బర్బాత్ (కవిత )- గిరి ప్రసాద్ చెలమల్లు

 

 

 

 

 

 

ఔను
వాడెవ్వడో
పడుకుంటే లేపటానికి
పళ్ళాలు గిన్నెలు గ్లాసుల శబ్దాలు
చాలక
మా మేళాలు తాళాలు
మా డప్పులు మా కంజర లు కూడా మోగాయి

మా చేతుల్లో రూపు దిద్దుకున్న
బాడిసెలు శూలాలు సుత్తులు కూడా
ప్రయోగించారు
నేను చూడలే
మీరు వ్రాసుకున్న పుస్తకాల్లో చదివినట్లు గుర్తు
మాకేమీ తెలియదు

మాకు తెలిసింది ఒక్కటే
ఆరుగాలం శ్రమించి
పొట్ట పోసు కోవడమే
చేతికొచ్చిన పంటను కాపాడుకోవటం లో
ఎత్తైన మంచె మా ఆలోచనల్లోంచి పుట్టిందే
వడిసేల్లో రాళ్ళు నింపి పక్షులను తరుముతాం
చంపం సుమా
కాగడాలు వెలిగించి టపాసులు కాల్చి
అడవి పందులను చెదర గొడతాం
మా గొడ్లను ముల్లు కర్ర గుచ్చీ గుచ్చక

ముందే చలనం మొదలై పరిగెడతాయి
మీరేందిరా అంగుళం కూడా కదలరు

మా అనుభవంలో ఎన్నో ఉత్పత్తుల సాధించాం
ఏ ఏటికా ఏటికి రాటు దేలతాం
మీరేమో మూర్ఖత్వంతో వెనక్కి
కొత్త గా సృష్టించే శక్తి మా మెదళ్ళకు మా చేతులకి
మీకు మెదడుందనే సంగతే మరచి పోతున్నారే

వెలిగించిన కొవ్వొత్తులు ఆరిపోతున్నాయి
మోగించిన తపేలాలు నిండుకుని పళ్ళాల్లోకి

ఓ గరిట ముద్ద కూడా కరవై విలవిల లాడుతున్న జీవితాలు
గద్దె కోసం జులుసులు బాహాటంగా
విజ్ఞాన శాస్త్రం జొఱ్ఱని మెదళ్లతో వీధుల్లో

మలమూత్రాల మందులంటూ
లోకం నివ్వెరపోతుంటే
సిగ్గు తో తలదించుకుంటుందీ సంఘం
ఏది మందో తెలియని అయోమయంలో వుంటే

మీరు మనుషులే కాదనుట ఖాయం సుమా!
మా మెదళ్ళ కూ అక్షరం చేరింది
మీ ఆటలిక సాగవురా
అబద్ధాల పునాదుల మీద నిర్మితమైన
జాతి మనజాలదు

– గిరి ప్రసాద్ చెలమల్లు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో