ్యం కనిపిస్తుంది. చెట్టును చెట్టుగా, పుట్టను పుట్టగా, పాదును పాదుగా చూస్తే యాంత్రికతే అవుతుంది .కానీ ఋతువులతో వచ్చే మార్పులతో జోడించి చూస్తే సప్తవర్ణపు ఇంద్రధనస్సు ఆవిష్కృతమవుతుంది.

సునిశిత దృష్టితో చూస్తే ప్రతి సంఘటన జీవితపు కాన్వాస్ పై నిలిచే చిత్రమే అవుతుంది. తాత్విక చింతనకు, స్పందనకు అక్షర రూపం శిలాఫలకం. ఇది ఒక విధంగా స్మృతి, ప్రణయం, విరహం, వైరాగ్యం, అనుభూతి లాంటి భావాల సమాహారం. అనేక వర్ణాల కుసుమ కదంభం. అందుకే ఇది వైవిధ్య భరిత సౌరభాలను విరజిల్లుతుంది. ఒక్కో కవిత ఒక్కొక్క రసాన్ని పలికిస్తుంది. “పండుటాకు” కవిత తల్లి పట్ల అవిభాజ్య ప్రేమకి ఆర్తికి అద్దం పడుతుంది. మానవీయకోణం, విశాల దృక్పథం కవయిత్రి కవనంలో స్పష్టంగా కనిపిస్తుంది. మఱ్ఱిచెట్టు ఊడలు విస్తరించడం గానీ, ” పిపీలికం “లో చీమల క్రమశిక్షణ గాని అంతర్లీనంగా ఆలోచింపచేసేవే.

ఇక ఆదివారం సెలవు అన్నది సంస్థలకే గాని వ్యక్తులకు కాదు. ఆ రోజే నిజంగా ఇల్లు ని చక్కబెట్టే పని రోజు. గృహిణిగా, ఉద్యోగిగా “ఆదివారం” అనేది తాత్సారం చేసి కూడబెట్టిన పెండింగ్ పనులకు ఉద్వాసన పలికే రోజు. సోమవారం నుంచి శనివారం వరకు ఎదురు చూసే ఆరోజు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో తెలియదు. పనికి ఆది అంతం లేని వారమని ప్రతి ఒక్కరి మనోగతాన్ని సహజంగా చిత్రీకరించిన కవిత ఇది.

జీవితం అంటే చావు పుట్టుకల మధ్య పయనమయ్యే గాలా! తాత్వికత తెలియక ఎండమావుల వెనక పిచ్చి పరుగు. నీది నాది అని స్వార్థం, వంచన, అసూయాద్వేషాలులో పడి జీవితాన్ని ఆస్వాదించక, బ్రతుకు భారం చేసుకుని, అనుభూతిని కోల్పోతున్న జనాల తీరును “ఉల్లిపాయ” ద్వారా తెలియ చెప్పిన తీరు ఆమె నిగూఢమైన ఆలోచన శక్తి కి తార్కాణం.

బ్రతుకు అర్థం తెలియజెప్పే అలతి అలతి పదాలతో కూర్చిన 70 కవితల అక్షర నిధి “శిలాఫలకం”. ప్రతి కవిత కలిగించే అనుభూతి మాటలకందనిది. అదే పంచదార డబ్బా, అదే దొండపాదు మనకు సామాన్యంగా కనిపించే జీవితపు ప్రతి వస్తువు వీణ వాణి గారు కలం తాకి ప్రత్యేకత సంతరించుకున్నాయి. చదివిన ప్రతిసారి మళ్ళీ మళ్ళీ చదివేలా చేసి శక్తి కవితల ప్రత్యేకత. “ప్రాణ నాడులకు స్పందన నొసగిన ” అనే సిరివెన్నెల గారి రచనలా వీటిని చదివేటప్పుడు పాఠకుడు ఈ ఊహ మనకు ఎందుకు రాలేదా ఆశ్చర్యానికి లోనవ్వడం కాయం. అందుకే శిలాఫలకం మన మనోఫలకంపై నిలిచిపోయే మణిహారం.

మానవులందరిలో అనేక రకాలైన ఆవేశాలు ఉంటాయని స్నేహం, ప్రేమ, కుటుంబం లాంటి సెంటిమెంట్ కు సంబంధించినవి, పంచేంద్రియాలు సంబంధించినవి, అలాగే వితరణ శీలమైన గుణాలు ఉంటాయని , గ్రహాలకు, నక్షత్రాలకు కూడా హృదయం ఉంటుందని, న్యూటన్ ఆకర్షణ సిద్ధాంతం హృదయాలకు కూడా వర్తిస్తుంది అని ఫారియర్ వివరిస్తాడు. వీణ వాణి గారి సునిశిత దృష్టి కూడా నిర్జీవికి జీవంపోసి ఊహకందని పొరలను విప్పి కొత్త లోకాన్ని ఆవిష్కృతం చేస్తుంది.

కొలకవస్కి మాటల్లో “Since the evils of the present system had effected the animal and the vegetable Kingdom as well the new order would see transformation of these and assertion of man’s domination over them. the seas would turn into aur orangeade, desserts food blossom and glaciers melt, spring would be eternal and wild beasts would die out or become friends of man……” బహుశా ఏ వాక్యాలు కవయిత్రి హృదయంలో బలంగా నాటుకున్నాయి. ప్రస్తుత సమాజాన్ని భ్రష్టు పట్టించిన వ్యవస్థ నుంచి, పశుపక్ష్యాదులను నాశనం చేసిన వ్యవస్థ నుంచి మార్పు తెచ్చి ఉన్నతంగా జీవించాలనే ఆకాంక్ష అంతర్లీనంగా ఉంది. సామాజిక విలువలు, మానవ సంబంధాలు, చిన్న చిన్న సంతోషాలు, ప్రతి వస్తువకి ఇచ్చే ప్రత్యేక స్థానం , ఆమె ప్రకృతి ప్రేమకు తార్కాణం.

తెలంగాణ యాస, సూక్ష్మ పరిశీలన, నిశిత దృష్టి, తులనాత్మక విమర్శ,చక్కటి పోలిక, అల్ప పదాలతో అనల్ప అర్ధాన్నిచ్చే పదాల కూర్పు ఆవిడ శైలికి మణికిరీటాలు. ఆ కవిత్వం చదవాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది. మనసు స్పందించి తెల్లటి కాగితాన్ని అక్షరాలతో అలకమంటుంది. పంచదార డబ్బాలు, చెట్టు చేమలు, దొండ పాదులు నాకు కొత్త గా కనిపించి వీణ వాణి గారి పదాలకు నృత్యం చేస్తున్నాయి. శిలాఫలకం బండరాయిలా దేనికి స్పందించని మనస్సును కూడా కంకర రాళ్ల శబ్దంలో కూడా మాధుర్యాన్ని చవి చూసేటట్టూ చేస్తుంది.

“శిలాఫలకం” లోని సాహిత్య గుబాళింపు పాఠకులకు రసానుభూతిని కలిగించి నూతన ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. The woods are lovely dark and deep, but I have promises to keep. miles to go before I sleep. and miles to go before I sleep …… అంటాడు Robert Frost. నిర్లిప్తత, నిర్వేదం, ఆనందం, ఉద్వేగం, సంతోషం ఇలా జీవితపు అన్ని రసాలను పరిచయం చేసి అన్నింటిని సమపాళ్లలో తీసుకుని ముందుకు సాగిపోమంటుంది మనోఫలకంపై నిలిచే శిలాఫలకం.

-AR. భారతి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక సమీక్షలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో