గజల్-20 – ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

గజల్ ప్రేమికులకు నమస్కారం. సువిఖ్యాత గజల్ కవి జనాబ్ మహమ్మద్ ఫైజ్ వ్రాసిన ఓ అద్భుతమైన గజల్ ను అనువదించే ప్రయత్నం చేసాను. మన జీవనశైలికి అనుగుణంగా భాషకి అనుగుణంగా మూలానికి చాలా దగ్గరగా ఉండేలా స్వేఛ్చానువాదం చేయడం జరిగింది. ఈ గజల్ ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. దీనికి నేను అందించే విశ్లేషణకంటే పాఠకులు అనుభూతిస్తూ ఈ గజల్ ను చదివితే “నిను తాకిన పరీమళము కొత్త పైటలేస్తున్నది నీ చిత్రము పూలపాట పాడుతోంది రేయంతా”… నాకు ఎంతగానో నచ్చిన షేర్ … ఫైజ్ భావుకతకి సలాం చేయాలనిపించే భావం ఇది.

అనువదించిన గజల్ :

నీ తలపే మనసులోన నిండుతోంది రేయంతా
ఈ వెన్నెల గుండెలోన గుచ్చుతోంది రేయంతా

ఒకోసారి వెలుగుతుంది ఒకోసారి ఆరుతుంది
శోకం నిండిన దీపం మినుకుతోంది రేయంతా

నిను తాకిన పరీమళము కొత్త పైటలేస్తున్నది
నీ చిత్రము పూలపాట పాడుతోంది రేయంతా

పూలగుత్తులున్న కొమ్మ నీడలోకి పిలుస్తోంది
మన వలపుల కథలన్నీ అల్లుతోంది రేయంతా

తిరిగిరాని వారికొరకు గుండెతలుపు తపిస్తోంది
గడియతోటి సడిచేస్తూ పిలుస్తోంది రేయంతా

ఆశపడే పిచ్చిమనసునూరడించలేకున్నా
ఒక కోరిక సతాయించి చంపుతోంది రేయంతా

-ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో