రాజకీయ మణి పూసలు -డా.వూటుకూరి.

 

 

 

 

 

కప్పల తక్కెడ ఎక్కేసి
బలహీనులను తొక్కేసి
నాయకుడిగ ఎదిగినాడు
అసమానతలు రాజేసి

అధినేత దేవుడనుచు
అధికారం ప్రాణమనుచు
భజన చేయు నాయకుడు
పదవి లేక తిరగ బడుచు

నల్లేరు మీద నడక
పల్లేరు ప్తేన పడక
సాధించుట సులువుకాదు
జిల్లేడు పాలు పితక

సంతోషం సగం బలం
ఎంతయినా మనదే జయం
శత్రువును బంధించాక
ఎదురులేదు మనసుహయం

గద్దెమీద నేతలార
కలుగులోని పీతలార
జనమిచ్చిన అధికారం
వీడకండి కోతులార

అసెంబ్లీలొ అరవడం
మ్తెకుల్నిలా విరవడం
ఏమిటీ విద్వంసం?
విలువల్ని చెరచడం

అధికారపు చందమామ
పథకాలకు మేనమామ
కడదాక సాగుతుందా
మదిలోని ఈ ధీమా

కొలను కడుపున చేపలు
వలనువిసిరెను కాపులు
అదునుకోసం కొంగలు
ఎదురుచూసెను మాపులు

-డా.వూటుకూరి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో