తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని చిత్రించిన “కాలరేఖలు” నవల(సాహిత్య వ్యాసం )-ఏరుకొండ శ్యాంప్రసాద్‌

ISSN -2278 – 478 

అంపశయ్య నవీన్‌ రచించిన నవలాత్రయం నవలలో మొదటి నవల ‘కాలరేఖలు’ మిగిలిన నవలలు ‘చెదిరిన స్వప్నాలు , బాంధవ్యాలు’. 2004 సంవత్సరానికి గాను కాలరేఖలు నవల కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారాన్ని గెలుచుకుంది. సాహిత్యంలో అత్యున్నత పురస్కారంగా భావించబడే అ పురస్కారాన్ని ఇది వరకు కేవలం రెండు తెలుగు నవలలు మాత్రమే గెలుచుకున్నాయి. వాటిలో మొదటిది గోపీచంద్‌ 1961లో రచించిన ‘‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’’, రెండవది మాలతీ చందూర్‌ 1985లో రచించిన ‘‘హృదయ నేత్రి’’ ఈ గౌరవాన్ని దక్కించుకున్న నవలల్లో ‘‘కాలరేఖలు ‘’ మూడోది.

ఈ నాటికీ మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఎన్నో మూఢనమ్మకాల్ని చిత్రిస్తూ, ఈ నవలలోని కథా నాయకుడు రాజు ఆ మూఢ నమ్మకాల్ని అనుక్షణం ప్రశ్నిస్తూ, ఖండిస్తూ తనలోని శాస్త్రీయ దృక్పథాన్ని ఎలా పెంచుకున్నాడో చూపించడం. ప్రతిదాన్ని పెద్దు చెప్పారని గుడ్డిగా నమ్మడం కాకుండా వాటిలోని నిజానిజాల్ని స్వానుభవంతో తొసుకోవాలని ఈ నవలలోని రాజు పాత్ర ద్వారా రచయిత సందేశమిచ్చాడు. రాజులో బాల్యం నుండే శాస్త్రీయదృక్పథం ఏర్పడే క్రమాన్ని రచయిత ఎంతో మెలకువతో సూక్ష్మ దృష్టితో చిత్రించడం గొప్పగా ఉంటుంది.

పన్నెండేళ్ళను కథా కాలంగా తీసుకున్న ఈ నవలలో రాజు ప్రధాన పాత్ర. నవలంతా అతని దృక్కోణంలోంచే సాగుతుంది. నవల ప్రారంభంలో అతని వయస్సు నాలుగేళ్ళు. నవల పూర్తయ్యేనాటికి అతడు పదహారేళ్ళ నవ యువకుడిగా మనముందు నిలుస్తాడు. అలా రాజు అక్షరాభ్యాసంతో ప్రారంభమైన ఈ నవల అతడు మెట్రిక్యులేషన్‌ పరీక్ష రాయడంతో పూర్తవుతుంది. ఇలా ఈ నవల పైకి ఓ వ్యక్తి సాగించిన జీవితయాత్రలా కనిపించినా, నిజానికిది నవలా రూపంలో సాగిన సామాజిక చరిత్ర.

రాజు తండ్రి నర్సయ్య, చిన్నాన్న సత్తయ్య. ఒక సిద్ధాతానికి సంబంధించిన రెండు పార్శ్వాలకు ప్రతినిధులు. 1944లో భువనగిరిలో జరిగే పదకొండవ ఆంధ్రమహాసభకు ముందే సంఘం రెండుగా చీలిపోవడం. ఆంధ్రమహాసభ కోసం వావిరాల గ్రామంలో సన్నాహక సభలో ఊరి వారందరూ పాల్గొంటారు. ఆసభను నిజాంకు, దొరలకు వ్యతిరేకంగా నిర్వహించడంతో, వీరిద్దరి కోసం పోలీసు వెతుకుతుంటారు. నర్సయ్య దొరను ఆశ్రయించి అరెస్టు నుండి తప్పించుకుంటాడు. ఆ తర్వాత సభకు వెళ్ళడం మానేస్తాడు. సతైయ్య కోసం రజాకార్లు కూడా గాలిస్తారు, అతని కుటుంబాన్ని హింసిస్తారు.
ఆ కుటుంబంలోని స్త్రీలు వడిసెలు, కారం, రోకలిబండలతో రజాకార్లను ఎదుర్కొంటారు. రజాకార్ల భయంతో సత్తయ్య కుటుంబం బందరుకు వలసపోయి సంవత్సరం తర్వాత ఊరుకు చేరతారు. ఆ తర్వాత పోలీస్‌ యాక్షన్‌లోను, మిటరీ క్యాంపులోనూ సత్తెయ్యను లక్ష్యంగా చేసుకొని దురాగతాలు చేస్తారు. ఆ క్రమంలోనే రజాకార్లు బైరాన్‌పల్లి అనే గ్రామం మీద పెద్దయెత్తున దాడిచేసి ఒకేరోజు వందమంది యువకులను కాల్చి చంపుతారు. సెప్టెంబర్‌ 1948లో భారత ప్రభుత్వం హైదరాబాద్‌ సంస్థానంలోకి సైన్యాన్ని పంపించింది. దీనినే చరిత్రలో ‘‘పోలీసు యాక్షన్‌’’ అన్నారు. యేడో నిజాం రాజు సైన్యం భారత సైన్యానికి లొంగిపోయింది. సెప్టెంబర్‌ 17, 1948 నాడు హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత యునియన్‌లో విలీనం చేస్తారు.

1952లో ముల్కీరూల్స్ ని అంటే తెలంగాణ స్థానికులకే ఉద్యోగాలివ్వాలన్న నిజాం నవాబుగారి జీవోను అమలు పరచడంలో జరుగుతున్న అవకతవకల్ని సరి చేయాలన్ని ఉద్యమం చెలరేగింది. ఆ తర్వాత 1956లో పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఖరారు చేసుకొని భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలన్న కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగా తెలంగాణ జిల్లాలను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేసి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఇలా 1944లో ప్రారంభమైన ‘కాలరేఖలు’ నవల 1956లో తెలుగు మాట్లాడే ప్రజలంతా ఒక రాష్ట్రంగా ఏర్పడటంతో ముగుస్తుంది.

తన చిన్ననాడు విన్న సంభాషణలన్నీ నూటికి నూరుపాళ్ళు వాస్తవికంగా ఈ నవలల్లో రాశారు నవీన్‌. సంభాషణల్లో కూడా ఒకరి పక్షం తీసుకున్న ధోరణిలో రాయడం నునిశితత్వంలోని వైరుధ్యాలు బాగా సంఘర్షించే ఈ కాలంలో మనం ఊహించలేనంత వాస్తవిక సంభాషణలతో ఈ నవల నిండి ఉంది. ఆంధ్రమహాసభ, రజాకార్లు, బందగీ, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, ప్రజాకోర్టులు, పోలీసు యాక్షన్‌ ఇలాంటి అంశాలన్నీ ప్రత్యేక వివరాలతో చదివి, మనస్సులోని ప్రత్యేక స్థానాల్లో వుంటాం. కానీ అవన్నీ మన ముందే జరిగిపోతున్నట్లు సమాజ జీవితంలో ఒక భాగంగా కదిలిపోతున్నట్లు ఈ నవల చదువుతుంటే ఒక అనుభూతికి లోనౌతాం. కాలరేఖలులోని పాత్రులు అన్నీ సజీవాలే. ఈ నవలలోని రాజు, సుశీ, నర్సయ్య, రాధమ్మ, సత్యం, రుక్కమ్మ, సత్తెమ్మత్త, సోమయ్య, రఘురామయ్య, శేఖర్‌ మొదలైన ఎన్నో పాత్రలు సహజమైనవి.

ఈ నవలలోని స్త్రీ పాత్రలు రాధమ్మ, సత్తెమ్మత్త, ప్రమీల, సుశీల, రుక్కమ్మ, పార్వతమ్మ మొదలైన వాళ్ళు మామూలు గృహిణులుగా ఉంటూనే ఆనాటి పోరాటంలో ఎలా విరోచితంగా పాల్గొన్నారో రజాకార్ల లాంటి ముష్కరు నుండి తమను తాము ఎలా రక్షించుకున్నారో చిత్రించిన తీరు ఈనాటి స్త్రీలకు ఎంతో ఆదర్శంగా ఉంటుంది.

ఈ నవల రాసే నాటికి స్త్రీలకు అక్షరాస్యత చాలా తక్కువ మహిళలకు చదువుకునే అవకాశమే లేదు. నవల ప్రారంభంలోనే రాజు ‘’అక్కా నువ్వు కూడా చదువుకో’’ అంటే సుశీల నేనాడపిల్లను నన్నేవరు చదివిస్తారు. నువ్వంటే మొగపిల్లోడివి, నిన్ను చదివిస్తరు గానీ నన్ను చదివిస్తరా అంటుంది. అప్పుడు రాజు ఆడపిల్లలు చదువుకోవద్దా? అంటే చదువకుంటే ఆడపిల్లలు పాడైపోతారట అని బదులు చెప్పింది. అదే నాయనమ్మ, అమ్మమ్మల అభిప్రాయం కూడా అని చెప్పింది. రాజునాన్న, పెద్దనాన్నులు ఆడపిల్లలను బడికి పంపాలంటే ఒప్పుకోరు. అందువల్ల రాజు చిన్నయ్య సత్యం, సుశీలకు ఇంట్లోనే చదువు చెబుతూ ఉంటాడు. ఒక్క చదువు విషయంలోనే కాకుండా చాలా విషయాల్లో స్త్రీల పట్ల వివక్ష ఉంటున్నట్లు నవలను చదివితే అర్థమౌతుంది.

కాలరేఖలు చారిత్రక నవల తెలంగాణా ప్రజల ఆర్థిక, సాంఘిక, రాజకీయ జీవితాలలోని మార్పులను ఆధ్యంతం హృద్యంగా చిత్రించిన నవల ఇది. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది. రజాకార్లు అనేది ఉర్దూపదం. రజాకార్లు అంటే అసల అర్థం వాలంటీర్లు కానీ, రజాకార్లు దుర్మార్గ కార్యక్రమాలను ప్రజల అసహ్యించుకోవడంతో రజాకార్లు అంటే దుర్మార్గుల అనే అర్థం ప్రజల్లో ప్రబలింది. కాలరేఖలులో రజాకార్ల వ్యవహార శైలి, సరళిని రచయిత ఈ విధంగా వివరించాడు. ఖాసింరజ్వీ అనే మత ఛాందసుడు రజాకార్లను తయారు చేశాడు. హైదరాబాద్‌ రాష్ట్రంలోని హిందువులను ముస్లిరులుగా మార్చాలని కోరాడు. అందుకు అంగీకరించని వారిపై దాడులు చేయాలని అవసరమైతే వారిని చంపాలని కూడా ఆదేశించాడు. దీనికి నిజాం, రజాకార్లు, నైజాం పోలీసులు దొరల మద్దతు కూడా ఉంది. విస్నూరు దొర రజాకార్లకు డిప్యూటి కమాండర్‌, రజాకార్లు పరమదుర్మార్గులని వీరికి దొరల బలం కూడా తోడైందని సత్యం పాత్ర ద్వారా తెలుస్తుంది.

తెంగాణలో హిందువులు బతుకమ్మ పండుగను గొప్పగా జరుపుకునేవారు. బక్రీద్‌, పీరీల పండుగలను హిందూ ముస్లింలు కుల, మత బేధాలు లేకుండా జరుపుకునేవారు. తెలంగాణలో పాలకుర్తిలో పాలకుర్తి సోమనాథుని జాతర జరిగేది. అతి పెద్ద జాతర మేడారం. ఇది వరంగల్‌ జిల్లాలోని ములుగు మండములోని మేడారం గ్రామంలో గిరిజనులు జరుపుకునే పెద్ద జాతర. దీనికి తెలంగాణలోని ప్రజలందరు హాజరై వారి మొక్కులను సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు సమర్పించేవారు. ఈ పండుగను మూడు రోజులు జరుపుకుంటారని రచయిత ‘’కాలరేఖలు’’ నవలలో కళ్ళకు కట్టినట్లుగా వివరించారు.

దొరల దౌర్జన్యాలతో ప్రారంభమైన కాలరేఖలు నవల ఆంధ్రమహాసభలతో తేజరిల్లి, రజాకార్లతో విజృంభించి, కమ్యూనిష్టు సంఘాల కార్యకలాపాలతో పరాకాష్ట పొంది, పోలీసు చర్యతో పరిసమాప్తమవుతుంది. శాంతి సౌఖ్యాలతో విరాజిల్లుతున్న గ్రామాలు ఆయా సామాజిక, రాజకీయ పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతాయి. అమాయక ప్రజల రజాకార్ల క్రౌర్యానికి ఇటు సంఘాల కార్యకలాపాల ఒత్తిడికి గురై నానా యాతనల పాలవుతారు. ఉండి లేని కుటుంబాల వారు ప్రాణాలను అరిచేత పట్టుకొని దిక్కూముక్కూ తెలియని ఆంధ్ర ప్రాంతాలకు వలసపోయి నానా ఇబ్బందులు పాలవుతారు. ఆనాటి భూస్వామ్య వ్యవస్థలో మధ్య తరగతి కుటుంబాల ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఎదురైన సమస్యలను వారు అనుభవించిన బాధలను రచయిత చాలా విపులంగా వివరించారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగంగా జనగామ ప్రాంతంలోని ఆకునూరు, కడపెండి, పాలకుర్తి, బైరాన్‌పల్లి, ధర్మపురం, దేవరుప్పు పరకాల తదితర ప్రాంతాల్లో వెల్లువెత్తిన ప్రజాపోరాటాలను ఆనాటి సంఘటనలను నవీన్‌ కళ్ళకు కట్టినట్లు చిత్రించారు. ఇందులో కొన్ని నవీన్‌ బాల్యస్మృతులు కాబట్టి ఎంతో సహజంగా కనబడతాయి. విస్నూరు రాంచంద్రారెడ్డి కొడుకు బాపును ఆరోజుల్లో శిశుపాలుడు అని పిలిచేవారు. రజాకార్లను వెంటేసుకొని గ్రామాల వెంబడి తిరుగుతూ ఆడ, మగ అన్న విచక్షణ లేకుండా ప్రజల్ని చిత్రహింసులు చేశారు. ప్రజలకు అతనిపై ఉన్న ఆగ్రహావేశాలకు అతని గడిని ముట్టడిస్తే తప్పించుకొని ప్రాణభీతితో హైదరాబాద్‌ వెళ్తుంటే జనగాం రైల్వేస్టేషన్‌లో ప్రతీకారంతో ఊగిపోతున్న జనం పిచ్చికుక్కను చంపిన దానికంటే హీనంగా చంపుతారు. అంతేకాకుండా ఒక లంబడా స్త్రీ వచ్చి లంగా అడ్డంపెట్టుకొని వాని శవం మీద మూత్రం పోసింది. ఈ విషయాన్ని కూడా ఉన్నదున్నట్లు చెప్పారు. ‘’బాంచెన్‌ కాల్మొక్తా అన్న అలగాజనమే బద్మాష్‌ బందూక్‌తో కాలుస్తా’’ అనే దాకా ఎదగడమే తెలంగాణ సాయుధరైతాంగ పోరాటం. ఫ్యూడల్‌ శక్తులపై తిరగబడ్డ ప్రజాపోరును చదువుతుంటే ఒక్కో సంఘటన ఒక్కో సంచలనంగా అనిపిస్తుంది.

కాలరేఖలు నవల కాదు, చరిత్రకు సాక్ష్యం, నాటి నిజాం రాచరిక వ్యవస్థాకు సజీవసాక్ష్యం కాలరేఖలు నవీన్‌ అంతర దృష్టికి తాత్విక మనస్తత్వానికి దర్పణం.

ఆధార గ్రంథాలు:
1) తెలంగాణ కాలరేఖలు మూల్యాంకనం – అయియ్య బన్న(సంపా.)
2) కాలరేఖలు – అంపశయ్య నవీన్‌
3) చాకలి ఐలమ్మ – ఎకట్టె శంకర్‌ రావు
4) డా.అంపశయ్య నవీన్‌ జీవితం – సాహిత్యం – డా॥వి. వీరాచారి(సంపా.)
5) నిత్య నవీనుడు – సప్తతి ప్రత్యేక సంచిక -అంపశయ్య
6) తెలంగాణ పోరాట స్మృతు – ఆరుట్ల రాంచంద్రారెడ్డి

ఏరుకొండ శ్యాంప్రసాద్‌,
పరిశోధక విద్యార్ధి,
కాకతీయ యూనివర్సిటీ వరంగల్‌,

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో