భవిష్యత్తు(కవిత )-గిరి ప్రసాద్ చెలమల్లు

 

 

 

 

అదో గుబురు తోట
గుబురు గడ్డంతో గతంలోకి

కలిసి చెప్పుకున్న ఊసుల లోకంలో
మోగిన తంతులు
పలవరించిన మేనులు
ధమనులు సిరల్లో రుధిర జలపాతాల కేరింతలు

ఆకాశం గొడుగు కింద రెండు దేహాలు ఒకటిగా
చలిలో జల్లుల్లో ఎండలో తెలియనితనంతో మొదలై
తెల్సుకునే సరికి కాళ్ళకింద భూమిలో చలనం

కాలం గుండ్రటి గడియారం అంకెల దాటి
కళ్ళల్లో దాగుడు మూతలు ఆడుకుంటుంటే
గుండెల్లో అలారం మోగిన క్షణాలు

చేతి వేళ్ళు కలుస్తునప్పుడు
స్పందనలో దేహం పరవశం మనసు నిండా
గుండె లోతుల్లో తడి ఆరదెన్నటికీీ
తీయని ఊహల పల్లకీ అది
అలా అలా యాదిలో తేలుతూనే ఊరేగుతుంది
చేతి వేళ్ళు వీడుతున్నపుడు
వేదన కనుపాపల చుట్టూ కేంద్రీకృతమైన ఉప్పెన
ఎప్పుడు పెల్లుబుకుతుందో తెలియని ఆందోళన

తొలి చూపులోన
మీటే రాగాలు ఎదురుచూపుల్లో శ్రుతినందుకుంటూ
కొత్త పుంతల్లో మమేకం
ఎలా మొదలౌతుందో
మలుపులెలా తీసుకుంటుందో
ముద్రించుకున్న చిరునామా చెరగని జ్ఞాపకం
శిలా శాసనం గా

కాటు వేసే కాలమో
వేటు వేసే కులమో
మాటు వేసి మట్టు పెట్టే మతమో
మధుర గీతాల గుండెల్లో
మారణ హోమానికి బీజం వేసేందుకు సర్వ సన్నద్ధం గా

బెదిరింపులు అదిరింపులు
మనసుల విడదీసి
మనుషుల కలిపి ఏకం చేసామనే భ్రాంతిలో
నాలుగు గోడల మధ్య మానసిక వ్యభిచార రొంపిలోకి
ఎన్ని గదులో చూడలేక వెలిసి పోతున్నాయి

ఆరుబయట కలుసుకున్న కళ్ళల్లో తన్మయత్వం
గుండె గదుల్లో ప్రకంపనల హోరు కాంచని
దేహాలు సుడిగుండంలో చిక్కుకుని
చిన్నాభిన్నమై రేపటి తరానికి
అందించాల్సిన అమూల్య సంపద ని
గదిలో పాతేసి సమాధి పై
జయహో సనాతనం లిఖితం
ఇదో మానసిక దౌర్బల్య సంఘ పోకడ

– గిరి ప్రసాద్ చెలమల్లు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో