ఊపిరే శ్వాసగా!’-సుజాత.పి.వి.ఎల్,

 

 

 

 

 

 

మనసు లోతుల్లోని భావాలను

వెలికి తీసి స్పందింపజేస్తుంది నీ ప్రేమ

అనుభూతుల జ్ఞాపకాలను

అనువదింపజేస్తుంది ….

అరవిచ్చిన కలువల్లా

జీవితంలో ఆశల్ని రేపుతోంది ..

మెలకువలో స్వపంలా

వింతగా అనిపిస్తోంది. .

ముంగింట్లో విరిసిన ముద్ద మందారంలా

ముగ్ద మోహనంలా అగుపిస్తోంది ..

దిగంతాల తీరం దాటి

‘మది’ని విహరింపజేస్తుంది ..

‘ఇదీ’..అని తెలుపలేని

మధుర స్పందనని కల్పిస్తోంది ..

నూతన ప్రపంచంలోకి

‘రా…రమ్మని’ఆహ్వానం పలుకుతోంది..

ఆమనిలో వీచిన వింజామరలా

సుతారంగా స్పృశింపజేస్తుంది ..

నిశ్శబ్ద తీరంలో సెలయేటి గలగల హోరు

స్పష్టంగా వినిపింపజేస్తోంది..

మదిని నింపే మధురోహల

పరిమళాలతో పరవశింపజేస్తోంది …

నీ జ్ఞాపకాల జడివానలో

ఉక్కిరి బిక్కిరి చేస్తోంది నీ ప్రేమ ..

నీ ఊపిరే శ్వాసగా ..

నిరంతరం నన్ను బ్రతికిస్తోంది ‘నీ ప్రేమే’ ..!

 

-సుజాత.పి.వి.ఎల్.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో