నిత్య వాసంతం నవ్వు (కవిత )-యల్ యన్ నీలకంఠమాచారి

 

 

 

 

 

నవ్వరా తమ్ముడు నవ్వరా

నవ్వుతు జీవనం సాగించురా

ధనమెంత గుమ్మరించినా

బలమెంతో చూపించినా

అదలింపు బెదిరింపుజేసినా

నవ్వును నీవు పొందలేవురా

ఆకాశ సౌధాలనున్నను

స్వర్గసుఖాల తేలుతున్నను

అన్నిటిని చేజిక్కించుకున్నను

ఆహ్లాదభరిత హాస్యం లేనిదే వ్యర్థం

పేదరికము ఎక్కిరించుచున్నా

అర్ధాకలిగా కడుపుమాడుతున్నా

ఉన్నదానితోనే కాలంగడుపుతు

సాగేజీవుల పెదాలచిరుహాసం చూడు

ఏమాత్రం కల్మషం కానరాని నవ్వే

చిరుపాప బుగ్గల పొంగారే నవ్వే

అరవిరిసిన మల్లియ దరహాస నవ్వే

వెలకట్టలేని సిరి వెన్నెల

పూబోణి ఆ నవ్వే

ఆ పూబోణి పరిమళాలు

ఆ దరహాస మధురరుచులు

ఆ మందహాస నవ్య చంద్రికలు

అందరి జీవితాల కూడిన వేళల

ఆవేళ మహదానందకరం

ఆ జీవితాలు శోభాయమానం

అందుకే ఇవ్వాలి నవ్వుకు ప్రాధాన్యం

నవ్వుతోమమేకమై సాగాలిమనం

ఆ రోజే ఎలాటి కష్టాన్నైనా

మనం ఎదిరించి నిలబడగలం

– యల్ యన్ నీలకంఠమాచారి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో