మనసు మెచ్చిన నీవు (కవిత)-చందలూరి నారాయణరావు

 

మనసు అద్దంలో
ఇష్టపడే ఆలోచనలను అక్షరాలతో

అలంకరించిన ప్రతిరూపమే
“నీవు”

కలకన్న ప్రతి భావాన్ని
కవితా పుష్పాలుగా మార్చి
పూజించిన ప్రతిఫలమే
“నీవు”.

మనసు మోసిన నిజాలతో
మౌనంగా జీవించిన
మధురానుభూతి
” నీవు”.

అక్షరాలా అభిమానాన్ని
ఊపిరిగా మార్చుకొని
ఊహలు కన్న బంగారు స్వప్నం
“నీవు”.

పరిమళించిన పరిచయంలో
పవశించిన ప్రతిక్షణానికి
ప్రతిరూపం
“నీవు”.

అనుకోని అదృష్టంలా
కలిసొచ్చిన చెలిమిలో
మనసు మెచ్చిన మనసు
“నీవు”.

-చందలూరి నారాయణరావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , Permalink

One Response to మనసు మెచ్చిన నీవు (కవిత)-చందలూరి నారాయణరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో