‘తప్పెటగుళ్ళు’ త్రిశతి – సామాజిక దృక్పథం(సాహిత్య వ్యాసం )- కొలిపాక అరుణ,

ISSN – 2278 – 478

ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళంలో పుట్టి ప్రపంచ ప్రఖ్యాతి గడించిన జానపద కళారూపం తప్పెటగుళ్ళు. అలాగే ఈ పద్యాలు కూడా జానపదుల గుండెల్లో కలకాలం నిలిచిపోవాలి అన్న ఆశతో ఈ పేరు పెట్టాను అంటున్న రచయిత దూడల రాములు శ్రీకాకుళం జిల్లా నీలంపేటలో 1- 1- 1947 వ తేదీన సత్యనారాయణ, చిన్నమ్మి దంపతులకు జన్మించారు.

1968వ సంవత్సరంలో డిప్లోమా పూర్తిచేసి జూనియర్ టెలికాం ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహించారు. ప్రవృత్తి నటన, రచనావ్యాసంగం. రక్త స్పర్స, వెంకన్న కాపురం, వీలునామా మొదలైన 60కి పైగా నాటకాలలో నటించారు. 15కు పైగా నాటకాలకు దర్శకత్వం వహించారు. పలు శతకాలు, కథలు, వ్యాసాలు, కవితలు వీరి కలం నుండి వెలువడ్డాయి. వాన జల్లులు శతకం, మందార మకరందాలు ద్విశతి , రాగ రంజితాలు ద్విశతి, రామణీయకం వీరి  ముద్రిత రచనలు.

వీరి నాటకరంగ, సాహిత్య సేవకు గానూ వీరికి అనేక బిరుదులు, పురస్కారాలు, సత్కారాలు లభించాయి. కళా దిత్య,కళా కౌముది, ఆప్తమిత్ర ,కళా రత్న, సేవా రత్న ,సాహితీ వైడూర్య మొదలైనవి వీరి బిరుదులు.

శతక నిర్వచనం :

‘శత’ అనే పదానికి ‘క’ అను ప్రత్యయం చేరడం వలన ‘శతకం’ వచ్చింది. ‘శతకం అంటే నూరు సంఖ్య కలది అని అర్థం.(శబ్దరత్నాకరం – బహుజనపల్లి సీతారామాచార్యులు- పుట – 886 )                                                           

“శతకములు భావగీతములను బోలిన వాజ్మయశాఖకు చెందినవని నిర్ణయించిరి. ఆంగ్లవాజ్మ యరీతుల లక్ష్యముతో శతక వాజ్మయరీతిని బరిశీలించినపుడీ నిర్ణయము యుక్తముగ దోచినను నీ పోలికయును నిర్ణయమును నసంగతములు. భావగీతములకును శతకములకును బోలికయుండదు. భావగీతములందు గవి ప్రకృతిన్వరూపముల గుణసౌందర్యములను గాని మనోభావములనుగాని మనోహరముగ వర్ణించుచు భావవికానమును గలుగజేయును. భావగీతముల గలుగజేయు భావవికానము మాననీకానందమును గలుగజేసినను నాత్మానందమును గలుగజేసి పురుషార్థమునకు బ్రయోజనకరముగాదు. శతకములు భావగీతముల కతీతమైన యాత్మానందమును గలుగజేయుచు పురుషార్ధమును బడయుటకు సాధనములగునున్నవి.”( శతక కవుల చరిత్రము – కే.శే.పండిత వంగూరి సుబ్బరావు పంతులు – పుట – 8)  అని వంగూరి సుబ్బారా అభిప్రాయం. “సంస్కృత ప్రాకృత శతకములలోని సంఖ్యానియమము, మకుట నియమ, మకుట నియమము, చందూనియామము, రచనీయమము, ఆత్మాశ్రయ కవిత దర్శము అను లక్షణము తెలుగు సతకములలో రూపుదిద్దినవాని డా.కే.గోపాల కృష్ణారావు గారు నిర్వచించారు.( తెలుగు సాహిత్య సమీక్ష– రెండవ సంపుటం – డాక్టర్.జి.నాగయ్య – పుట – 545)

ఈ తప్పెటగుళ్లు త్రిశతి 333 పద్యాలతో గుండె చప్పుడు, సృజన రాగాలు, ఎదలో సొదలు అనే ఉప శీర్షికలతో సాగింది. ఈ పద్యాలు ముక్తకాలు. వీటిలో సృజన రాగాలు “మంచి వినుడు అందు మంచి గనుడు” అనే మకుటంతో రాశారు. తక్కిన రెండు మకుట రహితాలు. వీరు మీ తప్పెటగుళ్ళు త్రిశతి ని కాశీ విశ్వేశ్వరుని స్తుతిస్తూ ప్రారంభించారు.

కాశీ విశ్వనాధ కరుణా సముద్రుడ

అన్నపూర్ణ సహిత ఆత్మ రూప

 రాయు శక్తినిచ్చి రాణింపు కలిగించి.                                                                                

పద్యమల్లు జ్ఞాన ప్రతిభ నిమ్ము

బ్రహ్మ దేవుని సృష్టిలో అమృతమయి అమ్మ .”ఆమె ఉన్న ఇల్లు ఆహ్లాద హరివిల్లు” అంటారు రచయిత. మగువల పట్ల ఎవరైతే మర్యాదగా ప్రవర్తిస్తారో వారికి సదా గౌరవం కలిగి మంచి జరుగుతుంది. అతివలను బాధించు వారు ఈ అవనిలో హీనులుగా పరిగణింపబడతారు.

ఒక వ్యక్తి తన ఉన్నతి కోసం, ఉద్యోగాల కోసమో ఉత్సాహంతోనో ఎన్ని భాషలు అయినా నేర్పవచ్చు. కానీ మన ఒక్క చర్య వలన “ఉమ్మనీరు భాష ఉగ్గుపాల భాష” మన మాతృభాషకు మాత్రం భంగం కలిగించకూడదు. మనిషి మాతృభాషలోనే ఎదుగుతాడు. మాతృభాషలో చదవడం, వినడం, రాయడం వలన జ్ఞానం విపులమవుతుంది. మన భాషకు పద్య సంపద అపురూపమైనది. మన భాషకు గొప్పతనం తేవడమే కాకుండా చిరస్థాయిగా నిలిచి ఉండే కీర్తిప్రతిష్టలు సంపాదించిపెట్టాయి అంటూ పద్య  సౌందర్యాన్ని, మాతృ భాష ఔన్నత్యాన్ని వివరిస్తూ అట్టి మాతృభాషను ఒక్క కలంపోటుతో ఇతర భాషలకు పట్టాభిషేకం చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు.

చిన్ని సన్నజాజి పువ్వు ఎంత పరిమళాలను వెదజల్లుతూ తన ఉనికిని కాపాడుకుంటూ ఉంటుంది. మరి అతి దుర్లభమైన మానవ జన్మ పొందిన మనం మన మంచి మాటలు, సత్ప్రవర్తన, సేవాతత్పరత లతో ఎంతటి పరిమళాలను వెదజల్లవచ్చో కదా! ఇది తెలుసుకుని మనలోని మాలిన్యాలను తొలగించుకుని గౌరవమర్యాదలు ప్రవర్తన వలన మాత్రమే సాధ్యమవుతాయి అని తెలుసుకుని ప్రవర్తించాలి. శాంతికాముకులు, ప్రశాంత వదనం కలవారు, నియమబద్ధంగా నిర్మలత కలిగి నిత్య సంతోషంగా ఉండేవారు తక్కినవారికి ఆదర్శం అవుతారు.     

వంటింటి దినుసులలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. పెరటి మొక్క వైద్యానికి పనికి రాదు అన్నట్టుగా వీటన్నిటిని పక్కన పెట్టి ప్రతి చిన్న దానికి ఖరీదైన వైద్యం కోసం పరుగులు తీయడం పరిపాటి అయిపోయింది. మనకి తెలియదు కానీ తెలుసుకోవాలి కానీ ప్రకృతిలో ప్రతి మొక్క గుణాలను కలిగి ఉంటుంది అంటూ…

ఒంటి రుగ్మతలకు వంటింటి దినుసులు

ఓషధులు గ వాడే  ఒప్పు గాను

ప్రకృతి యందు దొరుకు ప్రతి మొక్క ఔషధే

 తెలియ వలయు వాటి తీరుతెన్ను (తప్పెటగుళ్లు త్రిశతి – కళాదిత్య డి.రాములు – పుట – 37)

బద్ధకం అనర్థాలకు మూలం అంటూ పెద్దలు చెప్పే మంచి మాటలను పెడచెవిని పెట్టి గంటలు గంటలు సెల్ ఫోన్లో ఆటలతో, టీవీ ఛానల్ తో గడిపే చిన్నారులను సున్నితంగా హెచ్చరించారు రచయిత. సోమరితనం .

అనేది తాత్కాలిక సంతోషాన్నిస్తుంది ఏమోకానీ”భావి జీవితాన బాధ తెచ్చు ” అంటారు రచయిత. బాలలు అంటే అమ్మమ్మ తాతయ్యలు చెప్పే కథలు వింటూ చందమామని చూస్తూ అమ్మ పెట్టే గోరుముద్దలు తింటూ బడి ఈడు రాగానే తోటి పిల్లలతో కలిసిచదువులతో ఆటపాటలతో నచ్చిన కళలు నేర్చుకుంటూ నైపుణ్యాలను ప్రదర్శించడం పెద్దల చేత శభాష్ అనిపించుకోవడం ఇదే గుర్తు అని, నిన్నటి నేటి తరం వారు చెప్తారు కానీ నేటి బాలలు పెద్దయ్యాక వాళ్ళ బాల్యం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని అన్ని కళలు అటకెక్కాయి.

బడుల సెలవులందు బాల్యమ్ము విప్పారి

తళుకులీను లలితకళలు నేర్చి

“స్మార్ట్” భూత మొ చ్చి “ఆర్టు” ఆయువు తీసే

సృజన మంటగలిసి ” విజను ” కూలే

చిన్నపిల్లల సెల్ఫోన్ల వినియోగం ఈ విధంగా ఉంటే యుక్తవయస్కులు ఫేస్బుక్ ప్రేమ అంటూ ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియకుండా తెలుసు అన్న భ్రమలో మొండిగా పెద్దలను ఎదిరించి మరీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.”మోజు తీరినాక మోసపోయితి మంటు/ఇప్పుడు ఏడవ ఫలితమేమి ఉండు. వాట్సాప్ పరిచయాలు, ఫేస్బుక్ ప్రేమలు ఇవన్నీ భద్రత ఉన్న బాంధవ్యాలు కాదు సుమా అంటూ మందలిస్తున్నారు రాములు.

కళలను నమ్ముకున్న వారు కీర్తిప్రతిష్టలు సంపాదించుకుంటారు కానీ నేను మాత్రం వెనకేయ లేరు .నేటి నాగరిక ప్రపంచంలో నాటి కళలు కనుమరుగయ్యాయి అనేక కళలు ఆదరణ లేక కళాకారులు ప్రదర్శనలు లేక పైసాకు నోచుకోక పస్తులుంటున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పైసా యే పరమాత్మగా భావించి కాసులు కూడా పెట్టినవారు ఆస్తిపరులు అనుకుంటే పొరపాటే. అసలైన ఆస్తిపరులు ఎవరో కవి క్రింది విధంగా చెబుతున్నారు.

చీకు చింత లేని చిత్తముండేడి వారు

లేమినందు రుణము లేని వారు

పరుల మేలు కొరకు పరితపించు వారు

ఆత్మ తృప్తి ఉన్న ఆస్తిపరులు

రోజువారి నడక రోగాన్ని బడనీదు అని నడక మనిషి మానసిక శారీరక రుగ్మతలకు దివ్యౌషధమని ,అది మనిషిని రోజంతా ఆహ్లాదంగా ఉంచి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది అని, ఆయుర్దాయాన్ని పెంచుతుందని వెయ్యి పున్నములు(సహస్ర చంద్ర) దర్శనం చేసుకొని సంపూర్ణ మానవుడిగా జీవించగలమని యోగాసనాల యొక్క విశిష్టతను తెలిపారు. ఈ విధంగా “గుండెచప్పుళ్ళు” లో అనేక విషయాలు సూటిగా, సరళంగా, స్పష్టంగా శతక రూపంలో తెలియజేశారు.

సృజన రాగాలు :

మనిషి ఎంత సంపాదించినా ఎంత కూడబెట్టి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో తులతూగినా, రాజు అయినా బంటు అయినా, బీద అయినా భూస్వామి అయినా, పండితుడైనా పామరుడైనా మృత్యువు స్పర్శించిన మరుక్షణం మట్టిలో కలవాల్సిందే. బ్రతికుండగా జానెడు పొట్ట ,మరణించిన పిదప ఆరడుగుల నేల చివరికి భూమి మీద మిగిలేది మనిషి మంచితనం మాత్రమే. ఈ విషయాన్ని రాములు “నీది నాది అంటూ ఏది మనది కాదు” అనే పద్యంలో చెప్పారు.

లోకంలో ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయో అన్ని రకాల మందులు ఉన్నాయి. కానీ మనసు గాయ పడితే మాత్రం మందు లేదు. ఇక్కడ మనకు వేమన గారు చెప్పిన మనసు విరిగెనేని మరియంట నేర్చునా అనే పద్యం స్పురణకు వస్తుంది.

నేటి కాలమందు మేటగు దానంబు

అవయవదాన మొక్కటే ఆర్యులార

మరణ మంది కూడా మనను చిరముగుంచు

మాట వినుడు అందు మంచి గనుడు

ఆరోగ్యానికి ముప్పు తెచ్చే ముఖ్య ఆహార పదార్థాలు ఉప్పు కారం పులుపు అవి మితము తప్పి తినడం మంచిది కాదు నాలుక కోరినవన్నీ తినడం ఆరోగ్యానికి హానికరం అంటూ హెచ్చరించారు రచయిత.

మానవ సేవ మాధవ సేవ యువశక్తి, గెలుపు ఓటములు గూర్చి, శాంతి కాంక్ష, సృజనాత్మకత మొదలైన అనేక విషయాలను ఈ సృజన రాగాలులో చర్చించారు.

ఎదలో సొద లు:

నవ్వు నాలుగు విధాల మేలు అంటున్నారు నేటి వైద్యులు. నవ్వుతూ ఉండు రోజు నవ్వితే పోయేదేమీ లేదు అనే పద్యంలో నవ్వ కలిగిన ప్రాణి ప్రకృతిలో మనిషి మాత్రమే.

నవ్వుతూ సంతోషంగా ఉండే మనిషి శరీరంలో రక్త ప్రసరణ సజావుగా జరిగి మన ఆరోగ్యం పరి రక్షింపబడుతుందని, మానసిక ఒత్తిడి మటుమాయం చేస్తుంది అని నవ్వుతూ ఉండే వారి జీవితం పూలవనం లా ఉంటుంది అని సూచించారు.

28 నుండి 35 వ పద్యం వరకు నేటి అన్నదాత దయనీయ పరిస్థితిని మన కళ్ళకు కట్టినట్లు చూపించారు. మెతుకు లేనిదే బ్రతుకు లేదు. రైతుకు మాత్రం వెతలు తప్పడం లేదు . భూసారం తగ్గిపోయి, కల్తీ విత్తనాలు, ఎరువుల తో చెమట చుక్కల తో సేద్యం చేసిన, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక, దళారీల దాష్టికాలతో రైతన్న వెన్నుముక విరిగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.ఈ ఆకుపచ్చ చంద్రుడు అలిగి కన్నెర్ర చేస్తే దేశ ఆర్ధిక స్థితి కుదేలవుతుందని తన ఆవేశాన్ని, ఆక్రోశాన్ని వెలిబుచ్చారు డి.రాములు.

యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి ఆగడాలను ఏకరువు పెట్టారు.

అమ్మరో కరోన ఆగడమ్మును  ఆపు

అతలకుతలమయ్యే అవని అంత

మనుజ జాతి పట్ల మరణమృదంగమా

మరలిపొమ్ము జనుల మంచి కోరి

విద్య, వ్యాపార, రవాణా వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం అయ్యాయి. ఉన్నచోట ఉపాధిలేక, ఆదుకునే నాథుడు లేక ,తమ తమ నివాస స్థలాలకు వెళ్ళలేక వలస కూలీలు పడ్డ అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎంతో మంది కరోనా కోరల్లో చిక్కి అసువులు బాశారు వారందరికీ అక్షర నివాళి అర్పించారు రచయిత.

ఈ విధంగా సమాజంలోని పలు అంశాలను, విధ్వంసక మూలాలను ,రుగ్మతలను, సమస్యలను ఎత్తిచూపుతూ వాటికి పరిష్కార మార్గాన్ని అన్వేషించే దిశగా ప్రజలను జాగృతం చేసే విధంగా పద్య రత్నాలు “తప్పెటగుళ్ళు ” కళాదిత్య  డి . రాములు అందించారు.

ఆధార గ్రంధాలు:

  1. నాగయ్య జి తెలుగు సాహిత్య సమీక్ష -రెండవ సంపుటం

  2. రాములు కళాదిత్య డి – తప్పెటగుళ్లు త్రిశతి

  3. సిమ్మన్న వెలమల – తెలుగు సాహిత్య చరిత్ర

     4.సీతారామాచార్యులు బహుజనపల్లి – శబ్దరత్నాకరం

      5.సుబ్బరావు పంతులు పండిత వంగూరి – శతక కవుల చరిత్రము

 

– కొలిపాక అరుణ,

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో