జనపదం జానపదం- 15- నాయికపోడు జీవన విధానం -భోజన్న

జీవితంలో ఆనందం ఎక్కువగా ఉండి భరించలేని వారు కొందరైతే జీవితంలో విషాధచ్ఛాయలు అలుముకుని కూటికి ఆరాటపడే వారు మరికొందరు సమాజంలో మనకు కనిపిస్తుంటారు. చదువుకు దూరముగా అభివృద్ధి మంత్రమే అంటకుండా కొండల్లో, కోనల్లో, అడవుల్లో, చెలకల్లో, గడీల్లో, భూస్వాముల గుప్పెట్లో పామరులుగా మగ్గిపోతున్న గిరిజనులెందరో ఈనాటికీ గలరు.వీరందరికి వారి జీవన విధానమే తెలుసు అంతకు మించిన ఆలోచనే వీరికి రాదు కారణం వీరు ఈ పరిధిలో మాత్రమే ఆలోచించే శక్తి కలవారు.

గిరిజన తెగల్లో నాయిక పోడు ఒకటి. వీరు పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తుంటారు. ఈ తెగకు నాయకుడు ఉండడం వల్ల నాయిక పోడు అనే పేరు వచ్చింది. (రవి కుమార్ 34 సంవత్సరాలు, నిజామాబాద్) నాయక పోడు వారిని నాయకపోడు, నాయికపోడు, న్యాకపు పోడు, న్యాకపోళ్ళు మొదలైన పేర్లతో పిలుస్తారు. వీరు కొండల్లో కాకుండా గ్రామాల్లో కూడా స్థిరపడి ఉంటారు. కొద్ది సంఖ్యలో మాత్రమే గ్రామాల్లో భూస్వాముల దగ్గర జీతగాళ్లుగా ఉంటున్నారు. ఈ తెగకు చెందిన వారందరూ, ఒకే చోట ఒకే సమూహంగా ఏర్పడి గూడాన్ని తయారుచేసుకుంటారు.

ఆ గూడాలకు విచిత్రమైన పేర్లు పెట్టుకుంటారు. ఈ పేర్లు వారికి విచిత్రంగా అనిపించవు కానీ గిరిజనేతరులకు కొత్తగా అనిపిస్తాయి. ఉదాహరణకి అప్పకుంట, మేరుగుట్ట, అసునూరి గూడెం,(బీర్పూర్ మండలం) దుబ్బల గూడెం, అక్సాయ్ పల్లి, కాలిపేయిన గూడెం, చెరువుమీది గూడెం(ధర్మపురి మండలం) బీర్సాయిపేట్ గూడెం, బొప్పేట గూడెం, గంగాపూర్(ఊట్నూర్) మైసంపేట్. వీరి జీవన విధానం నాగరికులకి, గ్రామీణులకు, మిగతాగిరిజనులకీ కూడా కొంత భిన్నంగా కనిపిస్తుంది. గ్రామాల్లో ఉండడం వల్ల గ్రామంలోని పద్ధతులు ఆచారాలు కొండల్లో ఉండి రావడం వల్ల కొండ ఆచారాలు కలగలిపి కనిపిస్తాయి.

పచ్చని తీగలు ఆకులు కాయలు చెట్లతో వీరి ప్రాంతం ఆహ్లాదంగా ఉంటుంది. వీరు నిజాయితీకి పెట్టింది పేరుగా చెబుతుంటారు. క్రైమ్ రేట్ కూడావీరి గూడాలలో చాలా తక్కువగా ఉంటుంది. చిన్న చిన్న తగాదాలు ఏర్పడితే నాయక్ వీటిని పరిష్కరిస్తాడు. నాయక్ ని దాటి ఏ ఒక్కరు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లరు. ఇప్పటికీ పోలీస్ స్టేషన్ కు వెళ్లని గూడాలు నేటికీ మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు అక్సాయి పల్లె ధర్మపురి మండలం జగిత్యాల జిల్లా వీరి గూడెం మొత్తం ఒకే మాటపై ఉంటారు. దీనిని మనం వాడే కట్టుతో పోల్చవచ్చు.

నేటికీ వీరు తెగ నాయకుని ద్వారా వారి సమస్యలను పరిష్కరించుకుంటారు.
నాయకపోడు తెగవారు అడవులకు దగ్గరగా ఉండడంచేత వేటను, కంద దుంపలను, తౌసి బంకను, ఇప్పపువ్వు ఏరడం, తునికాకు తెంపడం, కట్టెలను అమ్మడం ఆధారంగా చేసుకుని జీవిస్తుండగా, గ్రామాల్లో నివసిస్తున్న వారు వ్యవసాయం, పాడి పశువులు, కోళ్ల పెంపకం, మేకల పెంపకం, మేకలు కాయడం, ట్రాక్టర్ డ్రైవర్, చాపలు పట్టడం, తడకలు అల్లడం, వడ్లపని, జీతగాళ్లుగా జీవిస్తున్నారు. వీరి తెగలోని ఆడవారు కూలి పనులు, వ్యవసాయ పనులు చేస్తారు. పూర్వం వేటలోను పురుషులకు సహకరించేవారు. స్త్రీపురుషులు ఇరువురు పనులు చేయడంలో తమ శక్తిని వినియోగిస్తారు. యజమానికి నమ్మినబంటుగా ఉంటూ అనేక సంవత్సరాలు ఒక యజమాని దగ్గర కుటుంబంలో ఒకరిగా మెలుగుతారు. తరతరాలుగా ఒకరి దగ్గరే సహాయకులుగా కుటుంబమంతా పనులు చేయడం అక్కడ అక్కడ మనకు నేటికీ కనిపిస్తారు. నాయకపోడు తెగ వివిధ రకాల దేవుళ్లను పూజిస్తారు. పాండవులలో ఒకడైన భీముని భీమ దేవునిగా, పాండవులు పాండు రాజులుగా, రాజులు అనే దేవతను పెద్దయ్య దేవునిగా, అరగొండల రాజులు, చిన్నయ్య దేవునిగా పూజిస్తారు.

వీరి దేవతార్చన విభిన్నంగా ఉంటుంది. వీరికి తెలిసిన పూజా విధానంలోనే దేవతలను అర్చిస్తారు. ప్రతి దేవుని పూజించడానికి సంవత్సరంలో ఏదో కొంత సమయం కేటాయించి జాతరలు జరిపిస్తారు. వీరి పూజా విధానంలో అందరూ కలిసిమెలిసి ఆనందంగా నిర్వహిస్తారు. దేవుని పూజలో జాతరలో వివాహ మొదలైన పండుగల్లో మద్యం తీసుకుంటారు. గుడుంబాతో వీరి జీవితం ఎక్కువగా ముడిపడి ఉండేది. రానురాను వైన్ షాపులు అధికం కావడం వలన గుడుంబాని ప్రభుత్వం నిషేధించిన తర్వాత ఇతర అవకాశాల వైపు మళ్లారు. అంతేకాదు రోజంతా పని భారంతో ఇంటికి చేరగానే మద్యం సేవించేవారు. కొందరైతే ఉదయం లేవగానే మద్యంతో మొదలుపెట్టి పడుకునే వరకు మత్తుతోనే పనులు చేసేవారు చాలామంది ఉన్నారు. మీరు జీవితాంతం మత్తులోనే చిత్తై పోతారు.

-భోజన్న

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో